ఆ హీరో రాకపోవడానికి కారణం సాయి పల్లవే


nagashourya unhappy with saipallaviఇటీవలే ఛలో చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ హీరో నాగశౌర్య తాజాగా ఓ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరు కావాల్సి ఉండే కానీ ఆ ఈవెంట్ కు ఈ హీరో హాజరు కాలేదు అందుకు కారణం హీరోయిన్ సాయి పల్లవి అని తెలుస్తోంది . తెలుగు , తమిళ భాషలలో రూపొందిన కణం చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ కాగా నాగశౌర్య హీరోగా నటించాడు . అయితే హీరో నాగశౌర్య అయినప్పటికీ ఈ కథ లో ఎక్కువగా ప్రాధాన్యత ఉంది హీరోయిన్ కు మాత్రమే !

అలాగే ఆ సినిమా షూటింగ్ సమయంలో నాగశౌర్య ని సాయి పల్లవి చాలా ఇబ్బంది పెట్టిందట ! దాంతో ఆమె అంటే నాగశౌర్య కు చిరాకు . అంతేకాదు అప్పట్లో సాయి పల్లవి పై ఆరోపణలు కూడా చేసాడు ఈ హీరో . కట్ చేస్తే ఇప్పుడు జరిగిన కణం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సాయి పల్లవి హాజరయ్యింది కానీ నాగశౌర్య మాత్రం డుమ్మా కొట్టాడు . సాయి పల్లవి వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ నాగశౌర్య మాత్రం ఛలో ఇచ్చిన సక్సెస్ తో చాలా సంతోషంగా ఉన్నాడు .