అల్లు అర్జున్ సినిమా అక్కడ హిట్


naa peru surya naa illu india hit in malayalamతెలుగులో విడుదలైన నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా ప్లాప్ అయ్యింది , కానీ మలయాళంలో మాత్రం హిట్ అయ్యింది . ఇప్పటికే 5 కోట్ల వసూళ్ల ని రాబట్టిన ” ఎంటే పేరు సూర్య ఎంటే వీడు ఇండియా ” ట్రేడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది . అల్లు అర్జున్ కు మలయాళంలో మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే . అంతేకాదు అల్లు అర్జున్ కి అక్కడ మల్లు అర్జున్ అనే పేరు స్థిరపడిపోయింది అన్న విషయం కూడా విదితమే !

అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు అయితే తెలుగులో మాత్రం ప్లాప్ అయ్యింది . అల్లు అర్జున్ నుండి తెలుగు ప్రేక్షకులు ఇలాంటి చిత్రాన్ని ఆశించలేదు దాంతో పరాజయం పొందింది అయితే ముందుగా అనుకున్న ప్రకారం మలయాళంలో కూడా విడుదల చేసారు కట్ చేస్తే అక్కడ మంచి వసూళ్ల ని సాధిస్తోంది . ఇప్పటికే 5 కోట్ల పైచిలుకు వసూళ్ల ని రాబట్టింది రాబోయే రోజుల్లో మరో 2 కోట్లు అయినా వసూల్ చేయడం ఖాయమని అంటున్నారు .