నిహారిక అక్కడైనా హిట్ కొడుతుందా


మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా పరిచయం అవుతోంది అంటే భారీగా అంచనాలు ఏర్పడ్డాయి అయితే ఆ అంచనాలను తల్లకిందులు చేస్తూ ఒక మనసు చిత్రం ఘోర పరాజయం పొందింది . దాంతో రెండో సినిమా చేయడానికి చాలా సమయం తీసుకుంది ఎట్టకేలకు తమిళ్ లో తన రెండో సినిమా అంగీకరించింది ఇందులో తమిళంలో వరుస విజయాలు సాధిస్తున్న విజయ్ సేతుపతి ఒక హీరో కావడంతో సినిమా హిట్ అవుతుందన్న నమ్మకంతో ఉంది నిహారిక . తమిళంలో తెరకెక్కుతున్న ” ఒరు నల్లనాల్ పొత్తు పాల్రెన్ ” చిత్రాన్ని తెలుగులో కూడా రీమేక్ చేయాలనే ఆలోచన చేస్తున్నారట .

అయితే దాంట్లో రాంచరణ్ నటిస్తే రీమేక్ సాధ్యం అవుతుంది లేదంటే లేదని అంటున్నాడు దర్శకులు ఆరుముగ కుమార్ . రాంచరణ్ సంగతి పక్కన పెడితే నిహారిక తెలుగులో డిజాస్టర్ చవిచూసింది మరి తమిళ్ లో అయినా హిట్ కొడుతుందా ? అన్నది ఇప్పుడు తేలాలి ఎందుకంటే మెగా హీరోలు నిహారిక ని హీరోయిన్ గా చూడటం ఇష్టం లేదని చెప్పినప్పటికీ పట్టుబట్టి మరీ హీరోయిన్ అయ్యింది సక్సెస్ అయితే అనుకున్నది సాధించినట్లు లేదంటే ఓ మచ్చే కదా !