Home న్యూస్
టాలీవుడ్
 న్యూస్

శ్రుతి హాసన్ పని అయిపోయిందా

అందాల భామ శ్రుతిహాసన్ చేతిలో ఇప్పుడు ఒక్క సినిమా కూడా లేదు , గత ఏడాది వరకు కూడా చాలా బిజీ గా ఉన్న ఈ భామ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. తెలుగులో , తమిళ్ లో అలాగే హిందీ చిత్రాల్లో నటించి స్టార్ డం సొంతం చేసుకుంది. అయితే కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలో లవ్ జివ్ అంటూ ఘాటు ప్రేమాయణం సాగిస్తూ సహజీవనం చేస్తోంది.ఒక్కొక్కటిగా వస్తున్న అవకాశాలను వదులుకొని ఇప్పుడు చేతిలో ఒక్క సినిమా కూడా లేకుండా కెరీర్ ని చౌరస్తా లో పెట్టుకుంది. ఇంకా నాలుగైదేళ్లు హీరోయిన్ గా రాణించే సత్తా ఉంది శ్రుతిహాసన్ లో కానీ బంగారం లాంటి అవకాశాలను వదులుకొని కెరీర్ కి ముగింపు ఇవ్వబోతోందా అన్న డైలమాలో  ఉన్నారు శ్రుతిహాసన్ ని అబ్జర్వ్ చేస్తున్నవాళ్లు. సహజీవనం లో ఉన్న మజా కెరీర్ లో లేనట్లుంది అందుకే ప్రియుడి తో ఎంజాయ్ చేయడానికే ఆసక్తి చూపుతోంది శ్రుతిహాసన్. 

ఎన్టీఆర్ చరణ్ లతో రాజమౌళి మల్టీస్టారర్

బాహుబలి లాంటి సంచలన చిత్రాల తర్వాత దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి మల్టీస్టారర్ చిత్రానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. అది కూడా ఎన్టీఆర్ -  రాంచరణ్ లతో . ఈ వార్త వినడానికే అద్భుతంగా ఉంది ఇక ఈ కాంబినేషన్ లో సినిమా అంటే బాక్స్ లు బద్దలు కావాల్సిందే. బాక్సాఫీసు వద్ద నందమూరి బాలకృష్ణ , మెగాస్టార్ చిరంజీవి బోలెడుసార్లు తలపడ్డారు. పైగా ఇద్దరు కూడా మాస్ హీరోలు కావడంతో భీకరమైన పోరు సాగింది.ఇక ఇప్పుడేమో ఎన్టీఆర్ , చరణ్ లు ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు . ఇద్దరూ మంచి స్నేహితులు అయినప్పటికీ కెరీర్ విషయానికి వస్తే పోటీ పడుతూనే ఉంటారు. ఇక జక్కన్న విషయానికి వస్తే ఎన్టీఆర్ తో మూడు సినిమాలు , చరణ్ తో తిరుగులేని హిట్ మగధీర సినిమాని చేసాడు. కట్ చేస్తే ఇప్పుడు ఈ ఇద్దరినీ కలిపి మల్టీస్టారర్ సినిమా చేశాడంటే ఇక ఆపతరమా ..... నందమూరి - మెగా కుటుంబాల హీరోలు కలిసి నటిస్తే అభిమానుల సంతోషానికి అంతే ఉండదు. ఈ కాంబినేషన్లో సినిమా వస్తే రికార్డుల మోత మోగడం ఖాయం. 

