Home న్యూస్
టాలీవుడ్
 న్యూస్

డ్రాయర్ తీసేసి నగ్నంగా ఫోజు ఇచ్చిన భామ

33 ఏళ్ల అంబర్ రోజ్ డ్రాయర్ ని తీసి పడేసి కాళ్లకు , తొడలకు నూనె రాసి అలాగే ఫోజు ఇచ్చి సంచలనం సృష్టిస్తోంది , ఒంటి మీద కేవలం బ్రా మాత్రమే ఉంది . పైగా నడుము కింది భాగంలో షేవ్ కూడా చేసుకోలేదు దాంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు అంబర్ రోజ్ పిక్ చూసి . తన ఇన్ స్టా గ్రామ్ లో ఈ పిక్ పోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది అంబర్ రోజ్ .     యునైటెడ్ స్టేట్స్ కి చెందిన ఈ హాట్ భామ కు విజ్ ఖలీఫా తో 2013 లో పెళ్లి అయ్యింది , అయితే మూడేళ్ళ కాపురం తర్వాత విడిపోయారు . ఇక ఈ భామకు ఒక సంతానం కూడా . కానీ సిగ్గు ఎగ్గూ లేకుండా నడుము కింది భాగాన్నీ నగ్నం గా చూపించి సంచలనం రేపింది . అంబర్ రోజ్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేస్తున్నాయి . 

అందాలు చూపిస్తా చూసుకోండి అంటోంది

నా అందాలు చూపిస్తా ........ చూసేవాళ్ళు చూసుకోండి, ఎంజాయ్ చేయండి అంతేకాని వార్నింగ్ లు ఇవ్వకండి ....... నన్ను చంపకండి అంటూ సవాల్ చేస్తోంది '' కోమల్ ఝా ''. బాలీవుడ్ లో త్రీ ఇడియట్స్ చిత్రంలో నటించిన ఈ భామ తెలుగులో సైతం పలు చిత్రాల్లో నటించింది . అయితే వస్తున్న పాత్రలంతా చిన్నవి కావడం , అవి చిన్న సినిమాలు కావడం సరైన హిట్ లేకపోవడంతో బాధపడుతోంది సరైన బ్రేక్ కోసం .   తాజాగా బికినీ వేసి అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు సవాల్ విసిరిన  ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది . తరచుగా ఎక్స్ పోజింగ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుండటం తో ఎక్స్ పోజింగ్ చేస్తున్న ఫోటోలు పెట్టకు మమ్మల్ని చంపుకు తినకు అంటూ కొంతమంది కోమల్ ని బెదిరిస్తున్నారట దాంతో రెచ్చిపోయి సవాల్ విసురుతోంది . నా అందాలు నాఇష్టం ...... చూపిస్తా చూసేవాళ్ళు చూసుకోండి అని అంటోంది . 

ఎస్సై తో ఎం ఎల్ ఏ అక్రమ సంబంధం

ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన ఓ ప్రజా ప్రతినిధి , ఓ మహిళా ఎస్సై సమస్యలను పక్కనపెట్టి హాయిగా అక్రమ సంబంధం పెట్టుకొని రాసలీలలు సాగిస్తూ వార్తల్లోకి ఎక్కారు . పక్క రాష్ట్రమైన కర్ణాటక లో ఈ దారుణం జరుగుతోంది . కర్ణాటక బిజెపి ఎం ఎల్ ఏ తిప్పరాజు ఓ మహిళా ఎస్సై తో జోరుగా రాసలీలలు సాగిస్తున్నాడు . విచిత్రం ఏంటంటే నేరుగా తన ఇంటికే తెచ్చుకొని శృంగారంలో పాల్గొంటున్నాడట ఈ ఎం ఎల్ ఏ .   ఇక సదరు మహిళా ఎస్సై కూడా ఎం ఎల్ ఏ తో సాగిస్తున్న రాసలీలల గురించి భయపడటం లేదట . పైగా దబాయిస్తూ మా మధ్య ఏమి లేదు అనవసరంగా నోరు పారేసుకుంటున్న వాళ్ళ ని ఊరుకునే వదిలేది లేదని వార్నింగ్ ఇస్తోంది . ఇప్పుడు కర్ణాటకలో ఈ ఇద్దరి వ్యవహారం హాట్ టాపిక్ అయి కూర్చుంది . 

