ఎన్టీఆర్ సినిమా మార్చి 29న ప్రారంభం


ntr biopic gets launching dateమహానటుడు ఎన్టీఆర్ బయోపిక్ ని ఈనెల 29న హైద్రాబాద్ లోని రామకృష్ణా సినీ స్టూడియో లో ప్రారంభిస్తామని , కొన్ని కీలక ఘట్టాలను అక్కడే చిత్రీకరిస్తామని తెలిపారు నందమూరి బాలకృష్ణ . ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో చేతి గాయం ఇంకా పూర్తిగా తగ్గకముందే అసెంబ్లీ కి హాజరయ్యాడు బాలయ్య . ఆ సందర్బంగా మీడియాతో ఇష్టాగోష్టి లో మాట్లాడుతూ ఎన్టీఆర్ బయోపిక్ పై పలు విషయాలు వెల్లడించారు .

ఎన్టీఆర్ టైటిల్ కాకుండా రకరకాల పేర్ల ని సూచించారు చాలామంది కానీ అన్నింటిని మించి ఎన్టీఆర్ అనేదే పవర్ ఫుల్ కాబట్టి దాన్నే ఫైనల్ చేసాం , అలాగే మార్చి 29 న ప్రారంభమైన తర్వాత అప్రతిహతంగా షూటింగ్ ముగించి వచ్చే ఏడాది 2019 సంక్రాంతి కి ఆ సినిమాని విడుదల చేయాలనేది నా సంకల్పం . అలాగే రాజకీయ కోణం ఉంటుంది కానీ కొంతమంది కోరుకునే అంశాలు మాత్రం ఉండవు అని కుండబద్దలు కొట్టాడు బాలయ్య . తేజ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం కోసం పెద్ద ఎత్తున ఆయా పాత్రధారులను ఎంపిక చేస్తున్నారు .