Home న్యూస్
టాలీవుడ్
 న్యూస్

ఫైర్ అయిన రేణు దేశాయ్

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కి  అమెజాన్ వాళ్ళపై కోపం వచ్చింది అయితే ఆమెకి ఇంతగా కోపం రావడానికి కారణం ఏంటో తెలుసా .............. అమెజాన్ లో ఏవైనా వస్తువులు ఆర్డర్ చేస్తే సకాలంలో రావడం లేదట ! ఒకవేళ ఆలస్యంగా వచ్చినప్పటికీ సరైన చిల్లర ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని అమెజాన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది రేణు దేశాయ్ . అమెజాన్ బాయ్స్ పై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా వాళ్ళ పని తీరు మార్చుకోవాలని వినియోగదారుల మనసు గెలుచుకోవడానికి చర్యలు తీసుకోకపోతే ఆ సంస్థ మనుగడ కష్టమే అని అంటోంది . అంతేకాదు అమెజాన్ ఇండియా ప్రతినిధులకు ఈ విషయం పై ఫిర్యాదు కూడా చేసిందట రేణు దేశాయ్ . మరి రేణు దేశాయ్ సలహాలను పాటిస్తారా అమెజాన్ నిర్వాహకులు చూడాలి.

తిక్క కష్టమే

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ తాజాగా నటిస్తున్న చిత్రం ''తిక్క ''. అయితే ఈ చిత్రానికి అవసరానికి మించి ఖర్చు పెట్టారట దాంతో బ్రేక్ ఈవెన్ కావడం కష్టమే అని అంటున్నారు . అసలు సాయి ధరం తేజ్ కు ఇరవై కోట్ల మార్కెట్ లేదు కానీ ఈ సినిమాకి అప్పుడే 18 కోట్లకు పైగా ఖర్చు పెట్టారట ఇక పబ్లిసిటీ కలుపుకొని రిలీజ్ నాటికీ 20 కోట్లు దాటేలా ఉంది దాంతో అంత బడ్జెట్ తిరిగి నిర్మాతకు రావాలంటే తిక్క కనీసం 35 నుండి 40 కోట్లు వసూల్ చేయగలగాలి అప్పుడే పెట్టుబడి పెట్టిన నిర్మాతకు డబ్బులు వచ్చేవి . ఇక నిర్మాత రోహిన్ రెడ్డి విషయానికి వస్తే దర్శకుడు సునీల్ రెడ్డి తన మిత్రుడు కాబట్టి అతడికి ఓ సక్సెస్ రావాలని అతడి కోసం ఈ సినిమా చేస్తున్నాడు కానీ తిక్క కు రావాల్సిన క్రేజ్ మాత్రం ఇంకా రాలేదు . వచ్చే నెల 13న రిలీజ్ కానున్న ఈ చిత్రంపై ఆ చిత్ర యూనిట్ మాత్రం బోలెడు ఆశలు పెట్టుకుంది . 

కొరటాల శివ తో మళ్ళీ మహేష్

శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ ని అందించిన కొరటాల శివ తో మళ్ళీ ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు సూపర్ స్టార్ మహేష్ . ఇటీవల చేసిన బ్రహ్మోత్సవం ఘోర పరాజయం పొందడంతో మళ్ళీ కొరటాల శివ తో సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యాడు మహేష్ . ప్రస్తుతం మహేష్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు కాగా ఆ సినిమా పూర్తయ్యాక కొరటాల శివ తో చేయనున్నాడు మహేష్ . ఇక కొరటాల శివ కూడా ఆగస్టు లో జనతా గ్యారేజ్ ని పూర్తిచేసి ఫ్రీ కానున్నాడు దాని తర్వాత మహేష్ తో చేసే సినిమా కోసం పకడ్బందీఅయిన కథ ని రెడీ చేయనున్నాడు . ఇక ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తోందంటే అంతకుమించిన ఆనందం ఏముంటుంది మహేష్ ఫ్యాన్స్ కి . అలాగే శ్రీమంతుడు చిత్రం తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొనడం ఖాయం . 

