Home న్యూస్
టాలీవుడ్
 న్యూస్

ఓంకార్, పివిపిసినిమా, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా రూపొందిస్తోన్న `రాజుగారి గది 2`

ఆట డ్యాన్స్ షోతో పాటు పాపులర్ టీవీ యాంకర్ గా పేరు తెచ్చుకుని సినిమా రంగంలో దర్శకుడిగా రాజుగారి గది వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాను రూపొందించిన ఓంకార్, ప్రముక నిర్మాణ సంస్థ బ్యానర్ మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ కాంబినేషన్ లో రాజుగారి గది2 రూపొందుతోంది. 2015లో విడుదలైన రాజుగారి గది చిత్రం పెద్ద సెన్సేషనల్ హిట్ అయ్యింది. అంతే కాకుండా హర్రర్ కామెడి జోనర్ లో ఓ కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసింది.ఓంకార్ రాజుగారి గది చిత్రాన్ని వారాహి చలనచిత్రంతో సహకారంతో నిర్మించిన సంగతి తెలిసిందే. కాగా రాజుగారి గది2 చిత్రానికి పివిపి సినిమా బ్యానర్ తోడు కావడంతో కాస్టింగ్ విషయంలో కానీ, టెక్నికల్ పరంగా కానీ సినిమా స్కేల్ పెరిగింది. పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కవిన్ అన్నే ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తారు.పివిపి సినిమా, మ్యాట్నీ ఎంటర్ టైన్నమెంట్, ఓక్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్స్ సంయుక్తంగా రాజుగారి గది 2 చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరికొన్ని విషయాలు, నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలు తెలియజేస్తామని పివిపి సినిమా వర్గాలు తెలియజేశాయి.

హీరో ప్రభాస్‌ చేతుల మీదుగా 'అరకు రోడ్‌లో' సాంగ్‌ టీజర్‌ విడుదల

రామ్‌ శంకర్‌, నిఖిషా పటేల్‌ హీరో హీరోయిన్లుగా శేషాద్రి క్రియేషన్స్‌ పతాకంపై వాసుదేవ్‌ దర్శకత్వంలో మేకా బాలసుబ్రహ్మణ్యం, బి. భాస్కర్‌, వేగిరాజు ప్రసాదరాజు, రామేశ్వరి నక్కా లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'అరకురోడ్‌లో'. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని ఆడియో విడుదలకు సిద్దంగా ఉంది. ఈ చిత్ర సాంగ్‌ టీజర్‌ను యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ మాట్లాడుతూ..'ఎప్పుడురా పెళ్లి..' అనే ఈ సాంగ్‌ నా గురించే రాసినట్లుంది. లిరిక్స్‌ చాలా క్యాచీగా ఉన్నాయి. సాంగ్‌ చాలా వెరైటీగా ఉంది. సహజంగా పూరీ గారు తన సినిమాలలో ట్యూన్స్‌, లిరిక్స్‌ ఆయనే రాస్తుంటారు. అలాగే ఈ చిత్ర దర్శకుడు వాసుదేవ్‌ కూడా మల్టీ టాలెంటెడ్‌లా కనిపిస్తున్నాడు. ఈ సాంగ్‌ అదిరిపోయింది. సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను..అని అన్నారు.చిత్ర దర్శకుడు వాసుదేవ్‌ మాట్లాడుతూ..'గెడ్డం తెల్లబడి పోతావుందే..' అనే లిరిక్‌తో సాగే సాంగ్‌ టీజర్‌ను మా కోరిక మేరకు బాహుబలి, యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ గారు ఫిల్మ్‌ సిటీలోని బాహుబలి సెట్‌లో ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మా టీమ్‌ అందరి తరుపున ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ పాటని నేను, రామాంజనేయులు కలిసి రాయడం జరిగింది. ప్రస్తుతం చిత్ర షూటింగ్‌ మొత్తం పూర్తయింది. సెప్టెంబర్‌ 10న సినీ ప్రముఖుల సమక్షంలో హైద్రాబాద్‌లో గ్రాండ్‌గా ఆడియో ఆవిష్కరణ జరుపనున్నాం. పూరీ సంగీత్‌ ద్వారా పాటలు మార్కెట్‌లోకి విడుదలకానున్నాయి...అని అన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో హీరో రామ్‌శంకర్‌, నిర్మాత మేకా బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.రామ్‌శంకర్‌, నిఖిషా పటేల్‌, కమల్‌ కామరాజు, అభిమన్యు సింగ్‌, కోవై సరళ, థర్టీ ఇయర్స్‌ ఫృథ్వీ, కృష్ణ భగవాన్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సాహిత్యం: వాసుదేవ్‌, రామాంజనేయులు; ఎడిటర్‌: మార్తాండ్‌ కె. వెంకటేష్‌, సంగీతం:వాసుదేవ్‌, రాహుల్‌రాజ్‌; డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: జగదీశ్‌ చీకటి, నిర్మాతలు: మేకా బాలసుబ్రహ్మణ్యం, బి. భాస్కర్‌, వేగిరాజు ప్రసాదరాజు, రామేశ్వరి నక్కా; రచన, దర్శకత్వం: వాసుదేవ్‌.

పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన 'సక్కనోడు..చిక్కినా అందమే'

శ్రీలక్ష్మీ వెంకటరమణ మూవీస్‌ పతాకంపై శ్రీరామ్‌ దర్శకత్వంలో లీలా కార్తీక్‌, స్వప్న హీరో హీరోయిన్లుగా యు.ఎస్‌. రామచంద్రరావు నిర్మిస్తున్న లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'సక్కనోడు..చిక్కినా అందమే'. ఇటీవలే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రీరామ్‌ మాట్లాడుతూ..నేటి ట్రెండ్‌కి తగ్గ లవ్‌స్టోరీతో యూత్‌నే కాకుండా ఫ్యామిలీ మొత్తాన్ని ఆకట్టుకునే సబ్జెక్ట్‌ ఇది. మా నిర్మాతలు నేను చెప్పిన సబ్జెక్ట్‌ని నమ్మి, వెంటనే షూటింగ్‌ ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. కిషన్‌ కవాడియా సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుంది. ఈ చిత్రానికి సంబంధించి ట్రయిల్‌ షూట్‌ చేయడం జరిగింది. మంచి అభినయం ప్రదర్శించగల నటీనటులు ఈ చిత్రానికి దొరకడం ఆనందంగా ఉంది...అన్నారు. నిర్మాత యు.ఎస్‌. రామచంద్రరావు మాట్లాడుతూ..దర్శకుడు శ్రీరామ్‌ మంచి ఫ్యామిలీ నేపథ్యం ఉన్న కథని వినిపించారు. కథ ఎంతగానో నచ్చింది. అందుకే వెంటనే షూటింగ్‌ ప్రారంభించాము. శరవేగంగా చిత్రీకరణ జరిపి..అతి తక్కువ సమయంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము...అన్నారు. లీలా కార్తీక్‌, స్వప్న హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు: బోడిరెడ్డి సాయికుమార్‌; సంగీతం: కిషన్‌ కవాడియా; కెమెరా: పి. వనిదర్‌ రెడ్డి; డ్యాన్స్‌: బి. రామారావు; ఎడిటింగ్‌: వి. నాగిరెడ్డి; ఆర్ట్‌: వెంకట్‌ ఆరె; కో-డైరెక్టర్‌: పురుషోత్తమ రెడ్డి వూటూరు; సహనిర్మాత: స్వప్నమంజరి మహంతి; నిర్మాత: యుఎస్‌. రామచంద్రరావు; దర్శకత్వం: శ్రీరామ్‌ బి.ఎస్‌.సి

