ఎన్టీఆర్ కు ఆ సినిమాలో ఛాన్స్ ఇవ్వడం లేదు


no chance to jr ntr యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు బాలయ్య బాబాయ్ రూపొందిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ లో నటించాలని ఉంది కానీ బాబాయ్ నుండి ఇప్పటివరకు ఆహ్వానం అందకపోవడంతో కాస్త నిరాశగానే ఉన్నాడు . పైగా ఇటీవలే నాకు ఆహ్వానం అందలేదు , ఒకవేళ బయోపిక్ లో నటించమని కోరితే తప్పకుండా చేస్తానని అన్నాడు కూడా . అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ బయోపిక్ లో జూనియర్ ఎన్టీఆర్ నటించడం లేదు కానీ నందమూరి కళ్యాణ్ రామ్ మాత్రం నటిస్తున్నాడు .

నందమూరి హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ నటించనున్నాడట . ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు చైతన్య రథం కు సారధిగా వ్యవహరించాడు హరికృష్ణ . కళ్యాణ్ రామ్ తో పాటుగా నందమూరి తారకరత్న , నారా రోహిత్ లు కూడా నటించనున్నట్లు తెలుస్తోంది . ఎవరెవరినో అడుగుతున్నారు కానీ ఎన్టీఆర్ కు మాత్రం ఛాన్స్ ఇవ్వడం లేదు బాలయ్య .