Home న్యూస్
టాలీవుడ్
 న్యూస్

అల్లు అర్జున్ ఎంత పని చేస్తున్నాడో తెలుసా

సినిమా నిర్మాణంలో ఉండగానే ఆ సినిమాకు సంబందించిన పలు విషయాలు బయటకు పోక్కుతున్నాయి ,పైగా కొన్ని స్టిల్స్ మాత్రమే కాకుండా వీడియో లు కూడా లీక్ అవుతున్నాయి ఇదంతా కేవలం ఇక్కడి స్టాఫ్ వల్లే అని భావించిన అల్లు అర్జున్ తన తదుపరి చిత్రానికి తెలుగు రాని వాళ్ళని పర్సనల్ స్టాఫ్ గా పెట్టుకోవడానికి ఫిక్స్ అయ్యాడట . దాని వల్ల మనం ఏం చేస్తున్నాం ,ఏం చేయబోతున్నాం అలాగే తెలుగు డైలాగ్స్ ఏంటి ? అన్న విషయం వాళ్ళకు తెలియదని, భాష రాదు కాబట్టి  పైగా బయటివాళ్ళకు ఆ విషయం తెలియదని ఇదే మంచి ప్లాన్ అని భావిస్తున్నాడట అల్లు అర్జున్ . nఇటీవల పలు చిత్రాల స్టిల్స్ కానీ , వీడియో లు కానీ బయటకు వస్తుండటంతో ఇంత పని చేస్తున్నాడు అల్లు అర్జున్ . ఇటీవలే సరైనోడు చిత్రంతో సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చేయడానికి రెడీ అవుతున్నాడు . దాని కోసమే ఈ జాగ్రత్తలు . 

నేత్ర దానం చేసిన బ్లాక్ బ్యూటీ

బ్లాక్ బ్యూటీ రెజీనా కసాండ్ర నేత్ర దానం చేసేసింది . నెల్లూరు లో ఓ నేత్ర వైద్యాలయంప్రారంభోత్సవం లో పాల్గొన్న రెజీనా ఆసుపత్రిని ప్రారంభించడమే కాకుండా కంటి చూపు లేక ఇబ్బంది పడుతున్న లక్షలాది మంది కోసం నేత్ర దానం చేయాల్సిన అవసరం ఉంది అని చాటి చెప్పడమే కాకుండా తన తదనంతరం రెండు కళ్ళని దానం చేస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా హామీ పత్రాలపై సంతకం చేసి నిర్వాహకులకు అందించింది రెజీనా . అవయవ దానం గురించి అవగాహన కల్పించిన రెజీనా నెల్లూరు వాసుల అభిమానాన్ని చూరగొంది . ఇక ఈ భామ ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో  నక్షత్రం చిత్రంలో నటిస్తోంది . రానా తో నటించబోయే కొత్త సినిమా ఆగష్టు 15న ప్రారంభం కానుంది . 

ఫోటో షూట్ తో పిచ్చి లేపుతున్న అనసూయ

రెండు చిత్రాల్లో నటించినప్పటికీ , అవి హిట్ అయినప్పటికీ తనకు మాత్రం సరైన క్రేజ్ రాలేదు పెద్దగా అవకాశాలు రాలేదు అని భావించిన హాట్ భామ అనసూయ ఏకంగా మరోసారి ఫోటో షూట్ చేసింది . ఇక తాజాగా అనసూయ చేసిన ఫోటో షూట్ తో  కుర్రకారుని పిచ్చేక్కిస్తోంది . తొడలపై దాకా పిక్కల బలం  కనిపించేలా  రకరకాల భంగిమలలో అనసూయ ఇచ్చిన ఫోజు చూస్తే నిద్ర పోవడం కష్టమే మరి . అంతగా రెచ్చిపోయి ఫోటో షూట్ చేసింది అనసూయ . ఈ భామ ఇంతగా రెచ్చిపోవడానికి కారణం ఏంటో తెలుసా ............ ఈ ఫోటో షూట్ చూసైనా అలాంటి పాత్రలు ఇస్తారని కాబోలు . మరి ఈ ఫోటో షూట్ తో సక్సెస్ అవుతుందా చూడాలి .

బాహుబలి2 తమిళ రైట్స్ ఎన్ని కోట్లో తెలుసా

ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించడమే కాకుండా ఆరు వందల కోట్ల వసూళ్ళ ని సాధించి సంచలనం సృష్టించింది బాహుబలి దాంతో బాహుబలి పార్ట్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి . ప్రస్తుతం భారీ ఎత్తున బాహుబలి పార్ట్ 2 క్లైమాక్స్ చిత్రీకరిస్తున్న విషయం తెలిసిందే . దాంతో ఈ సినిమా హక్కులను సొంతం చేసుకోవడానికి విరీతమైన డిమాండ్ ఏర్పడింది . బాహుబలి 2 తమిళ హక్కులు ఎంతకు పోయాయో తెలుసా ................ అక్షరాల 54 కోట్లు . బాహుబలి తమిళంలో కూడా భారీ విజయాన్ని పొందడంతో బాహుబలి 2 రేటు ఇంత భారీగా పలికింది . nఈ 54 కోట్ల లో తమిళ  సాటి లైట్ , ఆడియో , డిస్ట్రిబ్యూషన్ హక్కులు అన్నీ కలుపుకొని కాబట్టి ఇంత భారీ రేటు పెట్టి కొనుక్కున్న వాళ్ళకు గిట్టుబాటు అవుతుందనే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . ప్రభాస్ , రానా , రమ్యకృష్ణ , అనుష్క , తమన్నా , సత్యరాజ్ లు కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా ఆర్కా మీడియా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది . కాగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయనున్నారు . 

మొత్తానికి రకుల్ కు చాన్స్ ఇచ్చిన మహేష్

మహేష్ సరసన నటించడానికి రకుల్ ప్రీత్ సింగ్ ని ఎంపిక చేసారు దర్శకులు మురుగదాస్ . ఈ విషయాన్నీ అధికారికంగా దృవీకరించారు మురుగదాస్ . ఇక రకుల్ కూడా మహేష్ సరసన నటించే చాన్స్ లభించడంతో చాలా సంతోషంగా ఉంది . అసలు బ్రహ్మోత్సవం చిత్రంలోనే రకుల్ నటించాల్సి ఉంది కానీ డేట్స్ ప్రాబ్లెం వల్ల అప్పట్లో కుదరలేదు దాంతో ఇప్పుడు మురుగదాస్ తో చేస్తున్న సినిమా కోసం చాన్స్ ఇచ్చాడు మహేష్ . nవచ్చే నెలలో షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రంలో మొదట బాలీవుడ్ భామ పరినీతి చోప్రా ని అనుకున్నారు కానీ భారీ మొత్తం డిమాండ్ చేయడంతో ఆమె స్థానంలో రకుల్ ని ఎంపిక చేసారు . 

భక్తురాలిని గుడిలోనే రేప్ చేసిన పూజారి

తన సమస్యల పరిష్కారం కోసం దేవుడి కి మొర పెట్టుకోవడానికి వచ్చిన ఓ అభాగ్యురాలిని ఆ గుడిలోనే రేప్ చేసాడు ఓ దుర్మార్గపు పూజారి . ఈ దారుణ సంఘటన హైదరాబాద్ లోని నారాయణగూడ పోలిస్ స్టేషన్ ఎదురుగ ఉన్న గుడిలో జరగడం మరీ శోచనీయం . ఢిల్లీ కి చెందిన ఓ మహిళ ఆర్ధిక ఇబ్బందులతో బాధపడుతోంది కాగా దైవ దర్శనం కోసం హైదరాబాద్ లోని నారాయణగూడ దేవాలయానికి వచ్చింది . nఅయితే ఆమె ని చూసిన గుంటనక్క లాంటి పూజారి రాము ( 26) పరిచయం చేసుకొని నీ అన్ని సమస్యలకు ప్రత్యేక పూజలు చేయాలనీ చెప్పి అందుకు మధ్యహ్నం పూజా సామాగ్రి తీసుకొని గుడికి రమ్మని ఆమె వచ్చిన తర్వాత స్టోర్ రూమ్ కి తీసుకెళ్ళి పూజ పేరుతో బట్టలు విప్పించి పసుపు కుంకుమ శరీరంపై పూసి అత్యాచారానికి పాల్పడ్డాడు . ఊహించని సంఘటనతో షాక్ కి గురైన సదరు మహిళా గుడి ఎదురుగా ఉన్న పొలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది . బాధిత మహిళ ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసారు . 

