Home న్యూస్
టాలీవుడ్
 న్యూస్

డైరెక్టర్ గా సక్సెస్ అవుతాడా

ఈటీవీ ప్రభాకర్ గా చిత్రపరిశ్రమలో గుర్తింపు పొందాడు ప్రభాకర్ . అయితే ఈటీవీ నుండి బయటకు వచ్చాక డైరెక్టర్ గా తనని తాను నిరూపించుకోవడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసాడు కానీ కాలం అంతగా కలిసి రాలేదు దాంతో ఇన్నాళ్ల తర్వాత ప్రభాకర్ కల సాకారం అయ్యింది. బుల్లితెరపై అప్రతిహతంగా దూసుకుపోయిన ప్రభాకర్ ఇప్పుడు వెండితెరపై కూడా సక్సెస్ కావాలని ఆశపడుతున్నాడు.అందులో భాగంగానే యంగ్ హీరో ఆది తో " నెక్స్ట్ నువ్వే " అనే సినిమా చేసాడు. తమిళంలో ఘనవిజయం సాధించిన చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ , యువి క్రియేషన్స్ , స్టూడియో గ్రీన్ లాంటి ప్రముఖ నిర్మాణ సంస్థ లు మూడు కలిసి నిర్మిస్తున్న చిత్రం కావడం , తమిళ్ హిట్ మూవీ కావడంతో నెక్స్ట్  నువ్వే సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు ట్రైలర్ కూడా బాగుండటంతో ప్రభాకర్ డైరెక్టర్ గా సక్సెస్ కావడం ఖాయమని అంటున్నారు. ఇక ప్రభాకర్ కూడా ఆది సినిమాపై ఆశలు పెట్టుకున్నాడు అలాగే ఆది కి కూడా ఓ హిట్టు కావాలి అందుకే ఆ ఇద్దరూ విజయం కోసం ఎదురుచూస్తున్నారు. నవంబర్ లో సినిమా రిలీజ్ . సో అప్పుడే ఏ విషయం అన్నది తేలిపోనుంది. 

ఆ దర్శక నిర్మాతల అరెస్ట్ తప్పదా

వంగవీటి చిత్రాన్ని నిర్మించిన దాసరి కిరణ్ కుమార్ ని అలాగే దర్శకుడు రాంగోపాల్ వర్మ ని అరెస్ట్ చేయాలంటూ విజయవాడ కోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. తక్షణం ఆ ఇద్దరి పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలంటూ పోలీసులను ఆదేశించింది విజయవాడ కోర్టు. వంగవీటి సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కోర్టుకెక్కాడు మాజీ ఎం ఎల్ ఏ వంగవీటి రాధాకృష్ణ. దాంతో నెలరోజుల పాటు విచారణ సాగించిన అనంతరం వర్మ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వంగవీటి రాధాకృష్ణ అభ్యంతరాలను పట్టించుకోక పోవడంతో తక్షణం దర్శక నిర్మాతలను అరెస్ట్ చేయాల్సిందిగా పోలీసులకు ఉత్తర్వులు జారీచేసింది. అయితే దర్శక నిర్మాతలను తక్షణమే అరెస్ట్ చేస్తారా చూడాలి ఎందుకంటే హై కోర్టు కి వెళతారా ? లేక న్యాయస్థానం మీద గౌరవం తో కోర్టు ముందు హాజరుఅవుతారా చూడాలి. టైటిల్ వంగవీటి అయినప్పటికీ ఆ సినిమాలో వంగవీటి మోహన్ రంగా ని రౌడీ గా చూపించారని రంగా తనయుడు రాధాకృష్ణ కోర్టుకెక్కాడు. 

