వివాదంలో సంగీత దర్శకుడు కీరవాణి


music-director-mm-keeravani-in-troubleసృష్టి కి మూలం ఓంకార నాదం అయితే అంతటి పవిత్రమైన ఓంకార నాదాన్ని మియా మల్కోవా మర్మాంగం పై వాడటం శోచనీయమని సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు జయకుమార్ అనే యువ రచయిత . గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ అనే సినిమాకు రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే . జి ఎస్ టి దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించగా వర్మ చుట్టూ పలు వివాదాలు చుట్టుముడుతున్నాయి .

ఎంతో పవిత్రంగా నేను కథ ని రాసుకుంటే దాన్ని బూతు చిత్రంగా మలిచాడు వర్మ , ఇక భక్తి చిత్రాలకు సంగీతం అందించి పేరు ప్రఖ్యాతులు గాంచిన కీరవాణి ఈ బూతు చిత్రానికి సంగీతం అందించడం ఏంటి ? అది కూడా ఎంతో పవిత్రమైన ఓంకార నాదాన్ని మియా మాల్కోవా మర్మాంగం పై వాడటం ఏంటి ? అంటూ మండిపడుతున్నాడు జయకుమార్ . అయితే ఆ వివాదం ఎలా ఉన్నప్పటికీ ఇప్పటికే దర్శకులు రాంగోపాల్ వర్మ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి విచారణ ఎదుర్కొన్నాడు ఇక రేపో మాపో సంగీత దర్శకులు కీరవాణి ని కూడా పోలీసులు పిలవనున్నారట . ఎందుకంటే ఆర్ధిక లావాదేవీలతో నాకు సంబంధం లేదు అని వర్మ అంటున్నాడు దాంతో కీరవాణి ని పలు కోణాల్లో విచారిస్తారేమో !