రకుల్ చెబుతుంది అంతా అబద్దాలేనట


madhavilatha fire on rakul preet singhసినిమా రంగంలో హీరోయిన్ లను కానీ మిగతా వాళ్ళని కానీ పలువురు దర్శక నిర్మాతలు , హీరోలు వాడుకుంటున్నారని అంతేకాకుండా రాజకీయ నాయకుల పక్కలో కూడా పడుకోబెడుతున్నారని కానీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం అదంతా వట్టిదే అని మీడియా ముందు చెబుతోందని ఆమె చెబుతున్నదంతా అబద్దాలేఅని సంచలనఆరోపణలు చేస్తోంది మాజీ హీరోయిన్ మాధవీలత . సినిమా రంగంలో అందునా తెలుగు సినిమా రంగంలో కాస్టింగ్ కౌచ్ మరీ ఎక్కువగా ఉందని అంటోంది మాధవీలత .

రకుల్ ప్రీత్ సింగ్ కు ఇప్పుడొస్తున్న అవకాశాలు రాకుండా పోతాయని భయపడి తెలుగు సినిమా రంగంలో కాస్టింగ్ కౌచ్ లేదని , నాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదని అబద్దాలు చెబుతోందని రకుల్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది మాధవీలత . నచ్చావులే చిత్రంతో పాటు పలు చిత్రాల్లో నటించింది మాధవీలత అయితే ఆ సమయంలో పలువురు మాధవీలత ని ఇబ్బంది పెట్టారట అందుకే నిప్పులు చెరుగుతోంది .