ఆత్మహత్య చేసుకుంటానంటున్న శివాజీ

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీ కేంద్రం ఇచ్చినా , దానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒప్పుకున్నా ఆయన ఇంటిముందు ఆత్మహత్య చేసుకుంటానని సంచలన ప్రకటన చేసాడు నటుడు శివాజీ . ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అంటూ గత రెండేళ్లుగా శివాజీ పోరాటం చేస్తూనే ఉన్నాడు . అయితే శివాజీ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఎంతగా మొత్తుకున్నా ప్రత్యేక హోదా మాత్రం రావడం లేదు అయితే ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెబుతోంది కేంద్రం అయితే దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పుకుంటే చంద్రబాబు ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటానని అంటున్నాడు శివాజీ . 

అడల్ట్ సినిమా చేయనున్న అవసరాల శ్రీనివాస్

ప్రముఖ నటుడు ,దర్శకుడు అవసరాల శ్రీనివాస్ ఓ అడల్ట్ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . ఇంతకుముందు ఊహలు గుసగుసలాడే చిత్రాన్ని అందించిన అవసరాల తాజాగా ''జో అచ్యుతానంద '' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు . అది కాగానే అడల్ట్ సినిమా చేయడానికి రంగం సిద్దం చేసుకుంటున్నాడు .  బాలీవుడ్ లో సక్సెస్ అయిన హంటర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నాడు . ఇక ఈ అడల్ట్  సినిమాలో హాట్ భామ రెజీనా తో పాటు తేజస్వి కూడా నటించానున్నారట . ఈ సంవత్సరం ఆఖరులో ఈ సినిమా ప్రారంభం కానుంది . ప్రేమ కథా చిత్రాలను చేస్తే సరిగ్గా వర్కౌట్ కావడం లేదని ఇలా అడల్ట్ సినిమా చేయడానికి రెడీ అయ్యాడేమో అవసరాల . 

లవ్ లో పడిన సెక్స్ రాకెట్ లో దొరికిన భామ

కొత్త బంగారులోకం చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన భామ శ్వేతా బసుప్రసాద్ తాజాగా పీకల్లోతు ప్రేమలో ఉంది ఈ విషయాన్నీ ఆ భామే వెల్లడించింది . ఆమధ్య సెక్స్ రాకెట్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికి పెద్ద సంచలనం సృష్టించిన ఈ భామ కోర్టు లో నిర్దోషిగా బయటపడింది కూడా . అయితే ఆ తర్వాత శ్వేతా బసుప్రసాద్ కు చాలా అవకాశాలే ఇస్తామని చాలామంది ప్రకటించారు కానీ ఎవ్వరు మాత్రం చాన్స్ ఇవ్వలేదు దాంతో అనురాగ్ కశ్యప్ దగ్గర స్క్రిప్ట్ వర్క్ చేస్తోంది కాగా అక్కడికి తరుచుగా వచ్చే రోహిత్ మిట్టల్ తో జరిగిన పరిచయం క్రమేనా ప్రేమకు దారి తీసింది దాంతో ఇద్దరూ డేటింగ్ చేస్తూ చెట్టు పుట్టలు అనే తేడా లేకుండా ఎంజాయ్ చేస్తున్నారు . ప్రస్తుతం శ్వేతా బసుప్రసాద్ - రోహిత్ లు సన్నిహితంగా ఉన్న స్టిల్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి . 

ఆ నిర్మాతపై త్రిష కు కోపమా

తన డేట్స్ చూసే వ్యక్తికీ సినిమా చేస్తామని చెప్పి తెలుగు , తమిళ భాషలలో సినిమా చేసింది కూడా కానీ ఆ సినిమాని గాలి కి వదిలేసింది . సినిమా రిలీజ్ కి ముందు పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి కానీ ఈ భామ మాత్రం ప్రమోషన్ కు రాలేదు దాంతో నిర్మాతపై త్రిష కు కోపం వచ్చిందేమో ! అలాగే ఆర్ధిక లావాదేవీలలో ఎక్కడో తేడా వచ్చినట్లుంది అందుకే ఇలా ప్రమోషన్ కు రాకుండా హ్యాండ్ ఇచ్చింది అని గుసగుసలు మొదలయ్యాయి . గతకొంత కాలంగా త్రిష చిత్రాలు సరిగా ఆడటం లేదు ఇక కెరీర్ అయిపొయింది అని అనుకుంటున్న సమయంలో బాలయ్య సరసన ఓ సినిమా చేసింది ఆ సినిమా సరిగ్గా ఆడలేదు దాంతో తెలుగు, తమిళ  బాషలలో నాయకి అనే సినిమా చేసింది కానీ ఆ సినిమా కు సరైన ప్రమోషనే చేయలేదు . నిన్న రిలీజ్ అయిన నాయకి చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది . దాంతో ఆ సినిమా పోయినట్లే అని అంటున్నారు . 