న‌వీన్ చంద్ర హీరోగా వేణుమూవీస్ సంస్థ కొత్త చిత్రం ప్రారంభం

రెండు ద‌శాబ్దాల పాటు పంపిణీ రంగంలో మూడు వంద‌ల‌కు పైగా చిత్రాల‌ను డిస్ట్రిబ్యూట్ చేసిన వేణుమూవీస్ నిర్మాణ రంగంలోకి ప్ర‌వేశించింది. పసుపులేటి శ్రీనివాస‌రావు స‌మ‌ర్ప‌ణ‌లో న‌వీన్ చంద్ర హీరోగా జి.గోపి ద‌ర్శ‌క‌త్వంలో వేణుమాధ‌వ్ నిర్మాత‌గా రూపొందుతున్న కొత్త చిత్రం శ‌నివారం హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. ముహుర్త‌పు స‌న్నివేశానికి టి.వి.న‌ర‌సింహారెడ్డి క్లాప్ కొట్ట‌గా, క‌రంటం రాంబాబు కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సంద‌ర్భంగా....చిత్ర ద‌ర్శ‌క నిర్మాత‌లు మాట్లాడుతూ ``న‌వీన్ చంద్ర‌, ఆర్తి చిక్క‌ర హీరో హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఇది రొమాంటిక్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌. క‌థ ప‌రంగా ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను అత్యున్న‌త సాంకేతిక విలువ‌ల‌తో నిర్మిస్తాం`` అన్నారు.ఈ చిత్రానికి కెమెరాః వాసు, సంగీతం: కార్తీక్‌, ఆర్ట్ డైరెక్ట‌ర్ః హ‌రి, ఎగ్జిక్యూటివ్ నిర్మాతః వి.శ్రీనివాస్‌, స‌హా నిర్మాతః వి.కావేరి, నిర్మాతః ప‌సుపులేటి వేణుమాధ‌వ్‌, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వంః జి.గోపి.

సూప‌ర్‌గుడ్ ఫిలింస్ 90వ సినిమా `ద్వార‌క‌` టీజ‌ర్‌..

