Home న్యూస్ పాపం ..... గోపీచంద్
టాలీవుడ్
 న్యూస్

పాపం ..... గోపీచంద్Murali R | Published:September 29, 2017, 3:51 AM IST
హీరో గోపీచంద్ కు గతకొంతకాలంగా కాలం కలిసి రావడం లేదు దాంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న చిత్రాలు కూడా ప్లాప్ అవుతూ కెరీర్ ని మరింతగా డైలమాలో పడేస్తున్నాయి. ఇప్పటికే పలు ప్లాప్ లు గోపిచంద్ ని పలకరించగా తాజాగా ఆక్సిజన్ అనే సినిమా రిలీజ్ మరోసారి వాయిదాపడటంతో  ఖంగుతున్నాడు. ఇప్పటికే ఆక్సిజన్ సినిమా పలుమార్లు వాయిదపడగా అక్టోబరు 12న రిలీజ్ అని ప్రకటించారు . దాంతో ఈసారి ఖచ్చితంగా విడుదల అవుతుందని అనుకున్నారు.కానీ ఇప్పుడు ఆ డేట్ కూడా మారింది, అక్టోబర్ 12న కాకుండా 27న ఆక్సిజన్ సినిమా రిలీజ్ అవుతుందని ప్రకటించారు. దాంతో ఆ సినిమా పై నీలినీడలు కమ్ముకున్నాయి. గోపీచంద్ కు ఈ సినిమా తప్పనిసరి గా హిట్ కావలసిందే లేదంటే కెరీర్ పరంగా మరిన్ని ఇబ్బందులు తప్పవు. రాశి ఖన్నా, అను ఇమాన్యుయేల్ హీరోయిన్ లుగా నటించిన ఆక్సిజన్ చిత్రానికి ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించాడు. 
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..