మహానటి సావిత్రి కూతురు , కొడుకు వీళ్ళే


mahanati savitri childrens satish and vijaya chamundeshwariమహానటి అనే పదానికి నిలువెత్తు నిదర్శనం సావిత్రి , నటిగా తెలుగు , తమిళ , మలయాళ , కన్నడ ప్రేక్షకులను అలరించి అగ్ర హీరోలతో పోటీపడి మరీ రెమ్యునరేషన్ అందుకున్న అసలు సిసలైన మహానటి సావిత్రి . విషాద సంఘటనలతో ప్రారంభమైన సావిత్రి జీవితం అజరామరమైన విజయాలను అందుకొని శిఖరాగ్ర స్థాయికి చేరుకున్న ఆమె జీవితం అనూహ్యంగా విషాదకరంగా ముగియడంతో తెలుగు ప్రజల్లో సావిత్రి పట్ల ప్రగాఢమైన సానుభూతి ఉంది . తనదైన మేటి నటనతో ప్రేక్షకుల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేసింది సావిత్రి దాంతో ఆమె చనిపోయి 38 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికి ఆమెని ఆరాధించే హృదయాలు ఎన్నో ఎన్నెన్నో !

తాజాగా మహానటి సావిత్రి బయోపిక్ గా మహానటి చిత్రం రావడంతో ఆమె జీవితం గురించి మరింతగా తెలుసుకోవాలని …. ఆమె కూతురు విజయ చాముండేశ్వరి , కొడుకు సతీష్ గణేశన్ ల గురించి కూడా తెలుసుకోవాలనే తహతహ పెరిగింది ప్రేక్షకుల్లో ! అలాగే సతీష్ గణేశన్ గురించి ,విజయ చాముండేశ్వరి గురించి గూగుల్ లో కూడా బాగానే సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు . సావిత్రి – జెమినీ గణేశన్ దంపతులకు విజయ చాముండేశ్వరి , సతీష్ గణేశన్ లు సంతానం . అయితే వాళ్ళు సినిమా రంగంలోకి రాలేదు దాంతో వాళ్ళ గురించి ప్రేక్షకులకు పెద్దగా తెలీక పోవడంతో మహానటి సినిమా విడుదలైన సందర్భంలో విజయ చాముండేశ్వరి , సతీష్ గణేశన్ ల గురించి నెట్ లో బాగా సెర్చ్ చేస్తున్నారు .