చుట్టాలబ్బాయి సినిమాకు మంచి అప్రిసియేషన్ వస్తుంది - వెంకట్ తలారి

ది హీరోగా హిట్‌ చిత్రాల దర్శకుడు వీరభద్రమ్‌ దర్శకత్వంలో శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్‌, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్లూరి నిర్మించిన చిత్రం.'చుట్టాలబ్బాయి'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్ట్‌ 19న. రిలీజ్ అయింది. ఈ సంద‌ర్భంగా నిర్మాత‌ల్లో ఒక‌రైన వెంకట్ తలారి సినిమా గురించి మాట్లాడుతూ ``నిర్మాతగా తొలి చిత్రానికి ఇంత మంచి రెస్పాన్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది. ఉత్సాహాన్నిస్తుంది. సినిమా విడుదలైన రోజు నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.. విడుదల రోజున 350 థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన రావడంతో ఇప్పుడు మరో వంద థియేటర్స్ ను పెంచుతున్నాం. మొదటి మూడు రోజుల్లో ఆరు కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. మరో రెండు రోజుల్లో మేం పెట్టిన డబ్బు వచ్చేస్తుంది.సాయికుమార్ గారు, ఆది కలిసి నటించడం ఒక ప్లస్ అయితే, థమన్ మ్యూజిక్ సినిమాకు మరో ఎసెట్ అయ్యింది. కామెడి బాగా పండింది. ఆడియెన్స్ తో పాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు సినిమా బావుందని అంటున్నారు. అలాగే నిన్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుగారు సినిమా బావుందని అప్రిసియేట్ చేస్తున్నారు. అలాగే గ్రంధి మల్లిఖార్జునరావు గారు సినిమా చూశారు. మరి కొంత మంది ప్రముఖులు కూడా సినిమా చూడాలని అంటున్నారు. సినిమా సక్సెస్ అయిన సందర్భంగా ప్రేక్షకులకు థాంక్స్ చెప్పడానికి సక్సెస్ టూర్ ప్లాన్ చేస్తున్నాం. తిరుపతి, నెల్లూరు, కడప, వైజాగ్, విజయవాడ, గుంటూరు ఇలా నాలుగైదు రోజుల పాటు యూనిట్ సభ్యులు ప్రేక్షకులను కలిసే ప్లాన్ చేస్తున్నాం. మా శ్రీ ఐశ్వర్య లక్ష్మి మూవీస్ బ్యానర్ లో వీరభద్రమ్ గారి దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాం. అలాగే మరికొన్ని చిత్రాలు డిస్కషన్స్ లో ఉన్నాయి. వాటి వివరాలను త్వరలోనే తెలియజేస్తాం`` అన్నారు.

రొమాంటిక్ ఫిలింలా ఉందంటున్న రాజమౌళి

సాయికొర్రపాటి నిర్మాణ సారథ్యంలో సాయి శివాని సమర్పణలో వారాహిచలన చిత్రం ప‌తాకంపై రజనీ కొర్రపాటి నిర్మిస్తున్న సినిమా `జ్యో అచ్యుతానంద`.నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా కసండ్ర నాయ‌కానాయిక‌లు. శ్రీనివాస్ అవసరాల దర్శ‌కుడు. కల్యాణ్ రమణ సంగీతం అందించిన ఆడియో మార్కెట్లోకి రిలీజైంది. పెన్ డ్రైవ్ లో పాట‌ల్ని ఆవిష్క‌రించారు. థియేట్రికల్ ట్రైలర్ ను ఎస్.ఎస్.రాజమౌళి విడుదల చేశారు. హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఈ ఆడియో వేడుక‌లో యం.యం.కీరవాణి, నారా రోహిత్, నాగశౌర్య, కల్యాణ్ కోడూరి, నాని, శశాంక్, నందిని రెడ్డి, రమా రాజమౌళి, వ‌ల్లి, స్మిత, విజయేంద్రప్రసాద్, తమ్మారెడ్డి భరద్వాజ, అభిషేక్ పిక్చర్స్ అభిషేక్, భాస్కరభట్ల, జెమినికిరణ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.అనంత‌రం ... ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి మాట్లాడుతూ -``ట్రైల‌ర్ చూస్తుంటే సినిమా ఎలా ఉంటుందో అర్థ‌మ‌వుతోంది. కామెడి, రొమాన్స్‌, సంగీతం, స‌స్పెన్స్ అన్ని మ‌సాలాలు ఉన్న సినిమాలా ఉంది. రొమాంటిక్ ఫిలింలా.. స‌రాదాగా సాగే మ్యూజిక‌ల్ థ్రిల్ల‌ర్‌లా అనిపిస్తోంది. ట్రైల‌ర్‌లో ర‌క‌ర‌కాల స‌స్సెన్స్ క‌నిపిస్తోంది. ఓ సూప‌ర్‌హిట్ ఫిలిం ట్రైల‌ర్ చూసిన‌ట్టుంది. రోహిత్‌, నాగ‌శౌర్య‌ల మ‌ధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. అన్న‌ద‌మ్ముల్లా చక్క‌గా క‌న‌ప‌డుతున్నారు. రెజీనీ మంచి ఎక్స్‌ప్రెష‌న్స్ ఇచ్చింది. క‌ల్యాణ్ ర‌మ‌ణ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. సాంగ్స్ బావున్నాయి. పాయికొర్ర‌పాటిగారు ద‌ర్శ‌కుడిపై న‌మ్మ‌కంతో సినిమా చేసే నిర్మాత‌. అదే న‌మ్మ‌కంతో శ్రీని ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమాను నిర్మించారు. టీం అంతటికీ ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.మ‌ర‌క‌త‌మ‌ణి యం.యం.కీర‌వాణి మాట్లాడుతూ - ``మేజ‌ర్ స్కేల్‌లో సంగీతం అందించే మ్యూజిక్ డైరెక్ట‌ర్స్‌లో మా త‌మ్ముడు క‌ల్యాణ్ ఉన్నారు. త‌న‌కు, చిత్ర‌యూనిట్‌కి ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.హీరో నాని మాట్లాడుతూ -``శ్రీనిలో సెన్సాఫ్ హ్యుమ‌ర్ వైవిధ్యంగా క‌నిపిస్తుంది. ఈ క‌థ .. నేను కూడా విన్నా. విన్నంత సేపు బాగా నవ్వాను. క‌థ‌లోని ఎమోష‌నల్‌తో బాగా క‌నెక్ట్ అయ్యాను. పెద్ద హిట్ అవుతుంది. వారాహి చ‌ల‌న చిత్రం బ్యాన‌ర్‌లో నేను `ఈగ` సినిమా చేశాను. కంటెంట్‌ను న‌మ్మి సినిమాలు చేసే నిర్మాతల్లో సాయికొర్ర‌పాటి ఒక‌రు. క‌ల్యాణ్ కోడూరి చ‌క్క‌ని సంగీతం అందించారు. రోహిత్‌, నాగ‌శౌర్య‌, రెజీనాల‌కు ఆల్ ది బెస్ట్‌. సినిమా పెద్ద విజ‌యం సాధించాలి`` అన్నారు.చిత్ర క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య మాట్లాడుతూ- ``జ్యో అచ్యుతానంద టైటిల్ ఎలా కలిసి పోయిందో సెట్స్‌లో నారా రోహిత్‌, నేను అలా క‌లిసి పోయాం. ఈ సినిమా రీమేక్ కోసం బాలీవుడ్‌, త‌మిళం నుంచి పోటీ ఏర్ప‌డింది. ఎంత పెద్ద యాక్ట‌ర్స్ వ‌చ్చినా మా కెమిస్ట్రీని ఎవ‌రూ బీట్ చేయ‌లేరు. జీవితం అంటే సినిమాలా ఓ జ‌ర్నీ. ఈ జ‌ర్నీలో అవ‌స‌రాల శ్రీనివాస్‌, సాయికొర్ర‌పాటిగారిని క‌లిశాను. ఆ ఇద్ద‌రూ లేకుంటే నేను ఓ సాధార‌ణ అభిమాని అయ్యుండేవాడిని. ఈ బ్యాన‌ర్‌లో నేను మ‌రో సినిమా కూడా చేయ‌బోతున్నాను. నా జీవితంలో నా త‌ల్లిదండ్రుల త‌ర్వాత నేను అంత గౌర‌వ‌మిచ్చే వ్య‌క్తి సాయికొర్ర‌పాటిగారికే. చాలా సింపుల్‌గా ఉంటారు. ఆయ‌న‌లా ఏనిర్మాతా ఉండ‌రు. క‌ల్యాణి మాలిక్‌ మంచి మ్యూజిక్ అందించారు`` అన్నారు.నారా రోహిత్ మాట్లాడుతూ- ``ఇద్ద‌రు అన్న‌ద‌మ్ముల మ‌ధ్య ఉన్న రిలేష‌న్‌కి సంబంధించిన సినిమా ఇది. శ్రీనివాస్ అవ‌స‌రాల‌ వ‌ల్లే ఈ సినిమా చేశాను. ఈ జ‌ర్నీలో నాకు నాగ‌శౌర్య లాంటి సోద‌రుడు దొరికాడు. క‌థ‌ను న‌మ్మి సినిమా చేసే మంచి నిర్మాత సాయికొర్ర‌పాటి. నేను ఆయ‌న బ్యాన‌ర్‌లో `రాజా చెయ్యి వేస్తే` సినిమా చేశాను. ఆ సినిమా ఆశించినంత స‌క్సెస్ కాక‌పోయినా.. ఈ సినిమా క‌లిసి చేశాం. మూవీకి ఏం అవ‌స‌ర‌మో దాన్ని న‌మ్మి పెట్టారు. క‌ల్యాణ్ కోడూరి చ‌క్క‌ని సంగీతం అందించారు. ప్రేక్ష‌కులు ఆద‌రించాల‌ని కోరుకుంటున్నా`` అన్నారు.అవ‌స‌రాల శ్రీనివాస్ మాట్లాడుతూ -``ముందుగా నారా రోహిత్‌కు క‌థ‌ చెప్పాను. ఆయ‌న చేయ‌డ‌నుకున్నాను కానీ చేస్తాన‌న్నారు. అలాగే ఆనంద్ ఆనే పాత్ర రాసుకునేట‌ప్పుడే నాగ‌శౌర్య‌నే హీరో అనుకున్నాను. నారారోహిత్‌, నాగ‌శౌర్య‌లు నిజ‌మైన అన్న‌దమ్ముల్లా యాక్ట్ చేశారు. నా ఊహ‌లు గుస‌గులాడే చిత్రాన్ని ఆద‌రించిన త‌ర‌హాలోనే ఈ సినిమాను కూడా ఆద‌రిస్తార‌ని నమ్ముతున్నా`` అన్నారు.⁠