సూప‌ర్‌గుడ్ ఫిలింస్ స‌మ‌ర్ప‌ణ‌లో లెజెండ్ సినిమా ప‌తాకంపై ప్ర‌ద్యుమ్న‌- గ‌ణేష్ సంయుక్తంగా నిర్మించిన సినిమా ``ద్వార‌క‌`. `పెళ్లిచూపులు` ఫేం విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడు. పూజా జ‌వేరి క‌థానాయిక‌. శ్రీ‌నివాస్ ర‌వీంద్ర (ఎంఎస్ఆర్‌) ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. వ‌చ్చే నెల‌లో ఈ సినిమా రిలీజ్ కానుంది. కృష్ణాష్ట‌మి సంద‌ర్భంగా.. స‌మ‌ర్ప‌కుడు ఆర్‌.బి.చౌద‌రి ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్, సాంగ్ (భ‌జ‌రే నంద‌గోపాల హ‌రే..) టీజ‌ర్‌ని లాంచ్ చేశారు. హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో ... ఆర్‌.బి.చౌద‌రి మాట్లాడుతూ -``ఇది మా బ్యాన‌ర్ నుంచి వ‌స్తున్న 89వ సినిమా. ఎంతోమంది న‌టీన‌టులు, ద‌ర్శ‌కులు, టెక్నీషియ‌న్ల‌ను ప‌రిచ‌యం చేశౄం. అదే కోవ‌లో ఈ సినిమాతో కొత్త నిర్మాత‌లు ప్ర‌ద్యుమ్న‌-గ‌ణేష్‌ల‌ను ప‌రిచ‌యం చేయ‌డం సంతోషంగా ఉంది. తెలుగు, త‌మిళ్‌, మ‌ల‌యాళ భాష‌ల్లో సినిమాలు నిర్మించాం. అలాగే శ్రీ‌నివాస్ ర‌వీంద‌ర్ లాంటి ప్ర‌తిభావంతుడైన ద‌ర్శ‌కుడిని ప‌రిచ‌యం చేయ‌డం హ్యాపీగా ఉంది. సాయికార్తిక్ అంద‌మైన సంగీతం అందించాడు. ఒక పాట మిన‌హా చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. వ‌చ్చే నెల‌లో సినిమా రిలీజ్ చేయ‌నున్నాం`` అన్నారు. నిర్మాత ప్ర‌ద్యుమ్న‌ మాట్లాడుతూ -``20 ఏళ్ల క్రితం ప్యాష‌న్‌తో సినీప‌రిశ్ర‌మ‌కి వ‌చ్చాను. ల‌క్కీగా ఆర్‌.బి.చౌద‌రి వంటివారి అండ ల‌భించింది. ఎంతోమంది లైఫ్‌ని త్యాగం చేసి ఇక్క‌డికి వ‌చ్చి ఎంతో క‌ష్ట‌ప‌డుతుంటారు. సినిమా అనేది సామాజిక బాధ్య‌త‌. విజ్ఞానంతో తీయాలి. నిర్మాత‌ల‌కు ఆ తెలివితేట‌లు, నాలెజ్‌ ఉండాలి. 90 సినిమాలు తీసిన నిర్మాత ఆర్‌.బి.చౌద‌రి గారు మా వెన్నంటి నిల‌వ‌డం నా అదృష్టం. ఆయ‌న మాపై పెద్ద బాధ్య‌త ఉంచారు. 24 శాఖ‌ల‌కు సంబంధించిన కుటుంబాలు ప‌రిచయం కావ‌డం ఆనందాన్నిచ్చింది. ఈ సినిమా క‌థ‌ని న‌మ్మి హీరో ఓకే చెప్పారు. సుప్రీం వంటి పెద్ద సినిమాలు చేసిన సాయి కార్తిక్ అండ‌గా నిలిచి సంగీతం అందించారు. శ్యామ్‌.కె నా వెంటే నిలిచారు. ల‌క్ష్మీ భూపాల్ మాట‌ల‌కు అవార్డు వ‌స్తుంది. ఈ సినిమాకి స‌పోర్టు చేసిన అంద‌రికీ పేరు పేరునా వంద‌నాలు`` అన్నారు. ద‌ర్శ‌కుడు శ్రీ‌నివాస్ మాట్లాడుతూ -``2015లో ఈ సినిమాకి క‌మిట‌య్యాను. క‌థ విష‌యంలో ఆర్‌.బి.చౌద‌రి గారిని క‌న్విన్స్ చేయ‌డం అంత ఈజీ కాదు. ఆయ‌న్ను ఒప్పించి ఈ సినిమా పూర్తి చేయ‌గ‌లిగాను. తెర‌పై విజువ‌ల్స్ చూసి ఆశీర్వ‌దించండి`` అన్నారు. మాట‌ల ర‌చ‌యిత ల‌క్ష్మీ భూపాల్ మాట్లాడుతూ -``టాప్ టెక్నీషియ‌న్ల‌తో, ఆర్‌.బి.చౌద‌రి గారి అండ‌తో తీసిన సినిమాకి ప‌నిచేయ‌డం సంతోషంగా ఉంది. నాలుగైదేళ్ల క్రిత‌మే ఈ క‌థ‌ను ద‌ర్శ‌క‌నిర్మాత‌లకు చెప్పాను. పెళ్లి చూపులు హీరో హిట్‌తో ఊపుమీదున్నాడు. ఈ సినిమాతో మ‌రో పెద్ద విజ‌యం అందుకోవాలి`` అన్నారు. హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ మాట్లాడుతూ -``పెళ్లి చూపులు విజ‌యంతో క్ష‌ణం తీరిక లేకుండా అయిపోయాను. ఆ విజ‌యాన్ని ఆస్వాధిస్తుండ‌గానే `ద్వ‌రాక‌` వ‌చ్చేస్తోంది. అంద‌రూ టాప్ టెక్నీషియ‌న్ల‌తో, ఆర్‌.బి.చౌద‌రి గారి బ్యాన‌ర్‌లో సినిమా అంటే షాక్‌కి గుర‌య్యాను. మెగా నిర్మాత‌ల్ని నా ఖాతాలో వేసుకున్నానా? అనిపించింది. ద్వార‌క క‌థ న‌చ్చి ఓకే చెప్పాను. వైవిధ్యం ఉన్న క‌థ‌ని నిర్మాత‌లు ఎంక‌రేజ్ చేయ‌డం హ్యాపీ. గ‌ణేష్ కొరియోగ్ర‌ఫీలో వైవిధ్య‌మైన డ్యాన్సులు వేశాను`` అన్నారు. నిర్మాత గ‌ణేష్‌, శ్యామ్‌.కె.నాయుడు, మాజీ ఇన్‌కంట్యాక్స్ క‌మిష‌న‌ర్ పార్థ‌సార‌థి, సాయికార్తిక్‌, బ్ర‌హ్మ‌క‌డ‌లి, పూజా జ‌వేరి, పి.హ‌రికృష్ణ‌, గిరిధ‌ర్ త‌దిత‌రులు కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

