అనసూయ హగ్ కావాలంటున్న మోహన్ బాబు

హాట్ యాంకర్ అనసూయ అంటే ఎవరైనా పడిచస్తున్నారు , కుర్రాళ్ళు …… ముసలాళ్ళు అనే తేడా లేకుండా అనసూయ జపం చేస్తున్నారు . తాజాగా సీనియర్ నటుడు మోహన్ బాబు అనసూయ ని కౌగిలించుకోవాలని తహతహలాడుతున్నాడు . అంతేకాదు నిన్న సాయంత్రం జరిగిన గాయత్రీ ఆడియో వేడుకలో వేదిక మీదే వందలాది మంది ముందే తన కోరిక ని బయట పెట్టి ఆహుతుల చేత ఈలలు వేయించాడు మోహన్ బాబు . 
 
అసలే అనసూయ నిన్న ఎద అందాలను కనిపించేలా కుర్రాళ్ళని కైపెక్కించేలా వచ్చి పిచ్చెక్కించింది . దాంతో కుర్రకారు అనసూయ ని చూస్తూ మైమరచిపోయారు కట్ చేస్తే ఆ కుర్రాళ్ళ తో పాటుగా మోహన్ బాబు కూడా అనసూయ కు పడిపోయాడు . అనసూయ ని చూస్తుంటే కౌగిలించు కోవాలని ఉంది , తప్పకుండా కౌగిలి తీసుకుంటాను అంటూ వేదిక మీదే చెప్పి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసాడు మోహన్ బాబు . ఇక మోహన్ బాబు ఆ మాటలు అంటుంటే అనసూయ సిగ్గుల మొగ్గే అయ్యింది , ముసిముసిగా నవ్వుతూ .