షూటింగ్ కి ముందే లాభాలు తెచ్చిన నిఖిల్


Nikhil Siddharth’s Mudra satellite rights sold outయంగ్ హీరో నిఖిల్ తన కొత్త సినిమాతో షూటింగ్ కి ముందే లాభాలు తెస్తున్నాడు . తమిళంలో సూపర్ హిట్ అయిన కణితన్ అనే చిత్రాన్ని తెలుగులో ” ముద్ర ” పేరుతో రీమేక్ చేస్తున్నారు . తమిళ చిత్రానికి దర్శకత్వం వహించిన టి ఎన్ సంతోష్ ఈ తెలుగు చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు గా ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు నిర్మిస్తున్నాడు . ఇక ఈ సినిమా ప్రారంభం కాకముందే ఓ లీడింగ్ ఛానల్ ఈ చిత్ర శాటిలైట్ హక్కుల కోసం ఏకంగా 5. 5 కోట్ల కు బేరం కుదుర్చుకుంది .

ప్రారంభంలోనే అయిదున్నర పలికితే ఏరియాల వారీగా అమ్మకాలు , ఓవర్ సీస్ అమ్మకాలు అలాగే ఇతర బాషలలో అమ్మకాలు మొత్తం కలిపి నిర్మాతకు రిలీజ్ కి ముందే లాభాలు వచ్చేలా ఉన్నాయి . నిఖిల్ నటించిన కేశవ , కిరాక్ పార్టీ చిత్రాలు అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు అయినప్పటికీ డిమాండ్ బాగానే ఉంది నిఖిల్ కు .