నాని ఎం సి ఏ ఫైనల్ రిపోర్ట్


నాని వరుస విజయాలు సాధిస్తూ భలే జోరు మీదున్నాడు ప్లాప్ అని , యావరేజ్ అని టాక్ వచ్చిన ఎం సి ఏ మిడిల్ క్లాస్ అబ్బాయ్ చిత్రం కూడా మంచి వసూళ్ల ని సాధించి నాని ఖాతాలో మరో హిట్ ని వేసింది . డిసెంబర్ 21న రిలీజ్ అయినా ఎం సి ఏ చిత్రానికి తొలుత డివైడ్ టాక్ వచ్చింది అయితే ఆ తర్వాతి రోజున వచ్చిన అఖిల్ హలో చిత్రం కంటే నాని సినిమానే బెటర్ అని టాక్ రావడం , మరో సినిమా ఏది రెండు వారాల పాటు లేకపోవడంతో మొత్తానికి 40 కోట్ల షేర్ వసూల్ చేసి హిట్ అనిపించుకుంది . 

ఏరియాల వారీగా నాని సాధించిన వసూళ్లు ఇలా ఉన్నాయి 

నైజాం                         – 14. 25 కోట్లు 
సీడెడ్                         –   5 కోట్లు 
ఉత్తరాంధ్ర                     –  4. 30 కోట్లు 
కృష్ణా                           –  2. 15 కోట్లు 
గుంటూరు                    –   2. 40 కోట్లు 
నెల్లూరు                       –  1. 10 కోట్లు 
వెస్ట్                             – 1. 85 కోట్లు 
ఈస్ట్                            –  2. 45 కోట్లు 
కర్ణాటక                        – 2 కోట్లు 
రెస్ట్ ఆఫ్ ఇండియా           –  60 లక్షలు 
ఓవర్ సీస్                     – 3. 90 కోట్లు 
మొత్తం : 40 కోట్లు