పోర్న్ స్టార్ ని కొట్టిన షేన్ వార్న్

ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వార్న్ తాజాగా ఓ పోర్న్ స్టార్ ని కొట్టి వివాదాల్లోకి ఎక్కాడు . అసలే షేన్ వార్న్ అంటేనే వివాదాస్పదుడు , ఇప్పటికే పలుమార్లు పలు వివాదాల్లో కూరుకుపోగా తాజాగా ఓ మహిళను అందునా పోర్న్ స్టార్ ని కొట్టి నెటిజన్ల చేత తిట్లు తింటున్నాడు . సంఘటన వివరాలలోకి వెళితే ...... లండన్ లోని విలాసవంతమైన నైట్ క్లబ్ లోకి వెళ్ళాడు షేన్ వార్న్ , అయితే అక్కడికి పోర్న్ స్టార్ కం మోడల్ అయిన వలేరి ఫ్యాక్స్ కూడా వెళ్ళింది .షేన్ వార్న్ పీకల దాకా తాగిన తర్వాత వలేరి ఫ్యాక్స్ తో గొడవపడి ఆమె ముఖం మీద బలంగా గుద్దు గుద్దాడు దాంతో తనకు తగిలిన దెబ్బలను చూపిస్తూ సోషల్ మీడియాకి ఎక్కింది అంతేకాదు షేన్ వార్న్ పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది . ఒక మహిళని కొట్టిన షేన్ వార్న్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు . షేన్ వార్న్ ఆస్ట్రేలియా వాడు అయినప్పటికీ లండన్ లో నివాసం ఏర్పరచుకున్నాడు .

హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన భామ

మలయాళ ముద్దుగుమ్మ నివేదా థామస్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టేసి సంతోషంగా ఉంది. తెలుగులో ఈ భామ నాని సరసన జెంటిల్ మన్ చిత్రంలో నటించింది. ఆ సినిమా మంచి హిట్ అయ్యింది అలాగే ఈ భామకు నటిగా గుర్తింపు నిచ్చింది , దాని తర్వాత మళ్ళీ నాని సరసనే నిన్ను కోరి చిత్రంలో నటించింది.ఆ సినిమా కూడా హిట్ ఇక ఇప్పుడేమో స్టార్ హీరో ఎన్టీఆర్ సరసన జై లవకుశ చిత్రంలో నటించింది. మొన్న రిలీజ్ అయిన జై లవకుశ మంచి వసూళ్ల ని సాధిస్తోంది. జై లవకుశ చిత్రానికి హిట్ టాక్ రావడంతో చాలా సంతోషంగా ఉంది నివేదా థామస్ . వరుసగా తెలుగులో చేసిన మూడు చిత్రాలు కూడా హిట్ అయి హ్యాట్రిక్ విజయాన్ని అందించడంతో నివేదా ఉబ్బితబ్బిబ్బైపోతోంది. తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్వీట్ చేసింది నివేదా థామస్ . 

రేప్ కేసులో నిర్మాత అరెస్ట్

సినిమాలో ఛాన్స్ ఇస్తానని చెప్పి పలుమార్లు ఓ యువతి పై అత్యాచారం చేసిన ఘటనలో బాలీవుడ్ నిర్మాత కరీం మొరాని అరెస్ట్ అయ్యాడు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో చెన్నై ఎక్స్ ప్రెస్ , దిల్ వాలే వంటి చిత్రాలను నిర్మించాడు కరీం మొరాని. అంతేకాదు షారుఖ్ హీరోగా నటించిన రావన్ చిత్రానికి కూడా సహా నిర్మాత గా వ్యవహరించాడు కరీం . అయితే 2015 లో హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ లో షూటింగ్ జరుగుతున్న సమయంలో ముంబై నుండి ఓ యువతి ని పలుమార్లు హైదరాబాద్ కు రప్పించి అత్యాచారం చేశాడు.పదేపదే బ్లాక్ మెయిల్ చేస్తూ అత్యాచారం చేయడమే కాకుండా నగ్న ఫొటోలను చూపిస్తూ మరింతగా ఇబ్బంది పెడుతుండటంతో ఎట్టకేలకు పోలీసులను ఆశ్రయించింది ఆ యువతి. అయితే సంఘటన జరిగింది హైదరాబాద్ లో కాబట్టి అక్కడే కంప్లయింట్ ఇవ్వాలని ముంబై పోలీసులు చెప్పడంతో రాచకొండ పోలీసులను ఆశ్రయించింది ఆ యువతి. కేసు నమోదు కావడంతో చేసేదిలేక కరీం మొరాని పోలీసు లకు లొంగిపోయాడు. 

మెగా ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వనున్న చరణ్

దసరా పండగని పురస్కరించుకుని మెగా అభిమానులకు పండగ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ. తాజాగా సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 అనే చిత్రం చేస్తున్నాడు చరణ్. బూత్ బంగ్లా లో భారీ ఎత్తున సెట్ వేశారు. 1985 నాటి గ్రామీణ నేపథ్యాన్ని ఖర్చుకువెనుకడకుండా నిర్మించారు.కాగా ఈ చిత్ర టీజర్ ని ఈనెల 30న దసరా పండుగ సందర్భంగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చరణ్ . పండగ పూత మెగా అభిమానులకు ట్రీట్ ఇవ్వడానికి చరణ్ రెడీ అయ్యాడు. వాళ్ళని సంతోషం లో ముంచెత్తడానికి ఈ పనికి పూనుకున్నాడు చరణ్ . సమంత నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో హాట్ భామ అనసూయ కూడా నటిస్తోంది. ఇక ఈ సినిమాని జనవరిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఓవర్సీస్ లో దుమ్మురేపిన ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జై లవకుశ తో ఓవర్సీస్ లో దుమ్మురేపాడు. ప్రపంచ వ్యాప్తంగా జై లవకుశ చిత్రం నిన్న భారీ ఎత్తున రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలకు బాగా స్పందన లభించింది .అలాగే టాక్ కూడా బాగుండటంతో ప్రీమియర్ షోలతో పాటుగా ఫస్ట్ డే వసూళ్లు బాగానే వచ్చాయి. ఓవరాల్ గా ఏడున్నర లక్షల డాలర్ల కు పైగా వసూల్ చేయడంతో  ఈ చిత్రం అవలీలగా 2 మిలియన్ మార్క్ ని చేరుకుంటుందని భావిస్తున్నారు.మహేష్ సినిమా రిలీజ్ కి ఇంకా సమయం ఉన్నందున ఎన్టీఆర్ జై లవకుశ మరిన్ని మంచి వసూళ్లు సాధించడం ఖాయం . ఓవర్సీస్ లో దుమ్ము రేపే చిత్రాల్లో ఎన్టీఆర్ నటించిన చిత్రాలు సంఖ్య బాగానే పెరుగుతోంది. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ చిత్రాల సరసన జై లవకుశ చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పుడే నాలుగున్నర కోట్లు సాధించాడంటే 2 మిలియన్ ని సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. 

పాపం ..... గోపీచంద్

హీరో గోపీచంద్ కు గతకొంతకాలంగా కాలం కలిసి రావడం లేదు దాంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న చిత్రాలు కూడా ప్లాప్ అవుతూ కెరీర్ ని మరింతగా డైలమాలో పడేస్తున్నాయి. ఇప్పటికే పలు ప్లాప్ లు గోపిచంద్ ని పలకరించగా తాజాగా ఆక్సిజన్ అనే సినిమా రిలీజ్ మరోసారి వాయిదాపడటంతో  ఖంగుతున్నాడు. ఇప్పటికే ఆక్సిజన్ సినిమా పలుమార్లు వాయిదపడగా అక్టోబరు 12న రిలీజ్ అని ప్రకటించారు . దాంతో ఈసారి ఖచ్చితంగా విడుదల అవుతుందని అనుకున్నారు.కానీ ఇప్పుడు ఆ డేట్ కూడా మారింది, అక్టోబర్ 12న కాకుండా 27న ఆక్సిజన్ సినిమా రిలీజ్ అవుతుందని ప్రకటించారు. దాంతో ఆ సినిమా పై నీలినీడలు కమ్ముకున్నాయి. గోపీచంద్ కు ఈ సినిమా తప్పనిసరి గా హిట్ కావలసిందే లేదంటే కెరీర్ పరంగా మరిన్ని ఇబ్బందులు తప్పవు. రాశి ఖన్నా, అను ఇమాన్యుయేల్ హీరోయిన్ లుగా నటించిన ఆక్సిజన్ చిత్రానికి ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించాడు. 

