ఆ డైరెక్టర్ కు ఏ హీరో కూడా ఛాన్స్ ఇవ్వడం లేదు


no offers to bommarillu bhaskarమొదటి చిత్రమే సూపర్ డూపర్ హిట్ అయ్యింది దాంతో సినిమా పేరునే తన ఇంటి పేరుగా బొమ్మరిల్లు భాస్కర్ గా ప్రశంసలు అందుకున్నాడు . బొమ్మరిల్లు చిత్రంతో ఒక్కసారిగా తెలుగు సినిమా పరిశ్రమ దృష్టి ని ఆకర్షించిన ఈ దర్శకుడి కి భవిష్యత్ అమోఘంగా ఉంటుందని అనుకున్నారు , దానికి తగ్గట్లుగానే రెండో సినిమా అల్లు అర్జున్ తో పరుగు అనే సినిమా చేసాడు అది పెద్ద హిట్ కాదు కానీ మంచి హిట్టే అయ్యింది . అయితే దాని తర్వాత మూడో సినిమా గా రాంచరణ్ తో ” ఆరెంజ్ ” అనే సినిమా చేసాడు . అదిగో ఆ సినిమానే బొమ్మరిల్లు భాస్కర్ కొంప ముంచింది .

 

ఆరెంజ్ ఘోర పరాజయం పొందడమే కాకుండా ఆ చిత్ర నిర్మాత అయిన నాగబాబు ని ఆర్ధికంగా నష్టపరిచి అతడు మానసికంగా కృంగిపోయేలా చేసింది దాంతో ఆరెంజ్ సినిమా నష్టం గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో బొమ్మరిల్లు భాస్కర్ కు సినిమాలు రాకుండా పోయాయి . అయితే ఆ తర్వాత ఒంగోలు గిత్త అనే సినిమా చేసాడు అది కూడా డిజాస్టర్ దాంతో ఛాన్స్ లు లేకుండా పోయాయి . ఏ హీరో కూడా భాస్కర్ కు ఛాన్స్ ఇవ్వడమే లేదు . ఆమధ్య తమిళ్ సినిమా ఒకటి చేసినా ఫలితం లేకుండా పోయింది పాపం . బొమ్మరిల్లు భాస్కర్ అంటే చాలు భయపడిపోతున్నారు హీరోలు .