బాలయ్య తో నటించనని తేల్చి చెప్పేసింది


nitya menon rejected ntr biopicనటసింహం నందమూరి బాలకృష్ణ సరసన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నటించే ఛాన్స్ వచ్చిన మాట నిజమే ! అని అయితే నాకున్న వ్యక్తిగత కారణాల వల్ల ఆ సినిమా చేయలేనని చెప్పానని స్పష్టం చేసింది అందాల భామ నిత్యా మీనన్ . తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే . అయితే ఎన్టీఆర్ భార్య పాత్రలో నిత్యా మీనన్ అయితే ముద్దుగా బొద్దుగా బాగుంటుందని ఆమెని సంప్రదించారట కానీ మొహమాటం లేకుండా సినిమా చేయనని చెప్పేసిందట నిత్యా .

ఆమె షాక్ ఇవ్వడంతో ఆమె స్థానంలో ఎవరిని తీసుకోవాలా అని తీవ్రంగా ఆలోచిస్తున్నారు ఆ చిత్ర బృందం . ఎన్టీఆర్ బయోపిక్ ని మరింత ప్రతిష్టాత్మకంగా రూపొందించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాడు బాలయ్య కానీ హీరోయిన్ లు మాత్రం ఇంకా కుదరడం లేదు .