నష్టాల్ని మిగిల్చిన నాని సినిమా


Krishnarjuna Yuddham buyers shocked with returns నాని ద్విపాత్రాభినయం పోషించిన చిత్రం ” కృష్ణార్జున యుద్ధం ” బయ్యర్లకు నష్టాల్ని మిగిల్చింది . నాని నటించిన సినిమాలన్నీ వరుస విజయాలు సాధిస్తుండటంతో నాని పై ఉన్న నమ్మకంతో కొన్నారు కట్ చేస్తే మొదటి రోజునే ప్లాప్ టాక్ తెచ్చుకుంది కృష్ణార్జున యుద్ధం చిత్రం . అయితే ఫస్టాఫ్ బాగుండటంతో పాటు నాని మీదున్న క్రేజ్ తో ఓ మోస్తరు వసూళ్లు వచ్చాయి . దాంతో బయ్యర్లు కాస్త ఊపిరి పీల్చుకున్నారు .

మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా 15 కోట్ల షేర్ వచ్చింది , మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నాని సరసన అనుపమా పరమేశ్వరన్ , రుక్సార్ లు నటించారు . మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వచ్చిన రెండు చిత్రాలు హిట్ కావడంతో ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతాడని ఆశించాడు . కానీ మేర్లపాక గాంధీ హ్యాట్రిక్ మిస్ కావడంతో నిరాశగా ఉన్నాడు . ఇక నాని విషయానికి వస్తే …… కృష్ణార్జున యుద్ధం ఇచ్చిన షాక్ తో కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు .