త్రివిక్రమ్ కోసం సిక్స్ ప్యాక్ చేస్తున్న ఎన్టీఆర్


యంగ్ టైగర్ ఎన్టీఆర్ మళ్ళీ సిక్స్ ప్యాక్ కి రెడీ అవుతున్నాడు , ఇంతకుముందు టెంపర్ చిత్రం కోసం సిక్స్ ప్యాక్ ట్రై చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా కోసం సిక్స్ ప్యాక్ ట్రై చేస్తున్నాడు . తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కొత్త సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే . అయితే రెగ్యులర్ షూటింగ్ మాత్రం మార్చి నెలలో ప్రారంభం కానుంది ,ప్రస్తుతం ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ శిక్షణ తీసుకుంటుండగా త్రివిక్రమ్ మాత్రం స్క్రిప్ట్ ని మరింతగా తీర్చి దిద్దే పనిలో పడ్డాడట . 
 
త్రివిక్రమ్ ఇటీవలే అజ్ఞాత వాసి చిత్రంతో ఘోర పరాజయం ఎదుర్కొన్నాడు దాంతో ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ ని మరోసారి సరి చేసే ప్రయత్నం చేస్తున్నాడట ఎందుకంటే పవన్ సినిమా ఇచ్చిన షాక్ తో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు . ఎన్టీఆర్ కూడా అదే సలహా ఇచ్చాడట దర్శకుడికి . మొత్తానికి ఇన్నాళ్లకు ఎన్టీఆర్ -త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా ఎలాంటి ఫలితాన్ని పొందుతుందో చూడాలి .