కృష్ణార్జున యుద్ధం ఓవర్ సీస్ టాక్ ఎలా ఉందంటే


nani krishnarjuna yudham overseas talkనాని ద్విపాత్రాభినయం పోషించిన చిత్రం ” కృష్ణార్జున యుద్ధం ”. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సాహు – హరీష్ లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ , రుక్సార్ లు నాని సరసన నటించారు . ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవగా ఓవర్ సీస్ లో మాత్రం అప్పుడే షోలు పడ్డాయి ఇక ఆ షోల ప్రకారం కృష్ణార్జున యుద్ధం టాక్ ఎలా ఉందో తెలుసా …….

ఫస్టాఫ్ ఎంటర్ టైన్ మెంట్ తో ప్రేక్షకులను అలరించింది కానీ సెకండాఫ్ కు వచ్చేసరికి అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది . స్లో నెరేషన్ తో ప్రేక్షకులు కాస్త అసహనానికి గురవ్వడం ఖాయం . ఇప్పటికే పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో కృష్ణార్జున యుద్ధం గురించి రివ్యూ లు ఇచ్చేసారు . కొందరు ప్లాప్ అని తేల్చగా మరికొందరు హిట్ అని ఇంకా కొందరు యావరేజ్ అని తేల్చేసారు . అయితే ఓవర్ సీస్ ప్రేక్షకుల టాక్ ఎలా ఉన్నప్పటికీ నాని మాత్రం తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడట . మరి మన తెలుగు ప్రేక్షకులు ఈ కృష్ణార్జున యుద్ధం ని ఏం చేస్తారో చూడాలి .