ఎం ఎల్ ఏ టాక్ ఏంటో తెలుసా


nandamuri kalyan ram mla overseas talkనందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ” ఎం ఎల్ ఏ ” మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి చిత్రం ఈరోజు విడుదల అవగా నిన్ననే ఓవర్ సీస్ ప్రేక్షకులు ఈ సినిమాని చూసేసారు . ఇక వాళ్ళు చూసిన ఈ సినిమా టాక్ ఎలా ఉందో తెలుసా …….. ఓవరాల్ గా సినిమా ఓకే అని , తప్పకుండా ఒకసారి చూడొచ్చు అని అంటున్నారు . కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా ఉపేంద్ర మాధవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు .

 

ఎంటర్ టైన్ మెంట్ తో పాటుగా ఎమోషన్ ని చక్కగా పండించాడని అలాగే కళ్యాణ్ రామ్ కు పటాస్ తర్వాత అంతటి హిట్ ఈ చిత్రంతో లభించిందని అంటున్నారు . కాజల్ గ్లామర్ , ఎంటర్ టైన్ మెంట్ , కళ్యాణ్ రామ్ నటన ఉపేంద్ర దర్శకత్వ ప్రతిభ వెరసి ఎం ఎల్ ఏ చిత్రాన్ని హిట్ చేశాయట . ఓవర్ సీస్ టాక్ ప్రకారం బాగుంది ఇక ఇక్కడి రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఇంకా ఆదరిస్తే తప్పకుండా కళ్యాణ్ రామ్ కు పటాస్ తర్వాత ఆ స్థాయి చిత్రమనే చెప్పాలి .