కేసీఆర్ కు 6 సీట్లు కూడా రావట


mla komatireddy venkat reddy fire on kcr govtఇప్పుడే చెబుతున్నాను రాసి పెట్టుకోండి కేసీఆర్ కు వచ్చే ఎన్నికల్లో 106 సీట్లు వస్తాయని మళ్ళీ అధికారం మాదే అని విర్రవీగుతున్నాడు కానీ టీఆరెస్ కు 6 సీట్లు కూడా రావు 2019 లో అధికారంలోకి వచ్చేది మేమె అంటూ సంచలన ప్రకటన చేసాడు మాజీ మంత్రి , నల్గొండ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి . నిన్న గవర్నర్ అసెంబ్లీ లో ప్రసంగిస్తున్నసమయంలో కాంగ్రెస్ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే .

 

ఒకదశలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహనం కోల్పోయి విసిరిన హెడ్ సెట్ శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ కు తగలగా ప్రస్తుతం సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు . దాంతో కోమటిరెడ్డి తో పాటు మరో ముగ్గురు , నలుగురు కాంగ్రెస్ ఎం ఎల్ ఏ లను శాసనసభ ని సస్పెండ్ చేయాలనే కృత నిశ్చయంతో ఉంది తెలంగాణ ప్రభుత్వం . అందుకే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహంతో ఊగిపోతున్నాడు . కేసీఆర్ ప్రభుత్వం కావాలనే మమ్మల్ని టార్గెట్ చేస్తోంది , వచ్చే ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ కు తగిన బుద్ది చెబుతారు . 2019 ఎన్నికల్లో కేసీఆర్ కు ఆరు సీట్లు కూడా రావు అని అంటున్నాడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి .