సౌందర్య బయోపిక్ కూడా రానుందట


movie on soundarya biopic90 వ దశకంలో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని స్టార్ డం ని సొంతం చేసుకొని దక్షిణాదిన ఉన్న అన్ని భాషలలో నటించిన హీరోయిన్ సౌందర్య . అయితే పెళ్లి చేసుకొని హాయిగా సంసారం చేసుకుంటూ , మరోవైపు సినిమాలు కూడా చేసుకుంటున్న సమయంలో ఎన్నికల ప్రచారానికి వెళుతూ హెలికాఫ్టర్ ప్రమాదంలో సజీవ దహనం అయ్యింది సౌందర్య . అత్యంత విషాదకర సంఘటన సౌందర్య జీవితంలో జరగడంతో చలించిపోయారు దక్షిణాది రాష్ట్రాల ప్రేక్షకులు . ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ , మలయాళ , కన్నడ చిత్రాల్లో కూడా నటించింది సౌందర్య .

టాప్ హీరోల అందరి సరసన నటించిన సౌందర్య బయోపిక్ తెరకెక్కించాలని ప్రయత్నాలు చేస్తున్నారట ! బయోపిక్ లు వరుసగా విజయాలు సాధిస్తుండటంతో ఇప్పుడు సౌందర్య బయోపిక్ పై చర్చ జరుగుతోంది .మహానటి సావిత్రి తర్వాత ఆ స్థాయి లో ప్రేక్షకులను అలరించిన భామ సౌందర్య , దాంతో ఆమె బయోపిక్ సిల్వర్ స్క్రీన్ పై రావడం ఖాయంగా కనిపిస్తోంది . అయితే ఆమె పాత్ర పోషించేది ఎవరు ? దర్శకత్వం వహించేది ఎవరు ? తదితర విషయాలన్నీ త్వరలోనే తేలిపోనున్నాయి .