ఫ్యాన్స్ కి థాంక్స్ చెప్పిన చరణ్

ఆగ‌స్టు 22(నేడు)న‌ మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకుని మెగా ఫ్యాన్స్  9 రోజుల పాటు అంగ‌రంగ వైభ‌వంగా ఏపీ, తెలంగాణ‌లోని ప‌లు దేవాల‌యాల్లో పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఈసారి మెగాస్టార్ త‌న కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్ఠాత్మ‌క‌మైన 150వ సినిమాలో న‌టిస్తున్నారు కాబ‌ట్టి ఈ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌ని మెగా ఫ్యాన్స్ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుని నిర్వ‌హించారు. ప్ర‌ఖ్యాత దేవాల‌యాల్లో హోమాలు, పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించి త‌మ అభిమానాన్ని చాటుకున్నారు. నేడు ఫిలింన‌గ‌ర్ (హైద‌రాబాద్‌) దైవ‌స‌న్నిధానంలో పూజా మ‌హోత్స‌వాల ముగింపు కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ ముగింపు పూజల్లో 150వ సినిమా నిర్మాత‌, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా చ‌ర‌ణ్ అభిమానుల‌ను ఉద్ధేశించి మాట్లాడారు. ఘ‌నంగా మెగాస్టార్‌ పుట్టిన‌రోజు సంబ‌రాలు చేసినందుకు అభిమానుల‌కు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. ఇంత పెద్ద స్థాయిలో ఫ్యాన్స్‌ పూజా కార్య‌క్ర‌మాలు చేయ‌డం త‌న‌కి చాలా ఆనందాన్నిచ్చింద‌ని చ‌ర‌ణ్ అన్నారు. హైద‌రాబాద్ జూబ్లీహిల్స్‌లోని మెగాస్టార్ స్వ‌గృహం వ‌ద్ద ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో ఫ్యాన్స్‌కి కృత‌జ్ఞ‌తాభివంద‌నాలు తెలియ‌జేశారు చ‌ర‌ణ్‌. ఈ సంద‌ర్భంగా రామ్‌చ‌ర‌ణ్ మాట్లాడుతూ -``వారం, ప‌దిరోజులుగా అభిమానులు పెద్ద ఎత్తున ఏపీ, తెలంగాణ‌లోని దేవాల‌యాల్లో మెగాస్టార్ కోసం.. పూజ‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. అఖిల భార‌త చిరంజీవి యువ‌త అధ్య‌క్షుడు స్వామినాయుడు స్వీయ‌సార‌థ్యంలో ఈ పూజా కార్య‌క్ర‌మాలు ఘ‌నంగా జ‌రిగాయి. అభిమానులంద‌రికీ పేరు పేరునా కృత‌జ్ఞ‌త‌లు. ఫిలింన‌గ‌ర్ దైవ‌స‌న్నిధానంలో ఆఖ‌రి పూజా మ‌హోత్స‌వాల‌కు హాజ‌ర‌వ్వ‌డం సంతోషాన్నిచ్చింది. అభిమానులు ప్ర‌తి సంవ‌త్స‌రం ఇలా పుట్టిన‌రోజు వేడుక‌ల్ని ఆస‌క్తిగా జ‌రుపుతున్నారు. అందుకు ధ‌న్య‌వాదాలు. ఈరోజు సాయంత్రం శిల్ప‌క‌ళా వేదిక‌లో జ‌రుగుతున్న ఫ‌స్ట్‌లుక్ లాంచ్ కార్య‌క్ర‌మానికి నేను వ‌స్తున్నా. వ‌రుణ్‌తేజ్‌, బ‌న్ని, బాబాయ్ నాగ‌బాబు.. హాజ‌ర‌వుతున్నారు. నాన్న‌గారు ప్ర‌తియేటా పుట్టిన‌రోజు వేళ‌ ఏదైనా ఫామ్‌హౌస్‌లో సింపుల్‌గా గ‌డిపేస్తారు. ఇప్పుడిలా నాన్న‌గారి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఫ్యాన్స్ కోసం `ఖైదీ నంబ‌ర్ 150` లుక్ రిలీజ్ చేయ‌డం.. ఈ సంద‌ర్భంగా అభిమానుల్ని క‌లవ‌డం సంతోషంగా ఉంది. క‌థానుసారం ఈ సినిమాలో క‌థానాయ‌కుడు ఖైదీ పాత్ర‌లో క‌నిపిస్తారు కాబ‌ట్టి ఆ సినిమాకి ఆ టైటిల్ ని నిర్ణ‌యించాం. క‌థ‌కు ద‌గ్గ‌ర‌గా ఉండే టైటిల్ ఇది. నిజానికి ఇప్పుడే ఫ‌స్ట్‌లుక్ రిలీజ్ అంటే చాలా ముంద‌స్తు అవుతుంది. దీపావ‌ళి త‌ర్వాత రిలీజ్ చేయాల‌నుకున్నాం. కానీ ఫ్యాన్స్ కోరిక మేర‌కు ఫ‌స్ట్‌లుక్ టీజ‌ర్ లాంచ్ చేస్తున్నాం`` అన్నారు.

100% ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ `ఆటాడుకుందాం.. రా`- జి.నాగేశ్వ‌ర‌రెడ్డి

.యంగ్‌ హీరో సుశాంత్‌ కథానాయకుడిగా అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో శ్రీనాగ్‌ కార్పోరేషన్‌, శ్రీజి ఫిలింస్‌ పతాకాలపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మించిన చిత్రం `ఆటాడుకుందాం..రా`(జస్ట్‌ చిల్‌). ఈ శుక్ర‌వారం (ఆగస్టు 19) ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి రిలీజై చ‌క్క‌ని ఓపెనింగ్స్ సాధించింది. ఈ సంద‌ర్భంగా చిత్ర‌యూనిట్ హైద‌రాబాద్‌లో స‌క్సెస్‌మీట్ నిర్వ‌హించింది. ద‌ర్శ‌కుడు జి.నాగేశ్వ‌ర‌రెడ్డి మాట్లాడుతూ -``మేం ఈ సినిమా తీసిందే ఎంట‌ర్‌టైన్మెంట్ కోసం.. న‌వ్వించ‌డం కోసం ..చెప్పిందే తీశాం. టైమ్ మెషీన్ నేప‌థ్యంలో కామెడీ సినిమాకే హైలైట్‌. ఆ పాయింట్ అంద‌రికీ క‌నెక్ట‌వుతుంద‌ని తొలి నుంచీ అనుకుని తీశాం. థియేట‌ర్ల‌లో జ‌నాల‌కు అవి బాగా క‌నెక్ట‌యి న‌వ్వుకుంటూ బైటికి వెళుతున్నారు. ఓ ఇద్ద‌రు ఎలా క‌లిశారు? ఎలా స్నేహితుల‌య్యారు? అన్న‌ది చూపించాం. మ‌నిషి మ‌రో మ‌నిషిని ఎప్పుడూ ఎక్క‌డా మోసం చేయ‌కూడ‌దు.. అన్న కాన్సెప్టు తో తీసిన చిత్ర‌మిది. బ్ర‌హ్మానందం టైమ్ మెషీన్‌లోకి వెళ్ల‌డం, మోసంకి సంబంధించిన‌ స‌న్నివేశాలు హైలైట్‌. అవ‌న్నీ జ‌నాల్ని థియేట‌ర్ల‌లో చ‌క్క‌గా న‌వ్విస్తున్నాయి. హీరో సుశాంత్ ఈ సినిమాలో చాలా బావున్నాడు. త‌న గెట‌ప్‌, కాస్ట్యూమ్స్ అన్నీ చాలా బావున్నాయ‌ని ప్ర‌శంస‌లొచ్చాయి. బ్ర‌హ్మీ- మోసం అన్న టాపిక్ జ‌నాల్ని బాగా ఎంట‌ర్‌టైన్ చేస్తోంది. అలాగే పోసాని కృష్ణ‌ముర‌ళి విల‌నీలో కామెడీ చేశారు. తొలి సీన్ నుంచి ఆద్యంతం ర‌క్తి క‌ట్టించారాయ‌న‌. పృథ్వీ ఓ ఇన్నోసెంట్ డైరెక్ట‌ర్‌గా క‌నిపించారు. మ‌నిషిని మోసం చేయ‌కూడ‌దు అని చెబుతూ ముర‌ళి శ‌ర్మ‌పై తీసిన సీన్స్ అద్భుతం. వీటికి రెస్పాన్స్ బావుంది. న‌టీన‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పాటు ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్‌, క్లైమాక్స్ పాటల‌కు విజిల్స్ ప‌డ్డాయి. అలాగే అఖిల్ సాంగ్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌. నాగార్జున సాంగ్ అంత ఎంజాయ్ చేశారు. ఇదో పూర్తి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. అన్ని బాధ‌ల్ని మ‌ర్చిపోయి ఆస్వాధించే సినిమా. శ్రీ‌ధ‌ర్ సీపాన సంభాష‌ణ‌లు అద్భుతంగా ఉన్నాయ‌న్న ప్ర‌శంస వ‌చ్చింది. ఈ సినిమాని 25 కోట్ల తో తీసిన సినిమాలా రిచ్‌గా తీశావంటూ బ్ర‌హ్మానందం ప్ర‌శంసించారు. నా నిర్మాత‌ల ఎఫ‌ర్ట్ అదంతా. అన్న‌పూర్ణ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో నిర్మాత చింత‌ల‌పూడి శ్రీ‌నివాస‌రావు రాజీ లేకుండా పెట్టుబ‌డులు పెట్టారు. ప్ర‌మోష‌న్ అంతే బాగా చేశారు. అందుకే ఇంత పెద్ద విజ‌యం అందుకున్నాం. క‌లెక్ష‌న్ల ప‌రంగా పంపిణీదారులంతా చాలా సంతోషంగా ఉన్నారు`` అన్నారు. ర‌చ‌యిత శ్రీ‌ధ‌ర్ సీపాన మాట్లాడుతూ -``ఈ సినిమా క‌థ రాసుకునేప్పుడు.. కేవ‌లం హీరో - హీరోయిన్ మాత్ర‌మే కాదు.. ఇంకేదైనా స్పెషాలిటీ క‌థ‌లో ఉండాల‌నుకున్నాం. అలా టైమ్ మెషీన్ ఆలోచ‌న వ‌చ్చింది. 50 సంవ‌త్స‌రాల‌కు ముందు, 50 సంవ‌త్స‌రాల త‌ర్వాత‌కు వెళితే ఎలా ఉంటుంది? అన్న థాట్ వ‌చ్చింది. ఆ థాట్‌లోంచే బోలెడంత కామెడీ పుట్టింది.. సినిమా నిల‌బడేందుకు ఈ కాన్సెప్టు పెద్ద ప్ల‌స్‌ అయ్యింది. బ్ర‌హ్మానందంని బేస్ చేసుకునే టైమ్ మెషీన్ కామెడీని పుట్టించాం. సుశాంత్ ఇదివ‌ర‌కూ సినిమాల్ని మించి చేశాడు. డ్యాన్సులు, న‌ట‌న‌లో ఎంతో శ్ర‌మించాడు. నాకు ప‌రిశ్ర‌మ‌లో తొలి అవ‌కాశం ఇచ్చింది జి.నాగేశ్వ‌ర‌రెడ్డి గారు. ఆయ‌న వ‌ల్ల‌నే మ‌రో మంచి విజ‌యం ద‌క్కింది. థియేట‌ర్ల నుంచి క‌డుపుబ్బా న‌వ్వుకుంటూ వెళ్లే సినిమా ఇది. అంద‌రూ ఆస్వాదించండి`` అన్నారు. హీరో సుశాంత్ మాట్లాడుతూ -``తొలి నుంచి మేం న‌మ్మింది ఎంట‌ర్‌టైన్‌మెంట్‌. ఆ థాట్‌తోనే ఈ సినిమా తీశాం. థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కులు ఆద్యంతం న‌వ్వుతూనే ఉండ‌డం ఆనందాన్నిస్తోంది. గ‌తంలో ప్రేమ‌క‌థ‌లు, మాస్ స్టోరీస్‌లో న‌టించాను. మొద‌టిసారి పూర్తి వినోదం పంచే సినిమాలో న‌టించాను. నేను బాగా శ్ర‌మిస్తున్నాన‌ని కాంప్లిమెంట్ ఇవ్వ‌డం కొత్త ఎన‌ర్జీనిచ్చింది. కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ చిత్ర‌మిది. అతిధిగా చైత‌న్య రోల్ ఆక‌ట్టుకుంది. తొలినుంచీ ఆ పాత్ర స్క్రిప్టులోనే ఉంది. ఇద్ద‌రు స్నేహితుల మ‌ధ్య క‌థ‌ను టైమ్ మెషీన్ కి క‌నెక్ట్ చేస్తూ తీసిన విధానం బావుంది. నా నిర్మాత‌లు తొలినుంచి సినిమాకి చ‌క్క‌ని ప్ర‌మోష‌న్ చేశారు. స‌క్సెస్ ఇచ్చిన ప్రేక్ష‌కాభిమానుల‌కు థాంక్స్‌`` అన్నారు. నిర్మాత చింత‌ల‌పూడి శ్రీ‌నివాస‌రావు మాట్లాడుతూ -``ఏపీ, నైజాం, సీడెడ్‌, అమెరికా .. ఇలా ప్ర‌పంచ‌మంతా మూవీ రిలీజ్ చేశాం. అన్నిచోట్లా స్పంద‌న బావుంది. ప్ర‌సాద్ లాబ్స్‌లో కామ‌న్ ఆడియెన్‌కి మా సినిమా చూపించాం. అంద‌రి నుంచి స్పంద‌న బావుంది. ఈ ఆదివారం నుంచి థియేట‌ర్ల‌ను సంద‌ర్శించి ప్ర‌మోష‌న్ చేయ‌నున్నాం. విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌వాడ‌, తిరుప‌తి వంటి చోట్ల థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కాభిమానుల్ని క‌లిసి ప్ర‌చార‌కార్య‌క్ర‌మాలు చేపట్ట‌నున్నాం. నాగేశ్వ‌ర‌రెడ్డి గ‌త సినిమాల్ని మించిన కంటెంట్‌తో చ‌క్క‌గా తెర‌కెక్కించారు. క‌థ‌కు త‌గ్గ‌ట్టే రాజీకి రాకుండా పెట్టుబ‌డులు పెట్టాం. విజువ‌ల్ బేస్డ్ కామెడీ ని ద‌ర్శ‌కుడు చ‌క్క‌గా ఆవిష్క‌రించారు. హీరో సుశాంత్ గ‌త సినిమాల్ని మించి అద్భుత పెర్ఫామెన్స్‌తో ఆక‌ట్టుకున్నాడు. టైమ్ మెషీన్ బ్యాక్‌డ్రాప్ ఎంత‌గానో ఆక‌ట్టుకుంది`` అన్నారు. మ‌రో నిర్మాత నాగ‌సుశీల మాట్లాడుతూ -``థియేట‌ర్ల‌లో చ‌క్క‌ని స్పంద‌న వ‌స్తోంది. పార్క్‌లో వాకింగ్ ఫ్రెండ్సుకి సినిమా చూపించాం. జెన్యూన్ రిపోర్టు చెప్పారంతా. ఆడ‌వాళ్లు, కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ చిత్ర‌మిద‌న్న ప్ర‌శంస‌లొచ్చాయి. అస‌భ్య‌త‌కు తావు లేని చిత్ర‌మిది. చ‌క్క‌ని విజ‌యాన్ని అందించిన అక్కినేని అభిమానులు, తెలుగు ప్రేక్ష‌కుల‌కు నా కృత‌జ్ఞ‌త‌లు`` అన్నారు.