కంటతడి పెట్టిన నాని

హీరో నాని ఓ చిన్నారి దీన గాధ చూసి చలించిపోయాడు , ఉబికి వస్తున్న కన్నీళ్ళలని ఆపుకుంటూ ఆ చిన్నారి గురించి మిగతా వాళ్ళకు తెలియజేయడానికి సోషల్ మీడియా ని ఆశ్రయించాడు . ఇంతకూ నానిని ఇంతగా కదిలించిన చిన్నారి పరిస్థితి ఏంటో తెలుసా ................ ఆ చిన్నారి బాంబు దాడులతో భీతిల్లి పోయింది పైగా తన పేరు కూడా చెప్పలేని పరిస్థితి లో ఉగ్రవాదుల దాడిలో కన్నతండ్రి బ్రతికున్నాడో చనిపోయాడో తెలియని ఘోర పరిస్థితుల మద్య ఉంది . ఇరాక్ , సిరియా ల ప్రజల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది . నిత్యం ఉగ్ర మూకల దాడులతో దద్దరిల్లిపోతున్న ఈ దేశాలు వందలాది మంది ని నిరాశ్రయులను చేయడమే కాకుండా తమ సంబంధీకులు ఉన్నారో  , లేరో కూడా తెలియని పరిస్థితిలో బ్రతుకుతున్నారు . అలాంటి ఓ చిన్నారి వీడియో ని చూసిన నాని కంటతడి పెట్టాడు . 

డైరెక్టర్ తో నదియా రొమాన్స్

డైరెక్టర్ కం నటుడు అయిన ఎస్ జే సూర్య తో సీనియర్ నటి నదియా రొమాన్స్ చేయడానికి రెడీ అవుతోంది అది కూడా మహేష్ చిత్రంలో . తమిళ దర్శకులు ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కనున్న చిత్రంలో విలన్ గా ఎస్ జే సూర్య నటిస్తున్న విషయం తెలిసిందే . కాగా అతడికి జోడీగా సీనియర్ నటిమణి నదియా ని ఎంపిక చేసారు . నదియా పాత్ర ఈ చిత్రంలో కీలకంగా ఉంటుందని అలాగే సూర్య తో నదియా కు రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయని అంటున్నారు . హీరోయిన్ గా అంతగా సక్సెస్ కాలేదు నదియా కానీ పెళ్లి చేసుకొని కొంతకాలం సినిమాలకు దూరమైన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది . ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సూపర్ హిట్ చిత్రాలతో దూసుకుపోతోంది నదియా . మిర్చి , అత్తారింటికి దారేది , అ ..... ఆ , దృశ్యం తదితర చిత్రాల్లో ప్రేక్షకులను అలరించింది నదియా . 

టాయిలెట్లు కడిగిన ఎంపి

టాయిలెట్లు కడగడం అసహ్యమైన పని కాదని మన ఆరోగ్యం బాగుండాలంటే మరుగుదొడ్లు క్లీన్ గా ఉండాలని చెప్పడమే కాకుండా స్వయంగా తన నియోజకవర్గం లోని పాటశాలలలో టాయిలెట్ల ని కడిగి అందరి చేత ముక్కున వేలేసుకునేలా చేసారు చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి . ప్రజలకు చెప్పడమే కాదు స్వయంగా చేయాలి అంటూ టాయిలెట్ల శుబ్రత కు నడుం బిగించారు ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి . పుట్టుకతోనే కోటీశ్వరుడైన కొండా ప్రజలకు , అలాగే యువతకు శుభ్రత పట్ల అవగాహనా కల్పించాడు . తన నియోజకవర్గం లోని గొల్లపల్లి ,ధర్మసాగర్ గ్రామాల్లోని ప్రభుత్వ పాటశాల లలోని మరుగుదొడ్ల ని క్లీన్ చేయడానికి టాయిలెట్ క్లీనర్ వాహనాన్ని కూడా కొనుగోలు చేసారు ఈ నాయకుడు . నాయకుడు అంటే ఆదేశాలు ఇచ్చేవాడు మాత్రమే కాదు నిజమైన ప్రజా సేవకుడు అని చాటి చెబుతున్నాడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి . 
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..