అక్కినేని ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చిన నాగ్

ఈరోజు మహానటుడు అక్కినేని నాగేశ్వర రావు పుట్టినరోజు కావడంతో ఆ సందర్భంని పురస్కరించుకుని ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చాడు కింగ్ నాగార్జున. ఓంకార్ దర్శకత్వంలో తాజాగా నాగార్జున నటించిన చిత్రం రాజుగారి గది 2 . వచ్చే నెల అక్టోబర్ లో రిలీజ్ కానున్న రాజుగారి గది 2 ట్రైలర్ ని ఈరోజు రిలీజ్ చేశారు. పేరుకి ఇది రాజుగారి గది 2 కానీ రాజుగారు గది చిత్రానికి మాత్రం ఇది సీక్వెల్ కాదు.ఇక అక్కినేని పుట్టినరోజు న ట్రైలర్ రిలీజ్ చేయడంతో అక్కినేని అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇక ట్రైలర్ కూడా బాగుండటంతో నాగ్ మాత్రమే కాకుండా అక్కినేని అభిమానులు కూడా సినిమా హిట్ పై నమ్మకంగా ఉన్నారు. నాగార్జున సరసన సీరత్ కపూర్ నటించగా సమంత దెయ్యం పాత్రలో నటించింది. పివిపి బ్యానర్ పై రూపొందించిన ఈ సినిమా ఓంకార్ కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

రేపు బాక్స్ లు బద్దలు కావడం ఖాయం

రేపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ చిత్రం రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. అసలే మాస్ హీరో ఆపై త్రిపాత్రాభినయం చేసిన సినిమా దానికి తోడు పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయిన సినిమా కాబట్టి రేపు బాక్సాఫీస్ బడ్డలవడం ఖాయం . దసరా సెలవులు కూడా ఉన్నందున జై లవకుశ ఓపెనింగ్స్ లో నాన్ బాహుబలి రికార్డులు బద్దలు అయ్యేలా ఉంది.nప్రపంచ వ్యాప్తంగా జై లవకుశ భారీ స్థాయిలో రిలీజ్ అవుతోంది. అలాగే ఓవర్సీస్ లో ఎన్టీఆర్ కు ఇదే బెస్ట్ రిలీజ్. అత్యధిక సెంటర్లలో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. అమ్మా నాన్న లకు , అలాగే నందమూరి కుటుంబానికి , అభిమానులకు ఈ జై లవకుశ ప్రత్యేక మైన సినిమా అవుతుందని అంటున్నారు. రేపటి నుండి వసూళ్ల ప్రభంజనం ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ తో పాటు ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు.

వంద సినిమాలు చేసినట్లుందంటున్న ఎన్టీఆర్

ఒక్క జై లవకుశ చిత్రం వంద సినిమాలను చేసినట్లుందని అంటున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. బాబీ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ భారీ ఎత్తున నిర్మించిన చిత్రం జై లవకుశ. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం పోషించిన ఈ చిత్రంలో రాశి ఖన్నా, నివేదా థామస్ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. లవకుశ రెండు పాత్రలు పోషించడం పెద్ద సవాల్ కాలేదు కానీ జై పాత్ర కోసం చాలా శ్రమించా నని దానికి ఏ రెఫరెన్స్ లేదు కాబట్టి రకరకాలుగా ఆలోచించి నత్తి పెట్టామని అయితే ఆవేశంలో ఉన్నప్పుడు ఆ నత్తి మరింతగా ఎలివేట్ అయ్యిందని మొత్తానికి ఈ ఒక్క సినిమా నాకు వంద సినిమాలతో సమానమని అంటున్నాడు ఎన్టీఆర్. n nటీజర్ , ట్రైలర్ లతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనడంతో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సెంటర్లలో జై లవకుశ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈరోజు నుండి దసరా పండగ సెలవులు కావడం, రేపు సినిమా రిలీజ్ ఉండటంతో భారీ వసూళ్లు సాధించడం ఖాయమని ధీమాగా ఉన్నారు ఆ చిత్ర యూనిట్. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 