ఓంకార్, పివిపిసినిమా, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా రూపొందిస్తోన్న `రాజుగారి గది 2`

ఆట డ్యాన్స్ షోతో పాటు పాపులర్ టీవీ యాంకర్ గా పేరు తెచ్చుకుని సినిమా రంగంలో దర్శకుడిగా రాజుగారి గది వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాను రూపొందించిన ఓంకార్, ప్రముక నిర్మాణ సంస్థ బ్యానర్ మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ కాంబినేషన్ లో రాజుగారి గది2 రూపొందుతోంది. 2015లో విడుదలైన రాజుగారి గది చిత్రం పెద్ద సెన్సేషనల్ హిట్ అయ్యింది. అంతే కాకుండా హర్రర్ కామెడి జోనర్ లో ఓ కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసింది.ఓంకార్ రాజుగారి గది చిత్రాన్ని వారాహి చలనచిత్రంతో సహకారంతో నిర్మించిన సంగతి తెలిసిందే. కాగా రాజుగారి గది2 చిత్రానికి పివిపి సినిమా బ్యానర్ తోడు కావడంతో కాస్టింగ్ విషయంలో కానీ, టెక్నికల్ పరంగా కానీ సినిమా స్కేల్ పెరిగింది. పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కవిన్ అన్నే ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తారు.పివిపి సినిమా, మ్యాట్నీ ఎంటర్ టైన్నమెంట్, ఓక్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్స్ సంయుక్తంగా రాజుగారి గది 2 చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరికొన్ని విషయాలు, నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలు తెలియజేస్తామని పివిపి సినిమా వర్గాలు తెలియజేశాయి.

