భారీ అంచనాలను అందుకోలేకపోయిన అల్లు అర్జున్


mixed result on allu arjuns naa peru surya naa illu indiaభారీ అంచనాల మధ్య నిన్న అల్లు అర్జున్ నటించిన ” నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా ” విడుదల అయ్యింది , అయితే ఆ అంచనాలను మాత్రం అందుకోలేకపోయాడు అల్లు అర్జున్ . వక్కంతం వంశీ దర్శకత్వంలో లగడపాటి శ్రీధర్ – నాగబాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు . మిలిటరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ నటన అద్భుతంగా ఉంది , అల్లు అర్జున్ కు పలు అవార్డులు కూడా రావడం ఖాయం అయితే అల్లు అర్జున్ నటన ఒక్కటే సినిమా విజయానికి ఉపయోగపడదు . సరైన స్క్రీన్ ప్లే కూడా రూపొందాలి .

ఫస్టాఫ్ ని బాగానే హ్యాండిల్ చేసిన వక్కంతం వంశీ సెకండాఫ్ కు వచ్చేసరికి పక్కదారి పట్టాడు . అయితే సాయి కుమార్ ఎపిసోడ్ చివర్లో సినిమాని నిలబెట్టింది . అను ఇమ్మాన్యుయేల్ పాత్ర కేవలం గ్లామర్ కే పరిమితం అయ్యింది . వక్కంతం వంశీ కి ఇది మొదటి సినిమానే అయినప్పటికీ కొన్ని సన్నివేశాలను మాత్రం బాగా హ్యాండిల్ చేసాడు . అలాగే దర్శకుడిగా తన మార్క్ ఏంటో చూపించాడు . దర్శకుడిగా పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేదు కానీ ఓకే అనిపించుకున్నాడు . రంగస్థలం , భరత్ అనే నేను భారీ విజయాలు సాధించడంతో అల్లు అర్జున్ నటించిన నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి అయితే ఆ అంచనాలను అందుకోలేకపోయాడు అల్లు అర్జున్ . మిశ్రమ స్పందన వస్తోంది అల్లు అర్జున్ చిత్రానికి .