పాపం ! ఆ డైరెక్టర్ ఆశలన్నీ గల్లంతయ్యాయ్


pawan kalyan director santosh srinivas project canceledపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయబోతున్నాను అంటూ సంతోషపడ్డాడు కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు , స్క్రిప్ట్ వర్క్ అంతా అయ్యాక చావు కబురు చల్లగా చెప్పాడట పవన్ కళ్యాణ్ ఇప్పట్లో సినిమా చేసే ఉద్దేశ్యం ఏమి లేదని పైగా తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేసినట్లు తెలుస్తోంది దాంతో పాపం ! ఆ డైరెక్టర్ ఆశలన్నీ గల్లంతయ్యాయి . ఇంతకీ పవర్ స్టార్ ని డైరెక్ట్ చేయాలనీ ఆశపడిన డైరెక్టర్ ఎవరో తెలుసా ……. సంతోష్ శ్రీనివాస్ .

 

రామ్ తో కందిరీగ వంటి హిట్ ని ఇచ్చిన ఈ కుర్ర డైరెక్టర్ ఎన్టీఆర్ తో రభస అంటూ అట్టర్ ప్లాప్ ని ఇచ్చాడు . మళ్ళీ రామ్ తోనే హైపర్ అనే యావరేజ్ చిత్రానికి దర్శకత్వం వహించాడు అయితే వెంటనే పవన్ కళ్యాణ్ నుండి పిలుపు రావడంతో ఎగిరి గంతేశాడు కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం లేకుండా పోయింది . సినిమా చేయలేనని పవన్ చెప్పడంతో మైత్రి మూవీస్ సంస్థ లోనే మరో హీరోతో ఆ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .