ఆ ఛానల్స్ ని ఇప్పుడే బ్యాన్ చేయడం లేదు


maa-ban-on-telugu-news-channels-put-on-holdటివి 9 , టివి 5 , ఏబీఎన్ ఆంధ్రజ్యోతి , మహా న్యూస్ ఛానళ్ల ని బాయ్ కాట్ చేయాలనీ పవన్ కళ్యాణ్ పిలుపు నివ్వగా , పవన్ పిలుపు తర్వాత పలు దఫాలుగా సినీ ప్రముఖులు సమావేశమయ్యారు దాంతో సదరు ఛానళ్ల పై నిషేధం విధించబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది . కొన్ని ఛానళ్ల ని బ్యాన్ చేస్తే సహించేది లేదని ఎడిటర్ ల సమావేశం లో తీర్మానించారు అంతేకాదు మీడియా జోలికి వచ్చి ఇబ్బంది పడటం తప్ప మరో ప్రయోజనం ఏమి లేదని సినిమా రంగానికి సూచనలు చేసారు దాంతో నిన్న కొంతమంది సినీ ప్రముఖులతో జర్నలిస్ట్ నాయకులు అల్లం నారాయణ నేతృత్వంలో సమావేశం జరిగింది . ఈ సమావేశంలో జరిగిన చర్చ ల ప్రకారం బ్యాన్ అంశం మరుగున పడినట్లు తెలుస్తోంది .

అయితే సినిమా రంగం వాళ్ళు నేరుగా ఏ ఛానల్ ని బ్యాన్ చేయాలనీ నిర్ణయం తీసుకోలేదు బ్యాన్ అనే పదం వాడటం వల్ల మరిన్ని సమస్యలు వస్తాయి కాబట్టి సహాయ నిరాకరణ పేరుతో యాడ్స్ ఇవ్వకుండా చేస్తే సరిపోతుందని అనుకున్నారు కానీ ఈలోపు సమాచారం లీక్ కావడంతో చక చకా జర్నలిస్ట్ నాయకుల సమావేశం ఆ తర్వాత సినిమా ప్రముఖులతో సమావేశం జరగడం వల్ల బ్యాన్ అంశం పక్కకు పోయింది . ఇప్పట్లో బ్యాన్ చేయరట కానీ పరిస్థితి ఇలాగె కొనసాగితే మాత్రం కొన్ని ఛానళ్ల కు సహాయ నిరాకరణ చేయడం ఖాయం . ప్రస్తుతానికైతే బ్యాన్ అంశం పక్కకు తప్పుకుంది కాబట్టి సదరు ఛానల్ వాళ్ళు కూడా హ్యాపీ .