ఆ సినిమా హిట్ అవుతుందా


nandamuri kalyan ram hopes on naa nuvve నందమూరి కళ్యాణ్ రామ్తమన్నా జంటగా నటించిన చిత్రం ” నా నువ్వే ”. జయేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 14న విడుదల కానుంది . కళ్యాణ్ రామ్ అంటే యాక్షన్ హీరో కానీ నా నువ్వే చిత్రంలో లవర్ బాయ్ గా నటించాడు దాంతో ఈ సినిమాపై ఎవరికి పెద్దగా నమ్మకాలు లేకుండా పోయాయి . అయితే తాజాగా ఎన్టీఆర్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ అన్నయ్య నువ్ టెన్షన్ పడకు , సినిమా హిట్ అయ్యిందా ? లేదా ? అనేది పక్కన పెడితే ” కళ్యాణ్ రామ్ బాగా నటించాడ్రా ” అని అనుకుంటే చాలు హిట్ అయినట్లే అని అంటున్నాడు .

ఎపుడూ యాక్షన్ సినిమాలేనా ? తారక్ చేసినట్లుగా ” నాన్నకు ప్రేమతో ” లాంటి విభిన్నమైన చిత్రాలు చేయాలనీ అది ఇప్పటికి కుదిరింది . నా కోరికని ఆ దేవుడు , మా తాతయ్య ( ఎన్టీఆర్ ) విని జయేంద్ర గారిని పంపినట్లున్నారు అంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు కళ్యాణ్ రామ్ . జూన్ 14 న నా నువ్వే విడుదల అవుతోంది అయితే ఈ సినిమాపై పెద్దగా బజ్ లేదు . హిట్ అవుతుందా అంటే మిలియన్ డాలర్ల ప్రశ్నే ! ఎందుకంటే నందమూరి కళ్యాణ్ రామ్ ని లవర్ బాయ్ గా ప్రేక్షకులు ఆదరిస్తారా ? చూడాలి.

naa nuvve