రవితేజకు కూడా బాగా నచ్చిందట ఆ చిత్రం

జూలై 29న రిలీజ్ అయి విమర్శకుల ప్రశంసల తో పాటు ఇండస్ట్రీ ని కూడా ఆకర్షిస్తున్న చిత్రం ''పెళ్లి చూపులు ''. ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పడుతున్న ఈ చిత్రానికి ఇప్పటికే హీరోలు వెంకటేష్ , రానా , నితిన్ లు అభినందనలు తెలుపగా తాజాగా రవితేజ కూడా పెళ్లి చూపులు యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపించాడు . పెళ్లి చూపులు చిత్రం నాకు బాగా నచ్చిందని మరోసారి చూడాలనిపిస్తోందంటూ దర్శకులు దాస్యం తరుణ్ భాస్కర్ , హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ రీతూ వర్మ లను అభినందనలతో ముంచెత్తాడు . రవితేజ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది . రెండు వారాలుగా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ అలాగే ఓవర్సీస్ లోనూ మంచి వసూళ్ళ ని సాధిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది పెళ్లి చూపులు . కంటెంట్ ఉంటె కటౌట్ అవసరం లేదని మరోసారి నిరూపించిన చిత్రం పెళ్లి చూపులు.

కాలు జారి కింద పడిన కమల్ హాసన్

హీరో కమల్ హాసన్ కాలు జారి కింద పడటంతో గాయాల పాలయ్యాడు . ప్రస్తుతం చెన్నై లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు కమల్ . చెన్నై లోని తన ఆఫీసులోమెట్లు దిగుతున్న సమయంలో కాలు స్లిప్ కావడంతో మెట్ల మీద నుండి జారి కింద పడిపోయాడు దాంతో వెంటనే అప్రమత్తమైన కుటుంబ సబ్యులు కమల్ ని అపోలో ఆసుపత్రి కి తరలించారు . nప్రస్తుతం కమల్ శభాష్ నాయుడు చిత్రంలో నటిస్తున్నాడు . ఇటీవలే అమెరికాలో ఆ చిత్ర షూటింగ్ షెడ్యూల్ జరుపుకుంది . దాన్ని ముగించుకొని చెన్నై వచ్చాడు కమల్ . n 

చిరంజీవి సినిమాలో మళ్ళీ విజయశాంతి

90వ దశకంలో విజయశాంతి లేడి అమితాబ్ గా లేడి సూపర్ స్టార్ గా సంచలన విజయాలను అందుకుంది . అటు చిరంజీవి తో ఇటు బాలకృష్ణ తో హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు హీరోయిన్ ఒరియేంటెడ్ చిత్రాల్లో నటించింది . అయితే రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాక సినిమాలకు దూరమే అయ్యింది విజయశాంతి అయితే ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ సినిమాల్లోకి రావడానికి సమాయత్తం అవుతోందట అది కూడా మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తున్న నూటా యాభయ్యవ చిత్రంలో . n nచిరంజీవి - విజయశాంతి ల కాంబినేషన్ లో పలు సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి . మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత చిరంజీవి సినిమాలో విజయశాంతి నటించబోతోంది అన్న వార్తలు వినబడుతున్నాయి . ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ చిరు సినిమాలో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది . ఒకవేళ ఈ వార్త నిజమే అయితే మెగాస్టార్ ఫ్యాన్స్ కు విజయశాంతి ఫ్యాన్స్ ఆనందానికి అంతే ఉండదు . 

పాపం ! రాజమౌళి ఎంతగా ప్రచారం చేసినా

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ -గౌతమి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ''మనమంతా ''. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో సాయి కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందుతోంది అయితే కలెక్షన్లు మాత్రం అంతగా లేవు . దాంతో తన మిత్రుల కోసం కాలికి బలపం కట్టుకొని మరీ ప్రచారం చేస్తున్నాడు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి . సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా యాక్టివ్ గా ఉండే జక్కన్న మనమంతా చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి పాపం ! చాలానే కష్టపడుతున్నాడు . జక్కన్న ఇంతగా ప్రమోట్ చేస్తున్నా జనాలు మాత్రం ఆ సినిమాని పట్టించుకోవడమే లేదు . మోహన్ లాల్ స్థానంలో తెలుగు హీరో చేసి ఉంటె  మనమంతా చిత్రం మరోలా ఉండేదని అంటున్నారు . ఒకవైపు బాహుబలి పార్ట్ 2 షూటింగ్ తో చాలా బిజీ గా ఉన్నప్పటికీ తీరిక చేసుకొని మరీ ప్రచారం చేస్తున్నాడు జక్కన్న కానీ అతడి కష్టం ఫలించేలా మాత్రం లేదు .
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..