Home న్యూస్
టాలీవుడ్
 న్యూస్

మహేష్ జగన్ పార్టీలో చేరతాడట నిజమా ?

2019 ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారనున్నాయని తెలుస్తోంది . వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో మహేష్ బాబు చేరతాడని ,అలాగే కృష్ణ కుటుంబం మొత్తం జగన్ కు సపోర్ట్ చేస్తుందని అప్పుడే గుసగుసలు మొదలయ్యాయి . గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జగన్ పార్టీ పోటా పోటీ గా తలపడిన విషయం తెలిసిందే . స్వల్ప ఆధిక్యంలో బాబు అధికారం చేపట్టాడు . కాగా వచ్చే ఎన్నికల్లో బాబు కు కష్టాలు రావడం ఖాయమని ఎందుకంటే మహేష్ బాబు తో పాటు కృష్ణ కుటుంబం అలాగే మోహన్ బాబు కుటుంబం కూడా పూర్తి సపోర్ట్ జగన్ కే ఉంటుందని అంతేకాకుండా మహేష్ కీలక పాత్ర పోషిస్తాడని అంటున్నారు . అయితే ఇప్పటి వరకు అయితే మహేష్ ఎప్పుడు కూడా రాజకీయాల గురించి అంత ఆసక్తి ప్రదర్శించలేదు . మహేష్ రాజకీయాల్లోకి రావడం కష్టమే అని మరికొంతమంది అంటున్నారు . కానీ లోపల మాత్రం ఏదో జరుగుతోంది . 

చైతూ -సమంతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాగ్

నాగచైతన్య - సమంత ల ప్రేమకు కింగ్ నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు . అయితే నేరుగా చైతన్య ప్రేమిస్తోంది సమంత ని అని చెప్పలేదు కానీ నా ఇద్దరు కొడుకులు నాకు శ్రమ లేకుండా అమ్మాయిలను చూసుకున్నారని వాళ్ళ ప్రేమకు సంతోషంగా అంగీకరించామని త్వరలోనే ఆ వేడుకని కూడా చేస్తామని అయితే ఇద్దరు వచ్చి ఎప్పుడు చేయమని చెబితే అప్పుడే చేస్తామని నిర్ణయం నా వారసులదే నని స్పష్టం చేసాడు నాగార్జున . నాగచైతన్య - సమంత లు గతకొంత కాలంగా ప్రేమించుకుంటుండగా , అఖిల్ శ్రీయా భూపాల్ ని ప్రేమిస్తున్నాడు . దాంతో త్వరలోనే ఈ ఇద్దరి ప్రేమకు నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు . 

సినిమా చాన్స్ లేకపోవడంతో టివి కెలుతోంది

ఒకప్పటి గ్లామర్ హీరోయిన్ రాధ కూతురు ''కార్తీక '' హీరోయిన్ గా పరిచయం అయినప్పటికీ ఆ భామని ఎవరూ పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు ఎందుకంటే హీరోయిన్ గా సక్సెస్ కాలేదు పోనీ రాధ లాగా గ్లామర్ డాలా అంటే అదీ కాదు దాంతో తెలుగు , తమిళ భాషలలో ఈ భామకు చాన్స్ లు లేకుండా పోయాయి . తెలుగులో ఎన్టీఆర్ సరసన దమ్ము చిత్రంలో కూడా నటించింది ఆ సినిమా ఘోర పరాజయం పొందడంతో కార్తీక తెరమరుగయ్యింది . చేతిలో సినిమాలేవీ లేకపోవడంతో గోళ్ళు గిల్లుకుంటున్న ఈ భామకు తాజాగా ఓ గోల్డెన్ చాన్స్ వచ్చింది . రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రచన అందిస్తున్న ఓ టివి షోలో ఈ భామ బుల్లితెర రంగప్రవేశం చేస్తోంది . వెండితెర మీద లక్ లేకపోవడంతో బుల్లితెర కు వెళుతున్న ఈ భామకు మరి అక్కడ నైనా సక్సెస్ దరి చేరుతుందో లేదో చూడాలి . 

