చరణ్ రికార్డ్ ని బద్దలుకొట్టిన మహేష్


mahesh beats the Chennai records of Ram Charan’s Rangasthalamరంగస్థలం చిత్రంతో చరణ్ సృష్టించిన రికార్డ్ ని బద్దలు కొట్టాడు మహేష్ బాబు . నిన్న విడుదలైన మహేష్ చిత్రం భరత్ అనే నేను చైన్నై లో 27 లక్షల గ్రాస్ ని వసూల్ చేసింది దాంతో మూడు వారాల క్రితం చరణ్ 25 లక్షలతో సృష్టించిన రికార్డ్ బద్దలై పోయింది . రంగస్థలం మొదటి రోజున చెన్నై లో 25 లక్షలు వసూల్ చేయగా మహేష్ భరత్ అనే నేను ఏకంగా 27 లక్షలను వసూల్ చేయడంతో చరణ్ పేరిట ఉన్న రికార్డ్ కనుమరుగయ్యింది .

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భరత్ అనే నేను చిత్రానికి మొదటి రోజునే హిట్ టాక్ వచ్చింది దాంతో మహేష్ చిత్రం మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది . ఒక్క చైన్నై లోనే కాకుండా విడుదలైన అన్ని చోట్లా భారీ వసూళ్ల ని సాధిస్తున్నాడు మహేష్ . పైగా వేసవి సెలవులు కూడా తోడవడంతో భారీ వసూళ్లు వచ్చేలా ఉన్నాయి .