హీరో ప్రభాస్‌ చేతుల మీదుగా 'అరకు రోడ్‌లో' సాంగ్‌ టీజర్‌ విడుదల

రామ్‌ శంకర్‌, నిఖిషా పటేల్‌ హీరో హీరోయిన్లుగా శేషాద్రి క్రియేషన్స్‌ పతాకంపై వాసుదేవ్‌ దర్శకత్వంలో మేకా బాలసుబ్రహ్మణ్యం, బి. భాస్కర్‌, వేగిరాజు ప్రసాదరాజు, రామేశ్వరి నక్కా లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'అరకురోడ్‌లో'. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని ఆడియో విడుదలకు సిద్దంగా ఉంది. ఈ చిత్ర సాంగ్‌ టీజర్‌ను యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ మాట్లాడుతూ..'ఎప్పుడురా పెళ్లి..' అనే ఈ సాంగ్‌ నా గురించే రాసినట్లుంది. లిరిక్స్‌ చాలా క్యాచీగా ఉన్నాయి. సాంగ్‌ చాలా వెరైటీగా ఉంది. సహజంగా పూరీ గారు తన సినిమాలలో ట్యూన్స్‌, లిరిక్స్‌ ఆయనే రాస్తుంటారు. అలాగే ఈ చిత్ర దర్శకుడు వాసుదేవ్‌ కూడా మల్టీ టాలెంటెడ్‌లా కనిపిస్తున్నాడు. ఈ సాంగ్‌ అదిరిపోయింది. సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను..అని అన్నారు.చిత్ర దర్శకుడు వాసుదేవ్‌ మాట్లాడుతూ..'గెడ్డం తెల్లబడి పోతావుందే..' అనే లిరిక్‌తో సాగే సాంగ్‌ టీజర్‌ను మా కోరిక మేరకు బాహుబలి, యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ గారు ఫిల్మ్‌ సిటీలోని బాహుబలి సెట్‌లో ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మా టీమ్‌ అందరి తరుపున ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ పాటని నేను, రామాంజనేయులు కలిసి రాయడం జరిగింది. ప్రస్తుతం చిత్ర షూటింగ్‌ మొత్తం పూర్తయింది. సెప్టెంబర్‌ 10న సినీ ప్రముఖుల సమక్షంలో హైద్రాబాద్‌లో గ్రాండ్‌గా ఆడియో ఆవిష్కరణ జరుపనున్నాం. పూరీ సంగీత్‌ ద్వారా పాటలు మార్కెట్‌లోకి విడుదలకానున్నాయి...అని అన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో హీరో రామ్‌శంకర్‌, నిర్మాత మేకా బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.రామ్‌శంకర్‌, నిఖిషా పటేల్‌, కమల్‌ కామరాజు, అభిమన్యు సింగ్‌, కోవై సరళ, థర్టీ ఇయర్స్‌ ఫృథ్వీ, కృష్ణ భగవాన్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సాహిత్యం: వాసుదేవ్‌, రామాంజనేయులు; ఎడిటర్‌: మార్తాండ్‌ కె. వెంకటేష్‌, సంగీతం:వాసుదేవ్‌, రాహుల్‌రాజ్‌; డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: జగదీశ్‌ చీకటి, నిర్మాతలు: మేకా బాలసుబ్రహ్మణ్యం, బి. భాస్కర్‌, వేగిరాజు ప్రసాదరాజు, రామేశ్వరి నక్కా; రచన, దర్శకత్వం: వాసుదేవ్‌.

పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన 'సక్కనోడు..చిక్కినా అందమే'

శ్రీలక్ష్మీ వెంకటరమణ మూవీస్‌ పతాకంపై శ్రీరామ్‌ దర్శకత్వంలో లీలా కార్తీక్‌, స్వప్న హీరో హీరోయిన్లుగా యు.ఎస్‌. రామచంద్రరావు నిర్మిస్తున్న లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'సక్కనోడు..చిక్కినా అందమే'. ఇటీవలే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రీరామ్‌ మాట్లాడుతూ..నేటి ట్రెండ్‌కి తగ్గ లవ్‌స్టోరీతో యూత్‌నే కాకుండా ఫ్యామిలీ మొత్తాన్ని ఆకట్టుకునే సబ్జెక్ట్‌ ఇది. మా నిర్మాతలు నేను చెప్పిన సబ్జెక్ట్‌ని నమ్మి, వెంటనే షూటింగ్‌ ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. కిషన్‌ కవాడియా సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుంది. ఈ చిత్రానికి సంబంధించి ట్రయిల్‌ షూట్‌ చేయడం జరిగింది. మంచి అభినయం ప్రదర్శించగల నటీనటులు ఈ చిత్రానికి దొరకడం ఆనందంగా ఉంది...అన్నారు. నిర్మాత యు.ఎస్‌. రామచంద్రరావు మాట్లాడుతూ..దర్శకుడు శ్రీరామ్‌ మంచి ఫ్యామిలీ నేపథ్యం ఉన్న కథని వినిపించారు. కథ ఎంతగానో నచ్చింది. అందుకే వెంటనే షూటింగ్‌ ప్రారంభించాము. శరవేగంగా చిత్రీకరణ జరిపి..అతి తక్కువ సమయంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము...అన్నారు. లీలా కార్తీక్‌, స్వప్న హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు: బోడిరెడ్డి సాయికుమార్‌; సంగీతం: కిషన్‌ కవాడియా; కెమెరా: పి. వనిదర్‌ రెడ్డి; డ్యాన్స్‌: బి. రామారావు; ఎడిటింగ్‌: వి. నాగిరెడ్డి; ఆర్ట్‌: వెంకట్‌ ఆరె; కో-డైరెక్టర్‌: పురుషోత్తమ రెడ్డి వూటూరు; సహనిర్మాత: స్వప్నమంజరి మహంతి; నిర్మాత: యుఎస్‌. రామచంద్రరావు; దర్శకత్వం: శ్రీరామ్‌ బి.ఎస్‌.సి

