ఎన్టీఆర్ మళ్ళీ తండ్రి కానున్నాడా


NTR all set to become a father againయంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటికే ఓసారి తండ్రి అయిన విషయం తెలిసిందే . నాన్నకు ప్రేమతో సినిమా సమయంలో ఎన్టీఆర్ తండ్రి అయ్యాడు దాంతో నాన్న ప్రేమ అంటే ఏమిటో తెలిసొచ్చింది , కట్ చేస్తే మళ్ళీ ఇన్నాళ్లకు ఎన్టీఆర్ – ప్రణతి లు మళ్ళీ తల్లిదండ్రులు కాబోతున్నట్లు తెలుస్తోంది అయితే ఈ విషయాన్నీ గోప్యాంగా ఉంచినప్పటికీ ఎన్టీఆర్ సన్నిహితుల ద్వారా ఈ విషయం తెలుస్తోంది .

త్వరలోనే పండంటి బిడ్డ కు ప్రణతి జన్మ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది , అయితే ఈ విషయాన్నీ ఇప్పుడే చెప్పకుండా ఆ సమయానికి తన అభిమానులకు చెప్పాలని భావిస్తున్నాడట ఎన్టీఆర్ . తమ అభిమాన హీరో మళ్ళీ తండ్రి అవుతున్నాడన్న విషయం అభిమానులకు తెలిస్తే వాళ్ళ సంతోషానికి అవధులే ఉండవు . ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నాడు . ఆ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మల్టీస్టారర్ చిత్రంలో నటించనున్నాడు .