నిహారిక హీరోయిన్ గా సక్సెస్ అవుతుందా

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక ఒక మనసు చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన విషయం తెలిసిందే. మెగా కుటుంబం నుండి వస్తున్న హీరోయిన్ కావడంతో పెద్ద సంచలనమే అయ్యింది. అయితే ఒక మనసు చిత్రం మాత్రం ఘోర పరాజయం పొందింది. దాంతో షాక్ తిన్న మెగా కుటుంబం కొద్ది రోజుల కు కానీ ఆ షాక్ నుండి బయట పడలేదు .అలాగే నిహారిక కూడా కొంత గ్యాప్ తీసుకొని షాక్ నుండి కోలుకుంది.ఇష్టపడి చేసిన సినిమా డిజాస్టర్ కావడంతో ఈసారి జాగ్రత్తలు తీసుకొని మరీ సినిమా చేయడానికి రెడీ అయ్యింది. సుమంత్ అశ్విన్ లాంటి చిన్న హీరో సరసన నటించడానికి సమాయత్తం అవుతోంది. మరి ఈ సినిమా కూడా రొమాన్స్ కథాంశం గా తెరకెక్కుతుందట .నిహారిక కథానాయికగా సక్సెస్అవుతుందా ? లేదా? అన్నది సుమంత్ అశ్విన్ సినిమాతో తేలిపోనుంది ఎందుకంటే ఆ సినిమాకు భాగస్వామి సక్సెస్ ఫుల్ చిత్రాల నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ కావడం గమనార్హం. 

యువిక్రియేష‌న్స్, పాకెట్ సినిమా సంయుక్తంగా 'హ్యాపీవెడ్డింగ్'

వ‌రుస‌ విజ‌యాలు సాధిస్తున్న యువి క్రియేష‌న్స్ మ‌రియు పాకెట్ సినిమా సంయుక్తంగా ల‌క్ష్మ‌ణ్ కార్య ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ హీరో సుమంత్ అశ్విన్, మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల జంట‌గా నిర్మిస్తున్న సినిమా 'హ్య‌పీ వెడ్డింగ్‌'. యువి క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో తొలిసారిగా సుమంత్ అశ్విన్ న‌టిస్తున్నారు. ఈ క‌థ చెప్ప‌గానే చాలా ఎక్సైట్ అయిన హీరోయిన్ నిహ‌రిక మెట్ట‌మెద‌టి సారి సుమంత్ అశ్విన్ తో చేయ‌టం విశేషం. అలాగే రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ మెట్ట‌మెద‌టి సారిగా సుమంత్ అశ్విన్ చేస్తున్నారు. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ గా రూపోందుతున్న ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ ని అక్టోబ‌ర్ 4 నుండి ప్రారంభిస్తున్నారు.ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు మాట్లాడుతూ.. తెలుగు సినిమా పరిశ్ర‌మ‌లో క్రేజి బ్యాన‌ర్ యు వి క్రియోష‌న్స్ బ్యాన‌ర్ తో మేము అసోసియోట్ గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాము. సుమంత్ అశ్విన్‌, నిహారిక లు జంట‌గా న‌టిస్తున్నారు. దేవి శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది. టొటల్ గా ఈ కాంబినేష‌న్ లో మెట్ట‌మెద‌టిసారిగా తెర‌కెక్కిస్తున్నాము. అక్టోబ‌ర్ 4 నుండి ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ కి వెలుతుంది. రోమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ గా ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తాము.. అని అన్నారు.న‌టీన‌టులు.. సుమంత్ అశ్విన్‌, నిహ‌రిక‌, న‌రేష్, ముర‌ళి శ‌ర్మ‌, ప‌విత్ర లోకేష్, తుల‌సి, నిరోష త‌దిత‌రులు..సాంకేతిక నిపుణులు..యువి క్రియోష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లోకెమెరా.. బాల రెడ్డిమ్యూజిక్.. దేవి శ్రీ ప్ర‌సాద్‌నిర్మాత‌.. పాకెట్ సినిమాద‌ర్శ‌క‌త్వం.. ల‌క్ష్మ‌ణ్ కార్య‌
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..