Home న్యూస్ ఓవర్సీస్ లో దుమ్మురేపిన ఎన్టీఆర్
టాలీవుడ్
 న్యూస్

ఓవర్సీస్ లో దుమ్మురేపిన ఎన్టీఆర్Murali R | Published:September 29, 2017, 3:55 AM IST
యంగ్ టైగర్ ఎన్టీఆర్ జై లవకుశ తో ఓవర్సీస్ లో దుమ్మురేపాడు. ప్రపంచ వ్యాప్తంగా జై లవకుశ చిత్రం నిన్న భారీ ఎత్తున రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలకు బాగా స్పందన లభించింది .అలాగే టాక్ కూడా బాగుండటంతో ప్రీమియర్ షోలతో పాటుగా ఫస్ట్ డే వసూళ్లు బాగానే వచ్చాయి. ఓవరాల్ గా ఏడున్నర లక్షల డాలర్ల కు పైగా వసూల్ చేయడంతో  ఈ చిత్రం అవలీలగా 2 మిలియన్ మార్క్ ని చేరుకుంటుందని భావిస్తున్నారు.మహేష్ సినిమా రిలీజ్ కి ఇంకా సమయం ఉన్నందున ఎన్టీఆర్ జై లవకుశ మరిన్ని మంచి వసూళ్లు సాధించడం ఖాయం . ఓవర్సీస్ లో దుమ్ము రేపే చిత్రాల్లో ఎన్టీఆర్ నటించిన చిత్రాలు సంఖ్య బాగానే పెరుగుతోంది. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ చిత్రాల సరసన జై లవకుశ చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పుడే నాలుగున్నర కోట్లు సాధించాడంటే 2 మిలియన్ ని సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. 
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..