అమెరికా వెళ్లిన ఎన్టీఆర్ చరణ్ లు


ntr-and-charan-fly-to-americaఈరోజు ఉదయం అమెరికా వెళ్లారు అగ్ర హీరోలు ఎన్టీఆర్ , చరణ్ లు . అయితే ప్రస్తుతం ఈ ఇద్దరూ కలిసి నటించనున్న చిత్రం షూటింగ్ జరగడం లేదు కానీ కొన్ని యాక్షన్ సన్నివేశాల కోసం అక్కడ శిక్షణ పొందనున్నట్లు తెలుస్తోంది , ఆ శిక్షణ కోసమే ఎన్టీఆర్ , చరణ్ లు అమెరికా వెళ్లినట్లు గా ప్రచారం సాగుతోంది . బాహుబలి లాంటి సంచలన విజయం తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి ఎన్టీఆర్ – చరణ్ లతో మల్టీస్టారర్ చిత్రానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే .

ఈ ఏడాది అక్టోబర్ లో ఈ మల్టీస్టారర్ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది కాగా అందులో యాక్షన్ సీన్స్ కోసం ఇప్పుడే శిక్షణ తీసుకోవాలని జక్కన్న ఆదేశించడంతో ఇద్దరూ వెళ్లారు . ప్రస్తుతం ఎన్టీఆర్ , చరణ్ ల ఎయిర్ పోర్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి . ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా కోసం ఏప్రిల్ నుండి డేట్స్ కేటాయించాడు , అలాగే చరణ్ బోయపాటి తో సినిమా చేస్తున్నాడు కానీ చరణ్ కూడా ఏప్రిల్ లోనే బోయపాటి తో జాయిన్ కానున్నాడు ఈలోపు జక్కన్న పని చూస్తారు .