మహేష్ కొత్త సినిమా ఏప్రిల్ లో ప్రారంభం


సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . ఆ సినిమా దాదాపుగా చిత్రీకరణ పూర్తికావచ్చింది దాంతో తన కొత్త సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నాడు మహేష్ . ఇప్పటివరకు భరత్ అనే నేను చిత్రంతో 24 చిత్రాలను పూర్తిచేయగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 25 వ సినిమా ప్రారంభించడానికి సమాయత్తం అవుతున్నాడు . ఇక ఈ చిత్రాన్ని నిర్మించేది ఎవరో తెలుసా ……. ఇద్దరు అగ్ర నిర్మాతలు అశ్వనీదత్ – దిల్ రాజు లు .

90 వ దశకంలో పలు బ్లాక్ బస్టర్ లతో ఇండస్ట్రీ స్టార్ ప్రొడ్యూసర్ గా ఓ వెలుగు వెలిగాడు అశ్వనీదత్ కాగా ప్రస్తుతం దిల్ రాజు అగ్ర నిర్మాత అన్న విషయం అందరికీ తెలిసిందే . మహేష్ బాబు ఈ ఇద్దరికీ  సినిమా చేస్తానని మాట ఇవ్వడంతో ఈ జాయింట్ వెంచర్ పుట్టుకొచ్చింది . ఇక ఈ సినిమా మండువేసవి లో ఏప్రిల్ లో ప్రారంభం కానుంది అయితే వడ దెబ్బ మహేష్ కు తగిలే ఛాన్స్ లేదు ఎందుకంటే అమెరికాలో షూటింగ్ కాబట్టి అక్కడ ఎండాకాలం కాదు కాబట్టి .