'14ఏళ్లుగా ఫిలిం అవార్డ్స్‌ను ఇవ్వడం సురేష్‌కే సాధ్యమైంది' -దాసరి

'సంతోషం' సినీ వారపత్రిక ఆగస్టు 2 పుట్టినరోజు సందర్భంగా అదే నెలలో 14 సంవత్సరాలుగా ఫిలిం అవార్డ్స్‌ను, కొన్నేళ్లుగా 'సౌత్‌ ఇండియన్‌ సంతోషం ఫిలిం అవార్డ్స్‌'ను నిర్వహిస్తూ వస్తున్నారు సంతోషం ఎడిటర్‌ అండ్‌ పబ్లిషర్‌ సురేష్‌ కొండేటి. పద్నాల్గవ సౌత్‌ ఇండియన్‌ ఫిలిం అవార్డుల ప్రధానోత్సవం ఆగస్టు 14వ తేదీన హైదరాబాద్‌ గచ్చిబౌలి స్టేడియంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దర్శకరత్న డా|| దాసరి నారాయణరావు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 'గతంలో ఫిలిం అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేది. ఇప్పుడు మర్చిపోయింది. ప్రైవేటు సంస్థలు ఆ బాధ్యతను చేపట్టి అవార్డులను ఇస్తున్నాయి. కానీ అవి కంటిన్యూ చేయలేకపోయాయి. కానీ సురేష్‌ కొండేటి ఎన్నో కష్టనష్టాలకోర్చి, ఒక్కడుగా 14 ఏళ్లపాటు ఈ అవార్డుల వేడుకను నిర్వహిస్తున్నాడు. ఇది సాధారణ విషయం కాదు. తనది కార్పొరేట్‌ కంపెనీ కాదు. అయినా ఉత్తమ కళాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఒక బాధ్యతగా నిర్వహిస్తున్నాడు. ఒక కళాకారునికి ఒక అవార్డు వచ్చిందంటే ఆ ఏడాది అతను చేసిన కృషికి గుర్తించి ఇచ్చిన అవార్డు. అటువంటి అవార్డును చూసుకుని ఆ కళాకారుడు ఎంతో ఆనందపడతాడు. సంతోషం సురేష్‌ను చూస్తే నాకు ఆనందమేస్తుంది. ఈ సురేష్‌ను చూస్తే వీడా! ఇన్నేళ్లపాటు అవార్డులను నిర్వహిస్తున్నది? అనిపిస్తుంది. సురేష్‌ సినిమాపై ఇష్టంతో చిత్రరంగానికి వచ్చాడు. వచ్చి డాన్సర్‌ అయ్యాడు. అప్పట్లో నేను ప్రారంభించిన డాన్స్‌ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పొంది నా చేతుల మీదుగా అవార్డును కూడా అందుకున్నాడు. ఆ తర్వాత జర్నలిస్టు అయ్యాడు. సంతోషం పత్రికను స్టార్ట్‌ చేసి దానితోపాటు అవార్డులను కూడా స్టార్ట్‌ చేసి దిగ్విజయంగా 14 ఏళ్లు పూర్తి చేసిన సురేష్‌ని చూసి నేను గర్వపడతాను. ఎందుచేతంటే తను మా పాలకొల్లువాడే. సురేష్‌ను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను' అన్నారు సభికుల హర్షధ్వనుల మధ్య.   ముందుగా ప్రసాద్‌ ల్యాబ్‌ అధినేత, నిర్మాత అక్కినేని రమేష్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ..'మా నాన్నగారి గురించి అందరికీ తెలుసు. ఎల్వీప్రసాద్‌గారు తన జీవితాన్నంతా సినిమాకే అంకితం చేశారు. నిర్మాతగా, దర్శకునిగా చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలను అందించారు. మేము కూడా ఆయన బాటలోనే నడుస్తున్నాం. అలాగే సురేష్‌ కొండేటిగారు 14 ఏళ్లుగా అవార్డులను ఇస్తూ చిత్ర పరిశ్రమకు తన సేవలను అందిస్తున్నారు. ఆయనను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను' అన్నారు. ప్రఖ్యాత సీనియర్‌ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్‌ మాట్లాడుతూ.. 'సురేష్‌ కొండేటి చాలా పట్టుదలవాడు. అంతకుమించి సినిమా అంటే అతనికి విపరీతమైన ప్రేమ. అందుకే 14ఏళ్లుగా నిజాయితీగా, నిస్వార్థంగా ఎవరినీ ఏమీ ఆశించకుండా ఎంతో కష్టనష్టాలకోర్చి ఈ అవార్డుల వేడుకను విజయవంతంగా నిర్వహిస్తున్నాడు. అతనిని నేను మనసారా అభినందిస్తున్నాను' అన్నారు. ఫిలిం చాంబర్‌ అధ్యక్షులు, అగ్ర నిర్మాత సి.కల్యాణ్‌ మాట్లాడుతూ.. 'సురేష్‌ కొండేటి అంటే నాకు చాలా ఇష్టం. అతనిని అభినందించకుండా ఉండలేను. జర్నలిస్టుగా, సంతోషం పత్రిక అధిపతిగా విజయవంతమైన సురేష్‌ అనంతర కాలంలో నిర్మాతగా ఉత్తమ చిత్రాలను అందించి ఉత్తమ నిర్మాత అనిపించుకున్నారు. పంపిణీదారునిగా మారి కొన్ని మంచి చిత్రాలను కూడా పంపిణీ చేశారు. చిత్రరంగంలో ఇన్ని విధాలుగా ఎదిగిన సురేష్‌ ఇండస్ట్రీలో ఎవరూ చేయని విధంగా 14 ఏళ్లుగా అవార్డులు అందిస్తూ ఒక రికార్డును సృష్టించాడు. అందుకే మా సురేష్‌ ఎంతయినా అభినందనీయుడు' అన్నారు. తెలుగు, తమిళ చిత్రాల ప్రఖ్యాత నిర్మాత ఎడిటర్‌ మోహన్‌'డా|| డి.రామానాయుడు అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సురేష్‌ చిత్ర పరిశ్రమకు ఇంత సేవ చేస్తూ ఎంతో ఎత్తుకు ఎదిగాడు. నిజంగా ఆయనను సత్కరించాలి. ఈ విధంగా ఎందరో కళాకారులకు మరపురాని అవార్డులనిస్తూ తన సేవలను అందిస్తున్నారు. సురేష్‌ను అభినందిస్తున్నాను' అన్నారు. రుద్రమదేవికి 85 కోట్లు ఇచ్చి ప్రోత్సహించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు : ఉత్తమ దర్శకుడు గుణశేఖర్‌, దర్శకరత్న డా|| దాసరి నుండి అవార్డును అందుకున్న అనంతరం మాట్లాడుతూ.. 'ముందుగా 14 ఏళ్లుగా అవార్డుల ఉత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్న సురేష్‌ కొండేటికి అభినందనలు. ఆయనను ఎంతయినా ప్రోత్సహించాలి. రుద్రమదేవి విషయానికి వస్తే ఈ చిత్రానికి 85 కోట్లు ఇవ్వడమేగాక, ఎన్నో అవార్డులు ఇప్పించింది. ఈ అవార్డును దర్శకరత్న డా|| దాసరి గారి నుండి తీసుకోవడం ఆనందంగా ఉంది. అలాగే ఈ సందర్భంలో అనుష్క, అల్లు అర్జున్‌, రానాలకు ప్రత్యేకమైన అభినందనలు' అన్నారు. బెస్ట్‌ సపోర్టింగ్‌ ఆర్టిస్టుగా (శ్రీమంతుడు చిత్రానికి) అవార్డునందుకున్న డా|| రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ..' 