చుట్టాలబ్బాయి సినిమాకు మంచి అప్రిసియేషన్ వస్తుంది - వెంకట్ తలారి

ది హీరోగా హిట్‌ చిత్రాల దర్శకుడు వీరభద్రమ్‌ దర్శకత్వంలో శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్‌, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్లూరి నిర్మించిన చిత్రం.'చుట్టాలబ్బాయి'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్ట్‌ 19న. రిలీజ్ అయింది. ఈ సంద‌ర్భంగా నిర్మాత‌ల్లో ఒక‌రైన వెంకట్ తలారి సినిమా గురించి మాట్లాడుతూ ``నిర్మాతగా తొలి చిత్రానికి ఇంత మంచి రెస్పాన్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది. ఉత్సాహాన్నిస్తుంది. సినిమా విడుదలైన రోజు నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.. విడుదల రోజున 350 థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన రావడంతో ఇప్పుడు మరో వంద థియేటర్స్ ను పెంచుతున్నాం. మొదటి మూడు రోజుల్లో ఆరు కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. మరో రెండు రోజుల్లో మేం పెట్టిన డబ్బు వచ్చేస్తుంది.సాయికుమార్ గారు, ఆది కలిసి నటించడం ఒక ప్లస్ అయితే, థమన్ మ్యూజిక్ సినిమాకు మరో ఎసెట్ అయ్యింది. కామెడి బాగా పండింది. ఆడియెన్స్ తో పాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు సినిమా బావుందని అంటున్నారు. అలాగే నిన్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుగారు సినిమా బావుందని అప్రిసియేట్ చేస్తున్నారు. అలాగే గ్రంధి మల్లిఖార్జునరావు గారు సినిమా చూశారు. మరి కొంత మంది ప్రముఖులు కూడా సినిమా చూడాలని అంటున్నారు. సినిమా సక్సెస్ అయిన సందర్భంగా ప్రేక్షకులకు థాంక్స్ చెప్పడానికి సక్సెస్ టూర్ ప్లాన్ చేస్తున్నాం. తిరుపతి, నెల్లూరు, కడప, వైజాగ్, విజయవాడ, గుంటూరు ఇలా నాలుగైదు రోజుల పాటు యూనిట్ సభ్యులు ప్రేక్షకులను కలిసే ప్లాన్ చేస్తున్నాం. మా శ్రీ ఐశ్వర్య లక్ష్మి మూవీస్ బ్యానర్ లో వీరభద్రమ్ గారి దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాం. అలాగే మరికొన్ని చిత్రాలు డిస్కషన్స్ లో ఉన్నాయి. వాటి వివరాలను త్వరలోనే తెలియజేస్తాం`` అన్నారు.