లస్సీ కోసం గర్భవతి అయిన రెజీనా

రాత్రి పూట లస్సీ తాగడం కోసం నేను గర్భవతి నని అబద్దం చెప్పింది బ్లాక్ బ్యూటీ రెజీనా . దాంతో ఆ కొట్టు వాడు రెజీనా పట్ల జాలి తో లస్సీ ఇచ్చాడట ఇంకేముంది హాయిగా తాగింది . లస్సీ అయితే తాగింది కానీ దాని కోసం చెప్పిన అబద్దమే చాలా చండాలంగా ఉంది . లస్సీ కోసం గర్భవతి అని చెప్పాల్సిన అవసరం ఏముందని నెటిజన్లు మండిపడుతున్నారు . తెలుగు , తమిళ చిత్రాల్లో నటిస్తున్న ఈ భామ కు అనుకున్నంత సక్సెస్ రాకపోవడంతో ఎక్స్ పోజింగ్ కి కూడా రెడీ అయిపొయింది కానీ ఎంతగా ఎక్స్ పోజ్ చేస్తానని చెప్పినప్పటికీ అగ్ర హీరోలు మాత్రం ఈ భామకు చాన్స్ ఇవ్వడం లేదు మరి . 

మేకను రేప్ చేసాడు ఈ దరిద్రుడు

రోజు రోజుకి అత్యాచారాలు ఎక్కువ అవుతున్నాయి , అయితే మహిళల పై , పిల్లల పై కూడా కానీ కానీ ఓ దరిద్రుడు ఏకంగా మేకని రేప్ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు దాంతో పోలీసులు ''అమీరుల్ ఇస్లాం '' అనే వాడ్ని అరెస్ట్ చేసారు . అసోం కు చెందిన అమీరుల్ కేరళకు వలస వచ్చాడు అక్కడ పెరంబ వూరు లో కార్మికుడిగా పనిచేస్తూ ఓ దళిత మహిలని కూడా రేప్ చేసాడు . తర్వాత ఓ లాడ్జి సమీపంలో మేక కట్టేసి ఉంటే ఆ మేక ని కూడా రేప్ చేసాడు . పోలీసులకు మేక ని రేప్ చేసిన విధానం చెప్పి షాక్ ఇచ్చాడట ! దాంతో మేక దగ్గరకు వెళ్లి చూడగా మేక కు తీవ్ర రక్త స్రావం కూడా అయ్యిందట దాంతో ఆ మేక ని ఆసుపత్రికి తరలించారు . ఈ దరిద్రుడి ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు . 

అక్కడ బాహుబలి రికార్డ్ ని బద్దలుకొట్టిన బన్నీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా బాహుబలి రికార్డ్ ని బద్దలు కొట్టాడు . ప్రపంచవ్యాప్తంగా 600 కోట్ల ని వసూల్ చేసిన బాహుబలి రికార్డ్ ని బన్నీ బద్దలు కొట్టడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? ఇది మొత్తం రికార్డ్ కాదు కేవలం విజయనగరం లో మాత్రం బాహుబలి వసూళ్ళ కంటే సరైనోడు వసూళ్లు ఎక్కువ . విజయనగరం లో 1,20,64, 161 కోట్లను వసూల్ చేసి రికార్డ్ సృష్టించాడు అల్లు అర్జున్ . బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన సరైనోడు చిత్రానికి మొదట డివైడ్ టాక్ వచ్చినప్పటికీ వసూళ్లు మాత్రం వీర లెవల్లో సాధించాయి .

హీరోగా సక్సెస్ కాలేకపోతున్న మంచు మనోజ్

మంచు మనోజ్ హీరోగా తెలుగు  తెరపై సత్తా చాటాలని పదేళ్లకు పైగా పోరాడుతూనే ఉన్నాడు పాపం ! కానీ ఇప్పటి వరకు సాలిడ్ హిట్ అంటూ ఏది లేకపోవడంతో గజినీ మహమ్మద్ లాగా దండయాత్ర చేస్తూనే ఉన్నాడు . కొన్ని చిత్రాలు హిట్ అయినప్పటికీ సాలిడ్ హిట్ మాత్రం మంచు మనోజ్ కు ఇంతవరకు లభించలేదు . ఇక ఇటీవల చేసిన చిత్రాలు ఇంకా దారుణమైన ఫ్లాప్ లుగా మిగలడంతో ఇక ఎలాగైనా సరే ఒక బంపర్ హిట్ కొట్టాలని చాలా కసిగా ఉన్నాడు. అందుకే కొంత గ్యాప్ తీసుకొని మరీ సబ్జెక్ట్ లను ఎంచుకుంటున్నాడు . మరి ఇప్పుడైనా సూపర్ డూపర్ హిట్ కొడతాడో చూడాలి . 

