నిహారిక ని పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదట


ఒక మనసు చిత్రంలో కలిసి నటించారు నాగశౌర్య – నిహారిక , అయితే ఆ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరిందని అప్పుడే గుసగుసలు మొదలయ్యాయి అంతేనా …… త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోనున్నారని వార్తలు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి దాంతో ఒక మనసు సినిమా రిలీజ్ సమయంలో నాగశౌర్య – నిహారిక లు సోషల్ మీడియా ముందుకు వచ్చి ఆ వార్తలను ఖండించారు దాంతో అప్పటికి ఆ వార్తలు ఆగిపోయాయి .

అయితే తాజాగా మళ్ళీ ఆవార్తలు పుట్టుకొచ్చాయి దాంతో మళ్ళీ స్పందించాడు నాగశౌర్య . నిహారిక కు నాకు మధ్య మీరనుకుంటున్న దేదీ లేదు ,అయినా నిహారిక ని పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఏమి లేదు ఒకవేళ మా అమ్మ పెళ్లి చేసుకోమని గట్టిగా పట్టుపడితే మూడు నాలుగేళ్ళ తర్వాతఎవరినైనా పెళ్లి చేసుకుంటాను అని సెలవిచ్చాడు . ఇక ఈ హీరో నటించిన ఛలో రేపే రిలీజ్ అవుతోంది .