రొమాంటిక్ ఫిలింలా ఉందంటున్న రాజమౌళి

సాయికొర్రపాటి నిర్మాణ సారథ్యంలో సాయి శివాని సమర్పణలో వారాహిచలన చిత్రం ప‌తాకంపై రజనీ కొర్రపాటి నిర్మిస్తున్న సినిమా `జ్యో అచ్యుతానంద`.నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా కసండ్ర నాయ‌కానాయిక‌లు. శ్రీనివాస్ అవసరాల దర్శ‌కుడు. కల్యాణ్ రమణ సంగీతం అందించిన ఆడియో మార్కెట్లోకి రిలీజైంది. పెన్ డ్రైవ్ లో పాట‌ల్ని ఆవిష్క‌రించారు. థియేట్రికల్ ట్రైలర్ ను ఎస్.ఎస్.రాజమౌళి విడుదల చేశారు. హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఈ ఆడియో వేడుక‌లో యం.యం.కీరవాణి, నారా రోహిత్, నాగశౌర్య, కల్యాణ్ కోడూరి, నాని, శశాంక్, నందిని రెడ్డి, రమా రాజమౌళి, వ‌ల్లి, స్మిత, విజయేంద్రప్రసాద్, తమ్మారెడ్డి భరద్వాజ, అభిషేక్ పిక్చర్స్ అభిషేక్, భాస్కరభట్ల, జెమినికిరణ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.అనంత‌రం ... ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి మాట్లాడుతూ -``ట్రైల‌ర్ చూస్తుంటే సినిమా ఎలా ఉంటుందో అర్థ‌మ‌వుతోంది. కామెడి, రొమాన్స్‌, సంగీతం, స‌స్పెన్స్ అన్ని మ‌సాలాలు ఉన్న సినిమాలా ఉంది. రొమాంటిక్ ఫిలింలా.. స‌రాదాగా సాగే మ్యూజిక‌ల్ థ్రిల్ల‌ర్‌లా అనిపిస్తోంది. ట్రైల‌ర్‌లో ర‌క‌ర‌కాల స‌స్సెన్స్ క‌నిపిస్తోంది. ఓ సూప‌ర్‌హిట్ ఫిలిం ట్రైల‌ర్ చూసిన‌ట్టుంది. రోహిత్‌, నాగ‌శౌర్య‌ల మ‌ధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. అన్న‌ద‌మ్ముల్లా చక్క‌గా క‌న‌ప‌డుతున్నారు. రెజీనీ మంచి ఎక్స్‌ప్రెష‌న్స్ ఇచ్చింది. క‌ల్యాణ్ ర‌మ‌ణ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. సాంగ్స్ బావున్నాయి. పాయికొర్ర‌పాటిగారు ద‌ర్శ‌కుడిపై న‌మ్మ‌కంతో సినిమా చేసే నిర్మాత‌. అదే న‌మ్మ‌కంతో శ్రీని ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమాను నిర్మించారు. టీం అంతటికీ ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.మ‌ర‌క‌త‌మ‌ణి యం.యం.కీర‌వాణి మాట్లాడుతూ - ``మేజ‌ర్ స్కేల్‌లో సంగీతం అందించే మ్యూజిక్ డైరెక్ట‌ర్స్‌లో మా త‌మ్ముడు క‌ల్యాణ్ ఉన్నారు. త‌న‌కు, చిత్ర‌యూనిట్‌కి ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.