సెన్సార్ పూర్తిచేసుకున్న ఛలో


నాగశౌర్య హీరోగా తెరకెక్కుతున్న ఛలో సెన్సార్ కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తిచేసుకుంది . వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు నాగశౌర్య తల్లిదండ్రులు . నాగశౌర్య కూడా ఈ సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నాడు . ఇప్పటివరకు నాగశౌర్య చాలా చిత్రాల్లోనే నటించినప్పటికీ అనుకున్న స్థాయిలో హీరోగా సక్సెస్ కాలేకపోయాడు దాంతో ఈ సినిమాతో తన స్టార్ డం మారిపోతుందని భావిస్తున్నాడు శౌర్య . 
 
సెన్సార్ పూర్తిచేసుకొని యు / ఏ సర్టిఫికెట్ రావడంతో ఇక ఫిబ్రవరీ న భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు . చిరంజీవి ముఖ్య అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావడంతో ఛలో పై మరిన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ మొదలయ్యాయి . మణిశర్మ తనయుడు మహతి సంగీతం అందిస్తున్న ఛలో లవ్ తో పాటు యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందింది .