అల్లు అర్జున్ ని తిట్టిపోస్తున్న నెటిజన్లు


netizens fire on allu arjun comments స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని తిట్టి పోస్తున్నారు నెటిజన్లు . స్టార్ హీరో అయిన అల్లు అర్జున్ ని ఆరాధించాల్సింది పోయి తిట్టడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? దానికి కారణం ఉంది . ఇటీవల ఓ వార్తా సంస్థ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆదర్శమని అతడి జాడలోనే నడుస్తానని ప్రకటించడమే కారణం . ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని , ఆ తర్వాత హోదా కాదు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పి అన్యాయం చేసిన మోడీ ని అల్లు అర్జున్ ఎలా ఆదర్శం అని ప్రకటిస్తాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .

గతకొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అట్టుడికి పోతున్న విషయం తెలిసిందే . ఆంధ్రప్రదేశ్ కు మోడీ ప్రభుత్వం మొండి చేయి చూపించిన ఈ సమయంలో మోడీ ని అల్లు అర్జున్ పొగడటం ఏంటి ? అంటూ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . అల్లు అర్జున్ పుట్టినరోజు ఈ నెల 8 న అయితే నెటిజన్ల చేత శుభాకాంక్షలు అందుకోవాల్సిన ఈ సమయంలో నెటిజన్ల తిట్లు తినాల్సి వచ్చింది పాపం .