మహేష్ ఎంతపని చేస్తున్నాడో తెలుసా

సూపర్ స్టార్ మహేష్ బాబు కు రాజకీయాలంటే పెద్దగా ఆసక్తి లేదు కానీ కృష్ణ మాత్రం కాంగ్రెస్ పార్టీ కి మద్దతు ఇవ్వడమే కాకుండా ఆపార్టీ లో చేరి పార్లమెంట్ సభ్యుడు కూడా అయ్యాడు. ఎన్టీఆర్ ని తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించాడు కూడా . కట్ చేస్తే ఎన్టీఆర్ లేడు , కృష్ణ కూడా రాజకీయాలకు దూరమయ్యాడు. ఇక ఇప్పుడేమో మహేష్ వంతు వచ్చింది. మహేష్ కు నేరుగా రాజకీయాలంటే ఇష్టం లేదు కాబట్టి నేరుగా రాజకీయాలలోకి రాడు కానీ జగన్ పార్టీ కి సహాయం చేసే పనిలో ఉన్నాడు.nదర్శకులు కొరటాల శివ దర్శకత్వంలో తాజాగా మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా చేస్తున్నాడు. రాజకీయ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా వై ఎస్ జగన్ ని సపోర్ట్ చేసేలా తీస్తున్నారు. కొరటాల శివ బంధువు పోసాని కాగా ఆ పోసాని కృష్ణ మురళి బహిరంగంగా జగన్ కు సపోర్ట్ చేస్తున్నానని ప్రకటించడమే కాకుండా అతడి తరుపున ప్రచారం చేస్తానని కూడా అన్నాడు. అలా జగన్ కు ప్రయోజనం కలిగించడానికి వచ్చే ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి అయ్యేలా దోహదపడటానికి ఈ సినిమా చేస్తున్నారట. మహేష్ బావ గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీగా ఉన్నాడు . పైగా తెలుగుదేశం పార్టీ తరుపున గెలిచాడు. మహేష్ జగన్ కోసం చేస్తున్న సినిమా భరత్ అనే నేను అని అప్పుడే ప్రచారం జరుగుతోంది. మరి ఈ విషయాలపై మహేష్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

ఆ సినిమా వివాదాస్పదం అవ్వడం ఖాయం

రాజకీయ , సినీ రంగాల్లో చెరగని ముద్ర వేసిన మహానటుడు , మహా నాయకుడు ఎన్టీఆర్ . అయితే ఆ మహానటుడు , మహా నాయకుడి బయోపిక్ చేయడానికి ఇటు నందమూరి బాలకృష్ణ , అటు దర్శకులు రాంగోపాల్ వర్మ  ప్రయత్నాలు చేస్తున్నారు . బాలయ్య తీయబోయే ఎన్టీఆర్ బయోపిక్ కి దర్శకుడు ఎవరు ? అనేది ఇంకా బాలయ్య డిసైడ్ చేయలేదు కానీ రాంగోపాల్ వర్మ మాత్రం రీసెర్చ్ కంప్లీట్ చేసి         '' లక్ష్మీస్ ఎన్టీఆర్ ''  అనే టైటిల్ ని కూడా పెట్టాలనుకుంటున్నట్లు చెప్పేసాడు . అంతేనా ఎన్టీఆర్ బయోపిక్ ని లక్ష్మీపార్వతి చెప్పే యాంగిల్ లో తీస్తే అసలు వెన్నుపోటు దారులు ఎవరు ? అప్పుడు జరిగిన మతలబు ఏంటి ? అనే విషయాలు వెలుగులోకి వస్తాయని కూడా అంటున్నాడు . n nఒకవేళ వర్మ లక్ష్మీపార్వతి యాంగిల్ లో కనుక సినిమా చేస్తే అప్పుడు చంద్రబాబు వెన్నుపోటు తప్పకుండా హైలెట్ అవుతుంది అంతేకాదు చంద్రబాబు తో పాటు అతడికి అప్పట్లో సపోర్ట్ చేసిన బాలయ్య , హరికృష్ణ , దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు, మోహన్ బాబు  లతో మిగతా వాళ్ళ వివరాలు కూడా బయట పడతాయి . అంటే ఇవన్నీ బయటకు వస్తే పెద్ద వివాదం చెలరేగడం ఖాయం . సంచలనం సృష్టించడం ఖాయం . మరి అంతటి వివాదానికి కారణమయ్యే చిత్రం గురించి బాలయ్య ఒప్పుకుంటాడా ? వర్మ కు ఆ చాన్స్ ఇస్తాడా చూడాలి . 