హీరో నాని మాట్లాడుతూ -``శ్రీనిలో సెన్సాఫ్ హ్యుమ‌ర్ వైవిధ్యంగా క‌నిపిస్తుంది. ఈ క‌థ .. నేను కూడా విన్నా. విన్నంత సేపు బాగా నవ్వాను. క‌థ‌లోని ఎమోష‌నల్‌తో బాగా క‌నెక్ట్ అయ్యాను. పెద్ద హిట్ అవుతుంది. వారాహి చ‌ల‌న చిత్రం బ్యాన‌ర్‌లో నేను `ఈగ` సినిమా చేశాను. కంటెంట్‌ను న‌మ్మి సినిమాలు చేసే నిర్మాతల్లో సాయికొర్ర‌పాటి ఒక‌రు. క‌ల్యాణ్ కోడూరి చ‌క్క‌ని సంగీతం అందించారు. రోహిత్‌, నాగ‌శౌర్య‌, రెజీనాల‌కు ఆల్ ది బెస్ట్‌. సినిమా పెద్ద విజ‌యం సాధించాలి`` అన్నారు.చిత్ర క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య మాట్లాడుతూ- ``జ్యో అచ్యుతానంద టైటిల్ ఎలా కలిసి పోయిందో సెట్స్‌లో నారా రోహిత్‌, నేను అలా క‌లిసి పోయాం. ఈ సినిమా రీమేక్ కోసం బాలీవుడ్‌, త‌మిళం నుంచి పోటీ ఏర్ప‌డింది. ఎంత పెద్ద యాక్ట‌ర్స్ వ‌చ్చినా మా కెమిస్ట్రీని ఎవ‌రూ బీట్ చేయ‌లేరు. జీవితం అంటే సినిమాలా ఓ జ‌ర్నీ. ఈ జ‌ర్నీలో అవ‌స‌రాల శ్రీనివాస్‌, సాయికొర్ర‌పాటిగారిని క‌లిశాను. ఆ ఇద్ద‌రూ లేకుంటే నేను ఓ సాధార‌ణ అభిమాని అయ్యుండేవాడిని. ఈ బ్యాన‌ర్‌లో నేను మ‌రో సినిమా కూడా చేయ‌బోతున్నాను. నా జీవితంలో నా త‌ల్లిదండ్రుల త‌ర్వాత నేను అంత గౌర‌వ‌మిచ్చే వ్య‌క్తి సాయికొర్ర‌పాటిగారికే. చాలా సింపుల్‌గా ఉంటారు. ఆయ‌న‌లా ఏనిర్మాతా ఉండ‌రు. క‌ల్యాణి మాలిక్‌ మంచి మ్యూజిక్ అందించారు`` అన్నారు.నారా రోహిత్ మాట్లాడుతూ- ``ఇద్ద‌రు అన్న‌ద‌మ్ముల మ‌ధ్య ఉన్న రిలేష‌న్‌కి సంబంధించిన సినిమా ఇది. శ్రీనివాస్ అవ‌స‌రాల‌ వ‌ల్లే ఈ సినిమా చేశాను. ఈ జ‌ర్నీలో నాకు నాగ‌శౌర్య లాంటి సోద‌రుడు దొరికాడు. క‌థ‌ను న‌మ్మి సినిమా చేసే మంచి నిర్మాత సాయికొర్ర‌పాటి. నేను ఆయ‌న బ్యాన‌ర్‌లో `రాజా చెయ్యి వేస్తే` సినిమా చేశాను. ఆ సినిమా ఆశించినంత స‌క్సెస్ కాక‌పోయినా.. ఈ సినిమా క‌లిసి చేశాం. మూవీకి ఏం అవ‌స‌ర‌మో దాన్ని న‌మ్మి పెట్టారు. క‌ల్యాణ్ కోడూరి చ‌క్క‌ని సంగీతం అందించారు. ప్రేక్ష‌కులు ఆద‌రించాల‌ని కోరుకుంటున్నా`` అన్నారు.అవ‌స‌రాల శ్రీనివాస్ మాట్లాడుతూ -``ముందుగా నారా రోహిత్‌కు క‌థ‌ చెప్పాను. ఆయ‌న చేయ‌డ‌నుకున్నాను కానీ చేస్తాన‌న్నారు. అలాగే ఆనంద్ ఆనే పాత్ర రాసుకునేట‌ప్పుడే నాగ‌శౌర్య‌నే హీరో అనుకున్నాను. నారారోహిత్‌, నాగ‌శౌర్య‌లు నిజ‌మైన అన్న‌దమ్ముల్లా యాక్ట్ చేశారు. నా ఊహ‌లు గుస‌గులాడే చిత్రాన్ని ఆద‌రించిన త‌ర‌హాలోనే ఈ సినిమాను కూడా ఆద‌రిస్తార‌ని నమ్ముతున్నా`` అన్నారు.⁠
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..