ఎన్టీఆర్ వార్నింగ్ ఇచ్చాడట


ntr warns his cookయంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంట్లో వంటపని చేసే వ్యక్తిగా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడట , అయితే ఈ వార్నింగ్ ఆవేశంతో ఇచ్చింది కాదు సుమా ! సినిమా కోసం తనని తాను మార్చుకుంటున్న ఎన్టీఆర్ అందులో భాగంగా వంటలో మార్పులు చేయాలనీ గట్టిగా చెప్పాడట . ఇదంతా ఎందుకోసమంటే త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించబోయే సినిమా కోసమే సుమా ! గతకొంత కాలంగా రోజుకి మూడు గంటల చొప్పున ఎక్సర్ సైజ్ చేస్తున్నాడు ఎన్టీఆర్ .

సరికొత్త లుక్ లో ఎన్టీఆర్ కనిపించాలని అలాగే ఫిజిక్ కూడా అందరినీ ఆశ్చర్య పరిచేలా ఉండాలని భావిస్తున్నాడట అందుకే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు . త్రివిక్రమ్ దర్శకత్వంలో తొలిసారిగా నటిస్తున్నాడు ఎన్టీఆర్ . ఇక ఈ సినిమాని దసరా లోపు కంప్లీట్ చేసి రాజమౌళి సినిమా కోసం రెడీ కానున్నాడు .