26 న గిఫ్ట్ ఇవ్వడానికి రెడీ అయిన మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు తన అభిమానులకు రిపబ్లిక్ డే ని పురస్కరించుకుని గిఫ్ట్ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా భరత్ అనే నేను చిత్రంలో మహేష్ నటిస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ ముఖ్యమంత్రి గా నటిస్తున్నాడు. ఫ్యామిలీ ఎమోషన్స్ , రాజకీయ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మొదట ఈ సినిమాని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకున్నారు కానీ సకాలంలో షూటింగ్ పూర్తి కాకపోవడంతో ఏప్రిల్ కు వాయిదా వేశారు.

 

శ్రీమంతుడు తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం కావడంతో భరత్ అనే నేను చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ సరసన కైరా అద్వానీ నటించిన ఈ చిత్రం లోని మహేష్ లుక్ ని ఈనెల 26న రిలీజ్ చేయనున్నారు. ఈ లుక్ తో మహేష్ ఫ్యాన్స్ సంతోషించడం ఖాయం.