39 ఏళ్లుగా నన్ను అభిమానిస్తున్న మీకు కృతజ్ఞతలు. ఆ నలుగురు చిత్రాన్ని నాలుగు సార్లు చూశాను అన్నారు మురళీమోహన్‌. అదిగో ఆ కోవలోనే శ్రీమంతుడు, సన్నాఫ్‌ సత్యమూర్తి, జులాయి వంటి చిత్రాలు ప్రేక్షకుల మనస్సుల్లో నిలిచిపోతాయి. ఒక కళాకారునికి అవార్డు వస్తే ఆ కళాకారుడు ఎంతో ఉప్పొంగిపోతాడు ఇంకా ఉత్సాహంతో ముందుకు వెళతాడు. సురేష్‌ కొండేటి ఏటేటా, పద్నాలుగేళ్లుగా ఇంత మంది కళాకారులను అవార్డులతో ప్రోత్సహిస్తూ వస్తున్నాడు. నిజంగా అతనిని అభినందించితీరాలి. ఇంకా మీ జనరేషన్‌లో కలిసిపోయి ముందుముందు మరిన్ని చిత్రాలు చేస్తాను. ఈ అవార్డు శ్రీమంతుడు చిత్రం ద్వారా రావటం సంతోషంగా ఉంది. మహేష్‌బాబు పెద్ద హీరో నటించగా, చక్కని కమర్షియల్‌ చిత్రంగా రూపొంది.. ఒక మంచిపాయింట్‌తో కొరటాల శివ రూపొందించిన శ్రీమంతుడు ఎంతో ప్రయోజనాత్మకమైన చిత్రం' అన్నారు. ఏడిద నాగేశ్వరరావు స్మారక అవార్డుకు ఎన్నికైన ప్రసిద్ద కె.ఎస్‌.రామారావుకు బదులుగా ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి అందుకున్నారు. ఈ సందర్భంగా రవిరాజా మాట్లాడుతూ.. 'నాకిప్పుడు మూడు విధాలుగా సంతోషంగా ఉంది. ఏడిద నాగేశ్వరరావు వంటి ఓ గొప్ప నిర్మాత స్మారక అవార్డును కొన్ని కారణాల వల్ల రాలేకపోయిన కె.ఎస్‌.రామారావుకు బదులుగా నేను అదుకోవటం అదృష్టంగా భావిస్తున్నాను. కె.ఎస్‌.రామారావు గారితో నాకెంతో అనుబంధముంది. ఆయన డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ ప్రొడ్యూసర్‌. రామారావు గారి బ్యానరులో ఆణిముత్యాల్లాంటి చిత్రాలు ముత్యమంతముగ్గు, పుణ్యస్త్రీ వంటి చిత్రాలు చేశాను' అన్నారు. అల్లు రామలింగయ్య స్మారక అవార్డును ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ద్వారా అందుకున్న ప్రముఖ నటుడు పృధ్వీ మాట్లాడుతూ... ''క్రమశిక్షణకు మారుపేరు నటనకు పెద్దబాలశిక్ష వంటి నటుడు అయిన అల్లు రామలింగయ్య గారి అవార్డును నేను అందుకోవటం, అదీ గురుతుల్యులు దాసరి నారాయణరావుగారి సమక్షంలో అల్లు అరవింద్‌గారి చేతుల మీదుగా అందుకోవటం చాలా సంతోషంగా ఉంది. రామలింగయ్య గారు నటన ప్రవహించే గంగా ప్రవాహం ఆయన'' అన్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ సురేష్‌ కొండేటికి తన శుభాకాంక్షలను అందజేస్తూ ... 'సురేష్‌కొండేటి 14 ఏళ్లుగా ఎవరూ చేయని విధంగా అవార్డులను నిర్వహిస్తూ అందులో అల్లు రామలింగయ్య గారి పేరిట స్మారక అవార్డులను అందజేస్తూ వస్తున్నాడు. ఈ సందర్భంగా సురేష్‌ను మనసారా అభినందిస్తున్నాను. ఒక వ్యక్తిగా 14 ఏళ్లపాటు ఇలా శ్రమిస్తుండటం సాధారణ విషయం కాదు. ఇలాగే లాంగ్‌టైమ్‌ తను నిర్వహిస్తుండాలని కోరుకుంటున్నాను' అన్నారు. మొదటి చిత్రం దర్శకునిగా సంచలన దర్శకుడు కొరటాల శివ నుండి అవార్డునందుకున్న అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ.. 'పటాస్‌ చిత్రం చూసి నన్ను అభినందించిన దర్శకరత్న డా|| దాసరి నారాయణరావు గారికి కృతజ్ఞతలు. అలాగే ఆ చిత్ర నిర్మాత కళ్యాణ్‌రామ్‌ గారికి కృతజ్ఞతలు. ముఖ్యంగా నిర్మాతకు దర్శకునిపై నమ్మకముండాలి. అలా నాపై ఎంతో నమ్మకముంచారు కల్యాణ్‌రామ్‌. మొదటి చిత్రం దర్శకునికి రెండో చిత్రం పరీక్షలాంటిదంటారు. అటువంటి ద్వితీయ విఘ్నాన్ని కూడా విజయవంతంగా దాటిన కొరటాల శివగారి నుండి ఈ వార్డునందుకోవటం సంతోషంగా ఉంది' అన్నారు. మొదటి చిత్రం హీరోయిన్‌ హెబ్బాపటేల్‌(కుమారి 21ఎఫ్‌) మాట్లాడుతూ.. ఈ సంతోషం అవార్డు నా సినిమా కెరీర్‌లో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈసందర్భంలో కుమారి 21 ఎఫ్‌ చిత్ర దర్శకులు సూర్యప్రతాప్‌గారికి, ముఖ్యంగా సుకుమార్‌గారికి, నిర్మాతలకు కృతజ్ఞతలు' అన్నారు. శ్రీమంతుడు చిత్రం ద్వారా ఉత్తమ దర్శకునిగా ఎన్నికైన సంచలనాత్మక దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతుండగా ఫంక్షన్‌ లోని ఆడియన్స్‌ జనతాగ్యారేజ్‌ చిత్రం గురించి చెప్పమని అడిగారు. దాంతో కొరటాల శివ మాట్లాడుతూ.. 'జనతా గ్యారేజ్‌' చిత్రం ఆడియో ఘన విజయం సాధించింది. సినిమా త్వరలో విడుదలవుతోంది' అని చెప్పి ఇన్నేళ్లుగా అవార్డులను అందజేస్తూ వస్తున్న సురేష్‌ కొండేటిని అభినందిస్తున్నాను' అన్నారు. ఉత్తమ సంగీత దర్శకుని అవార్డును సుప్రసిద్ధ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ దర్శకరత్న నుండి అందుకుంటుండగా ప్రేక్షకులు 'కుమారి 21ఎఫ్‌' చిత్రంలోని బ్యాంగ్‌ బ్యాంగ్‌' పాట పాడమని అడుగగా దేవిశ్రీ ఆ పాటను పాడి హర్షధ్వనులందుకున్నారు. అనంతరం దేవిశ్రీ మాట్లాడుతూ.. 'కుమారి 21ఎఫ్‌ హెబ్బాను ఒక ఫంక్షన్‌లో ముందు చూసి 'హబ్బా' అనుకున్నాను. ఈ సినిమాలో హెబ్బా అద్భుతంగా చేసింది. అలాగే డైరెక్టర్‌ సూర్యప్రతాప్‌ బ్రహ్మాండంగా డైరెక్ట్‌చేశాడు' అన్నారు. లైఫ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డునందుకున్న తాళ్లూరి రామేశ్వరి మాట్లాడుతూ.. 'ముందుగా దాసరి నారాయణరావుగారికి కృతజ్ఞతలు. నన్ను గుర్తించి నన్నీ అవార్డుకు ఎన్నుకున్న సురేష్‌ కొండేటికి అభినందనలు. మీకు లైఫ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డునిస్తున్నాం అన్నారు. నేను ఏం సాధించానా అని ఆలోచనలో పడ్డాను. చిత్ర రంగంలో 42 ఏళ్ల ప్రయాణం. ఒకనాడు తిరుపతిలో ఒక సినిమా షూటింగ్‌ను చూసి ఆర్టిస్టు నవ్వాలనుకున్నాను. ముందు హిందీ సినిమాలో నటించాను. సీతామహాలక్ష్మి చిత్రం ద్వారా తెలుగుకు ప్రవేశించాను. సురేష్‌గారు కలకాలం ఇలాంటి ఫంక్షన్‌లు చేస్తుండాలి' అన్నారు. జీవన సాఫల్య అవార్డునందుకున్న సుప్రసిద్ధ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాల ప్రముఖ నటి అందాల జయప్రద మాట్లాడుతూ.. ఈ రోజు నాకు చాలా ప్రత్యేకం. నేను తిలక్‌ గారి 'మాభూమి' చిత్రం ద్వారా చిత్రరంగానికి వచ్చాను. రాజమండ్రిలో పుట్టిపెరిగాను. మాటలు రాని, నటన రాని నన్ను గురువుగారు దాసరి గారు నటిగా తీర్చిదిద్దారు. రెండో చిత్రం దేవుడే దిగివస్తే చిత్రాన్ని ఆయన దర్శకత్వంలో చేశాను. అనంతరం గురువుగారి దర్శకత్వంలో మేఘసందేశం వంటి ఎన్నో ఉత్తమ చిత్రాలతోపాటు మొత్తం 24 చిత్రాలలో నటించాను! నా సినీ జీవితానికి మరో మంచి గుర్తింపు లాంటిది ఈ సంతోషం అవార్డు. నువ్వు ఇండస్ట్రీలోనే ఉండు అని చెప్పే అవార్డుగా ఈ అవార్డును భావిస్తున్నాను' అన్నారు. అక్కినేని నాగేశ్వరరావు స్మారక అవార్డును అందుకున్న ప్రఖ్యాత నటులు మురళీమోహన్‌ మాట్లాడుతూ... 