పాత సినిమాని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు


mahesh babus takkari donga to be dubbed in tamilమహేష్ బాబు 2002 లో తెలుగులో నటించిన చిత్రం ” టక్కరి దొంగ ”. జయంత్ సి పరాంజీ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ చిత్రం అంతగా ఆడలేదు కానీ మహేష్ బాబు కు మాత్రం ప్రత్యేకంగా నిలిచింది . అయితే ఇన్నాళ్ల తర్వాత ఈ చిత్రాన్ని తమిళ్ లో డబ్ చేస్తున్నారు . 16 సంవత్సరాల క్రితం విడుదలైన ఈ టక్కరి దొంగ చిత్రాన్ని ఇప్పుడు ” వెట్రి వీరన్ ” పేరుతో డబ్ చేస్తున్నారు . రేపు తమిళనాట ఈ సినిమా రిలీజ్ కానుంది .

 

ఇప్పుడు ఈ సినిమాని అక్కడ ఎందుకు డబ్బింగ్ చేస్తున్నారో తెలుసా ……. ఆమధ్య మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ అనే తెలుగు , తమిళ బాషా చిత్రంలో మహేష్ నటించిన విషయం తెలిసిందే . స్పైడర్ ద్వారా మహేష్ తమిళ చిత్ర రంగానికి పరిచయమయ్యాడు . ఆ సినిమా ప్లాప్ అయినప్పటికీ మహేష్ కు కాస్త క్రేజ్ ని తెచ్చిపెట్టింది . దాంతో ఈ సినిమాని రేపు విడుదల చేస్తున్నారు .