అండర్ వేర్ కావాలనే వేసుకోలేదా

తెలుగులో లోఫర్ చిత్రంతో పరిచయమైన భామ దిశా పటాని . అందాల ముద్దుగుమ్మ అయిన దిశా తన అందాలను పోటీపడి మరీ చూపిస్తోంది . సక్సెస్ రేటు అంతగా లేని ఈ భామ అందాలతో హీటెక్కిస్తూ కుర్రాళ్ళ కు నిద్ర లేకుండా చేస్తోంది . బాలీవుడ్ లో  ఎం ఎస్ ధోని చిత్రంలో నటించి సక్సెస్ అందుకున్న ఈ భామ తెలుగులో కూడా స్టార్ కావాలని ఆశపడుతోంది .     తాజాగా ఓ ప్రముఖ మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ చేసింది దిశా పటాని . ఆ ఫోటో షూట్ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టేలా ఫోజులు కొట్టింది . ఇక ఒక స్టిల్ చూస్తే కావాలనే అండర్ వేర్ వేసుకోలేదేమో అనిపిస్తోంది . ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ చూపించాలో బాగా తెలిసిన కిలాడి లా ఉంది అందుకే ఆ ఫోటో షూట్ ప్రకంపనలు సృష్టిస్తోంది . ఎంత పొదుపుగా బట్టలు వేసుకుంటే అంత ఎక్కువ ప్రచారం లభిస్తుంది కాబట్టి అమ్మడు ఆ తెలివి తేటలను బాగానే వంట బట్టించుకుంది . 

ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయింది

అందాల భామ ఛార్మి ఇటీవల పోర్చుగల్ వెళ్ళింది బాలయ్య సినిమా కోసం . బాలయ్య సినిమా కు ఛార్మి కి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా ? దర్శకులు పూరి జగన్నాధ్ కదా ! పూరి కనెక్ట్స్ లో ఛార్మి భాగస్వామి ఆ కనెక్షన్ తో పోర్చుగల్ వెళ్ళింది . అయితే అక్కడ గురుద్వారా కు వెళ్ళింది అందులో విశేషం ఏముంది అని అనుకుంటున్నారా ? వెళ్ళింది కేవలం టాప్ తో మాత్రమే సుమా ! ప్యాంట్ వేసుకోకుండానే వెళ్లి షాక్ ఇచ్చింది . పైగా గురుద్వారా కు వెళ్ళిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి రచ్చ రచ్చ చేస్తోంది . తొడలు కనిపించేలా ఉన్న టాప్ లో ఉన్న ఛార్మి ని నెటిజన్లు ఆడుకుంటున్నారు . మరోసారి వస్త్రధారణ అంశం తెరమీదకు వచ్చింది , వివాదం రాజేసింది . 

సెలెనా అందాలు బయట పడ్డాయి

అమెరికన్ సింగర్ కం యాక్ట్రెస్ అయిన సెలెనా గోమెజ్ తాజాగా ఫ్యాషన్ పేరుతో అభాసుపాలయ్యింది . స్టైలిష్ గా రెడీ అయిన ఈ భామ అంతే స్టైలిష్ లుక్ తో బయటకు వచ్చేసింది అయితే టాప్ లోపల బ్రా లేకపోవడంతో వేసుకున్న టాప్ పక్క సందు లోంచి లోపలి అందాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తూ కుర్రాళ్లకు భలే పసందు ని అందించింది సెలెనా గోమెజ్ . అసలే పేరున్న భామ ఆపై అందగత్తె కూడా కావడంతో ఈ భామ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి . n nకొంతమంది అయ్యో ! పాపం అని సెలెనా పట్ల జాలి చూపిస్తుండగా మరికొంతమంది మాత్రం ఈ భామ కావాలనే అలాంటి డ్రెస్ ని వేసుకొచ్చిందని తెలియక కాదని అంటున్నారు . మొత్తానికి సెలెనా గోమెజ్ అందాలను చూస్తూ గాల్లో తేలిపోతున్నారు కుర్రాళ్ళు .
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..