'నటునిగా నాకు 43 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంలో గురువుగారికి నమస్కారాలు. నేనీ రోజున ఇలా ఉన్నానంటే గురువుగారి చలవే. నాకు చిన్నప్పట్నుంచీ అక్కినేని నాగేశ్వరరావుగారంటే అభిమానం. అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానరుపై అక్కినేని నాగేశ్వరరావు, గురువుగారి దర్శకత్వంలో నిర్మించిన అద్భుతమైన సంచలన చిత్రం ప్రేమాభిషేకంలో కూడా నటించాను అన్నపూర్ణ వారి కళ్యాణి'లోనూ నటించాను. 14 ఏళ్లపాటు అవార్డులు ఇవ్వటమనే అసాధ్యమైన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ వస్తున్న సురేష్‌ కొండేటికి ధన్యవాదాలు' అన్నారు. బెస్ట్‌ విలన్‌గా 'బాహుబలి' చిత్రానికి మెమోంటోను అందుకున్న దగ్గుపాటి రానా మాట్లాడుతూ.. 'సంతోషం సురేష్‌ గారికి ముందుగా అభినందనలు. పౌరాణికం లేదా జానపదం లేదా చారిత్రాత్మక చిత్రాల్లో నటించాలన్న నా కోరిక బాహుబలి చిత్రం ద్వారా రాజమౌళి గారు, రుద్రమదేవి చిత్రం ద్వారా గుణశేఖర్‌గారు తీర్చారు. వీరిద్దరికీ రుణపడి ఉంటాను. ఈ రోజున ఎక్కడకు వెళ్లినా భల్లాలదేవ అనిపిలుస్తున్నారు' అన్నారు. సంతోషం లైఫ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డును ప్రఖ్యాత నటులు, నిర్మాత, జయభేరి అధినేత మురళీమోహన్‌ నుండి అందుకున్న సీనియర్‌ నటులు గిరిబాబు తన ఆనందాన్ని తెలుపుతూ.. 'ఈ సంతోషం అవార్డును అందుకోవటం చాలా సంతోషంగా ఉంది. 1973లో నేను, మిత్రుడు మురళీమోహన్‌ 'జగమేమాయ' చిత్రం ద్వారా చిత్రసీమకు ఎంటర్‌ అయ్యాం. ఈ రోజున ఈ అవార్డును మిత్రుడు మురళీమోహన్‌ ద్వారా అందుకోవటం ఎంతో ఆనందంగా ఉంది. చిత్రరంగంలో 43 ఏళ్లు పూర్తి చేసుకున్నాను. అయితే ఇంకా నటిస్తాను. కళాకారునికి తృప్తి అంటూ ఉండదు. చిత్ర పరిశ్రమే నాకు అన్నంపెట్టింది, కీర్తి ప్రతిష్టలను తెచ్చి పెట్టింది. నేను కళాకారునైనందుకు గర్విస్తున్నాను' అన్నారు. మొదటి చిత్రం హీరోగా సంతోషం అవార్డునందుకున్న అక్కినేని అఖిల్‌ మాట్లాడుతూ.. 'ఆనందంగా ఉంది. చాలా ఆనందంగా ఉంది. నా మొదటి చిత్రానికే ఈ అవార్డునందుకోవటం మర్చిపోలేనిది. సురేష్‌ కొండేటిగారికి చాలా థ్యాంక్స్‌' అన్నారు. ప్రముఖ నటులు కాదంబరి కిరణ్‌ సంతోషం అధినేత సురేష్‌ కొండేటిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను' అన్నారు. . యువ కథానాయకుడు అల్లు శిరీష్‌ మాట్లాడుతూ.. 'విడువకుండా ప్రతీ ఏటా ఇంత గ్రాండ్‌గా అవార్డుల ఫంక్షన్‌ను నిర్వహిస్తున్న సంతోషం సురేష్‌ కొండేటి గారిని అభినందిస్తున్నాను. సురేష్‌ గారు ముందు ముందు కూడా ఇలాగే ఈ అవార్డు ఫంక్షన్‌ను నిర్వహించాలని కోరుకుంటూ, సురేష్‌ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను' అన్నారు. తమిళ రంగంలో బెస్ట్‌డెబ్యూ డైరెక్టర్‌గా ఎన్నికైన పినిశెట్టి సత్యప్రభాస్‌ మాట్లాడుతూ.. 'నేను అందుకుంటున్న మొదటి అవార్డు ఇది. ఈ సంతోషం అవార్డును ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సందర్భంగా సురేష్‌ కొండేటి గారికి ధన్యవాదాలు' అన్నారు. తమిళరంగంలో ఉత్తమ దర్శకుడిగా ఎన్నికైన తెలుగు, తమిళ చిత్రాల అగ్ర నిర్మాత ఎడిటర్‌ మోహన్‌ పెద్దకుమారుడు రాజా మాట్లాడుతూ.. 'సురేష్‌ కొండేటిగారు సంతోషం పత్రికను విజయవంతంగా నడుపుతూనే, 14 ఏళ్లుగా ఫిలిం అవార్డులను అందునా సౌతిండియన్‌ ఫిలిం అవార్డులను నిర్వహిస్తుండటం అనితరసాధ్యమైన విషయం. త్వరలోనే తెలుగులో సినిమా చేస్తాను. నాన్నగారు ఆ ప్రయత్నాలలో ఉన్నారు' అన్నారు.   అవార్డుల వివరాలు : ఉత్తమ నటుడు : ప్రభాస్‌(బాహుబలి), ఉత్తమ నటి : అనుష్క (రుద్రమదేవి) ఉత్తమ చిత్రం : రుద్రమదేవి (శ్రీమతి రాగిణి గుణ, నీలిమ గుణ, యుక్తాముఖి) ఉత్తమ దర్శకుడు : కొరటాల శివ (శ్రీమంతుడు) ఉత్తమ నిర్మాత : శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని(బాహుబలి) ఉత్తమ సహాయ నటుడు : డా|| రాజేంద్రప్రసాద్‌(శ్రీమంతుడు) ఉత్తమ సంగీత దర్శకుడు : దేవిశ్రీప్రసాద్‌(శ్రీమంతుడు) సన్నాఫ్‌ సత్యమూర్తి ఉత్తమ సంగీత నటి : హేమ(కుమారి 21ఎఫ్‌) ఉత్తమ విలన్‌ : రానా (బాహుబలి) ఉత్తమ గాయని : గీతామాధురి(బాహుబలి) ఉత్తమ గీతా రచయిత : సీతారామశాస్త్రి(కంచె) ఉత్తమ కొరియోగ్రాఫర్‌ : ప్రేమ్‌రక్షిత్‌ (బాహుబలి) బెస్ట్‌ డెబ్యూ హీరో : అఖిల్‌ బెస్ట్‌ డెబ్యూ హీరోయిన్‌ : హెబ్బాపటేల్‌(అలా ఎలా?/ కుమారి 21ఎఫ్‌) బెస్ట్‌ ఎడిటర్‌ : కోటగిరి వెంకటేశ్వరరావు(బాహుబలి, శ్రీమంతుడు) బెస్ట్‌ డెబ్యూ డైరెక్టర్‌ : అనిల్‌ రావిపూడి(పటాస్‌) బెస్ట్‌ ఫొటోగ్రాఫర్‌ : టాటా మల్లేశ్‌(బాహుబలి) ఎఎన్‌ఆర్‌ స్మారక అవార్డు : మురళీమోహన్‌ అల్లు స్మారక అవార్డు : పృధ్వీ 25ఏళ్లు పూర్తి చేసుకున్న నటి : మాలాశ్రీ (తెలుగు అండ్‌ కన్నడ) ఎవర్‌గ్రీన్‌ బ్యూటీ ఆఫ్‌ ఇండియా : జయప్రద డాక్టర్‌ డి.రామానాయుడు స్మారక అవార్డు : ఎడిటర్‌ మోహన్‌   తమిళం హీరో శివకార్తికేయన్‌ : రజనీమురుగన్‌ హీరోయిన్‌ హన్సిక : రోమియో- జాలియట్‌ డైరెక్టర్‌ మోహన్‌రాజ్‌ : తని ఒరువన్‌ మొదటి చిత్రం దర్శకుడు ప్రకాష్‌ నిక్కీ గల్రానీ (డార్లింగ్‌) హీరోయిన్‌ రోబో శంకర్‌(బెస్ట్‌ కమెడియన్‌) : మారి అరుణ్‌ విజయ్‌ (బెస్ట్‌ విలన్‌) : ఎన్నై అరిందాన్‌ పార్తిబన్‌(నానున్‌ రౌడీదాన్‌) : బెస్ట్‌ సంతోషం అవార్డు మానస (బెస్ట్‌ మొదటి చిత్రం హీరోయిన్‌ కన్నడ) : మృగశిర బెస్ట్‌ డెబ్యూ డైరెక్టర్‌ సత్యప్రభాస్‌ పినిశెట్టి (తమిళ)

