యాక్సిడెంట్ లో నాని పన్ను విరిగిపోయిందా

ఇటీవల హైదరాబాద్ లోని జూబిలీ హిల్స్ లో శుక్రవారం తెల్లవారుజామున నాని కారుకి యాక్సిడెంట్ జరిగిన విషయం తెలిసిందే , కాగా ఆ యాక్సిడెంట్ లో నాని ముఖం బలంగా ముందు తగలడం వల్ల ఒక పన్ను విరిగిపోయిందని అందుకే నాని వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటున్నాడని రకరకాల వార్తలు వెలుగులోకి వస్తున్నాయి . యాక్సిడెంట్ లో పన్ను విరగడంతో వెంటనే డెంటిస్ట్ ని కలిసినట్లు , ఆ పన్ను ని మళ్ళీ పెట్టించుకున్నట్లు అందుకే విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది . 
 
దానికి ఊతమిచ్చేలా నాని చేసిన ట్వీట్ కూడా తోడయ్యింది . చిన్న పాటి యాక్సిడెంట్ నుండి బయటపడ్డాను పెద్దదేమీ కాదు కాకపోతే కొద్దిరోజులు విశ్రాంతి అవసరం అని నాని ట్వీట్ చేయడంతో పన్ను విరిగిన మాట నిజమేనా ? అని వినబడుతోంది . ప్రస్తుతం కృష్ణార్జున యుద్ధం సినిమా చేస్తున్నాడు నాని . ఆ సినిమా త్వరలోనే రిలీజ్ కి సిద్ధం అవుతోంది .