చిరు చిన్నల్లుడు కూడా హీరో అవుతున్నాడు

చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ కి సినిమాల్లో నటించాలనే ఆశ ఉందట అయితే ఈ విషయాన్నీ చిరు కి నేరుగా చెప్పకుండా భార్య శ్రీజ కు చెప్పడంతో శ్రీజ వెళ్లి చిరు కి చెప్పిందట దాంతో అల్లుడు హీరో అవుతానంటే సంతోషమే కదా అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట . అయితే హీరో కావాలని అనుకుంటే సరిపోదని దానికి తగ్గట్లుగా యాక్టింగ్ లో మెలుకువలు నేర్చుకుంటే మంచిదని తద్వారా విమర్శలపాలు కాకుండా ఉండొచ్చని సలహా కూడా ఇచ్చాడట . పిల్లనిచ్చిన మామ సపోర్ట్ ఉండటంతో కళ్యాణ్ హీరోగా రంగప్రవేశం చేయడానికి సమాయత్తం అవుతున్నాడట . ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుండి బోలెడు మంది హీరోలు వచ్చారు వాళ్ళలో కళ్యాణ్ కూడా ఒకడు కానున్నాడు . 

బికినీ వేస్తుందట కానీ

బ్లాక్ బ్యూటీ రెజీనా బికినీ వేయడానికి ఏమాత్రం అభ్యంతరం లేదని అయితే బికినీ ఎప్పుడు వేయాలో ఖచ్చితంగా ఒక నెల రోజుల ముందు చెప్పాలట ......... నెలరోజుల ముందు చెబితే బికినీ కి తగ్గట్లుగా తన బాడీ ని మలుచుకుంటుందట . ఎవరైనా బికినీ వేస్తాను లేదా వేయను అని అంటారు కానీ రెజీనా  మాత్రం బికినీ వేస్తాను కానీ నెల రోజుల గడువు కావాలని అడగటం విచిత్రంగా ఉంది . తెలుగులో టాప్ హీరోయిన్ అవుతానని ఎన్నో ఆశలు పెట్టుకుంది కానీ ఈ భామ ఆశలు మాత్రం నెరవేరడం లేదు . దాంతో ఇక బికినీ వేషాలు వేయడానికి సిద్దమౌతుంది . మరి బికినీ రెజీనా ని టాప్ రేంజ్ లో నిలబెడుతుందా లేదా చూడాలి .

నేను లోకల్ అంటున్న నాని

చంటిగాడు లోకల్ అనేది పూరి జగన్నాద్ ఇడియట్ సినిమాలో డైలాగ్ ఆ డైలాగ్ కి థియేటర్ లో ఈలలే ఈలలు మళ్ళీ ఇన్నాళ్ళకు ''నేను లోకల్ '' అంటున్నాడు న్యాచురల్ స్టార్ నాని . దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం ఈరోజు ఉదయం దిల్ రాజు ఆఫీసులో జరిగింది . ఈ ప్రారంభోత్సవానికి అగ్ర నిర్మాత అల్లు అరవింద్ హాజరై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు . నాని సరసన నేను శైలజ ఫేం కీర్తి సురేష్ నటిస్తుండగా త్రినాధరావు దర్శకత్వం వహిస్తున్నాడు . కామెడి ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం తప్పకుండా పెద్ద హిట్ అయి మా కాంబినేషన్ కు మంచి పేరు తెస్తుందని నమ్ముతున్నారు . ఇటీవల వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని నుండి వస్తున్న చిత్రం కావడం వల్ల భారీ అంచనాలే నెలకొనేలా ఉన్నాయి . 
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..