పరమ చెత్త చిత్రం తిక్క

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన తాజా చిత్రం ''తిక్క ''. ఈరోజు రిలీజ్ అయిన తిక్క చిత్రం నిజంగానే తిక్క తిక్క గా ఉంది , సాయి ధరం తేజ్ కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ అంతేకాదు పరమ ..............పరమ చెత్త చిత్రానికి కేరాఫ్ అడ్రస్ ఈ తిక్క . కథ , కథనం అంటూ ఏమి లేని ఈ చిత్రాన్ని ఎలా చేసారో తెలియదు . దర్శకుడు హీరోకు కథ ఎలా చెప్పాడు ,అందులో ఏముందని హీరో ఒప్పుకున్నాడు ఇంతోటి కథ ని అంత పెద్ద బడ్జెట్ పెట్టి నిర్మాత ఎలా నిర్మించాడు ఇదంతా సవాలక్ష ప్రశ్న గా మిగిలింది . సాయి ధరం తేజ్ స్పీడ్ గా చిత్రాలు చేస్తున్నాడు కానీ ఇంత స్పీడ్ గా చేస్తే ఇలాంటి ఎదురు దెబ్బలే తగులుతాయి మరి . ఈరోజు రిలీజ్ అయిన చిత్రాన్ని చూడటానికి వచ్చిన వాళ్ళు థియేటర్ నుండి పారి పోతున్నారు అంత దారుణంగా ఉంది మరి సినిమా.

జనతా గ్యారేజ్ కి రిలీజ్ డేట్ ప్రాబ్లెం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ మరో సమస్యలో చిక్కుకుంది . ప్రారంభోత్సవ సమయంలోనే ఆగస్టు 12న రిలీజ్ అంటూ ప్రకటించారు కట్ చేస్తే రిలీజ్ సమయం దగ్గర పడుతున్న సమయంలో సెప్టెంబర్ 2 కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు . ఇక సెప్టెంబర్ 2 కి రిలీజ్ అవ్వడం ఖాయమని భావిస్తున్న తరుణంలో మరో చిక్కు వచ్చి పడింది . సెప్టెంబర్ 2న భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి వామపక్షాలు అలాగే ట్రేడ్ యునియన్ లు దాంతో ఆ ఎఫెక్ట్ జనతా గ్యారేజ్ పై పడనుంది . ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం మొదటి రోజు ,అలాగే వీకెండ్ లో మొత్తం ఎంత లాగామన్నది ప్రధానం కాబట్టి భారత్ బంద్ రోజునే జనతా గ్యారేజ్ రిలీజ్ చేస్తే ఎన్టీఆర్ సినిమాకు కష్టాలు ఖాయం ఎందుకంటే బంద్ రోజున ఎలాగూ రెండు ఆటలు ఆడవు ,మిగతా రెండు ఆటల వల్ల వచ్చేది కొంతే ! దాంతో రికార్డు కలెక్షన్లు కూడా మిస్ అవుతాయి అందుకే మదన పడుతున్నారు దర్శక నిర్మాతలు . భారత్ బంద్ సెప్టెంబర్ 2న ఉన్నందున సినిమాని ఆ మరుసటి రోజున రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారట . మరి ఎప్పుడు డేట్ ఫిక్స్ చేస్తారో చూడాలి . 
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..