మళ్ళీ బాలయ్య బాబాయ్ తో ఎన్టీఆర్ పోటీ


ntr-fight-again-with-balakrishna2016 లో నాన్నకు ప్రేమతో చిత్రాన్ని బాలయ్య బాబాయ్ నటించిన డిక్టేటర్ తో పోటీగా విడుదల చేసి సత్తా చాటాడు ఎన్టీఆర్ , అయితే అలా బాబాయ్ సినిమాతో పాటుగా రిలీజ్ చేయడం వల్ల బాలయ్య బాబాయ్ ఆగ్రహానికి గురయ్యాడు ఎన్టీఆర్ . అసలే ఎన్టీఆర్ అంటే అంతగా పొసగదు బాలయ్య కు ఈ సంఘటనతో మరింత దూరమయ్యాడు ఎన్టీఆర్ . కట్ చేస్తే మరోసారి బాలయ్య బాబాయ్ తో పోటీ పడటానికి మళ్ళీ ఎదురు వెళ్తున్నాడు ఎన్టీఆర్ .

ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ బయోపిక్ ని బాలయ్య నిర్మిస్తున్న విషయం తెలిసిందే . తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలనీ ప్రారంభోత్సవం నాడే ప్రకటించారు కాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రాన్ని కూడా దసరా కానుకగా అక్టోబర్ 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . అంతేకాదు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసారు . అంటే ….. మళ్ళీ దసరా బరిలో బాలయ్య బాబాయ్ తో ఎన్టీఆర్ పోటీ పడటం ఖాయమై పోయింది . అయితే అప్పటి వరకు విడుదల లో మార్పులు ఉండొచ్చు ఒకవేళ మార్పులు లేకపోతే ఇద్దరి మధ్య మరింత అగాధం పెరగడం ఖాయం .