Home న్యూస్ జనతా గ్యారేజ్ కి రిలీజ్ డేట్ ప్రాబ్లెం
టాలీవుడ్
 న్యూస్

జనతా గ్యారేజ్ కి రిలీజ్ డేట్ ప్రాబ్లెంMurali R | Published:August 11, 2016, 12:00 AM IST
యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ మరో సమస్యలో చిక్కుకుంది . ప్రారంభోత్సవ సమయంలోనే ఆగస్టు 12న రిలీజ్ అంటూ ప్రకటించారు కట్ చేస్తే రిలీజ్ సమయం దగ్గర పడుతున్న సమయంలో సెప్టెంబర్ 2 కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు . ఇక సెప్టెంబర్ 2 కి రిలీజ్ అవ్వడం ఖాయమని భావిస్తున్న తరుణంలో మరో చిక్కు వచ్చి పడింది . సెప్టెంబర్ 2న భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి వామపక్షాలు అలాగే ట్రేడ్ యునియన్ లు దాంతో ఆ ఎఫెక్ట్ జనతా గ్యారేజ్ పై పడనుంది . ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం మొదటి రోజు ,అలాగే వీకెండ్ లో మొత్తం ఎంత లాగామన్నది ప్రధానం కాబట్టి భారత్ బంద్ రోజునే జనతా గ్యారేజ్ రిలీజ్ చేస్తే ఎన్టీఆర్ సినిమాకు కష్టాలు ఖాయం ఎందుకంటే బంద్ రోజున ఎలాగూ రెండు ఆటలు ఆడవు ,మిగతా రెండు ఆటల వల్ల వచ్చేది కొంతే ! దాంతో రికార్డు కలెక్షన్లు కూడా మిస్ అవుతాయి అందుకే మదన పడుతున్నారు దర్శక నిర్మాతలు . భారత్ బంద్ సెప్టెంబర్ 2న ఉన్నందున సినిమాని ఆ మరుసటి రోజున రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారట . మరి ఎప్పుడు డేట్ ఫిక్స్ చేస్తారో చూడాలి . 
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..