పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని అరెస్ట్ చేసిన పోలీసులు


pawan kalyan fans arrested పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న శ్రీరెడ్డి ని ఎంకరేజ్ చేస్తూ గంటలతరబడి లైవ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్న టివి 9 ఛానల్ కు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ అభిమానులు సదరు ఛానల్ ముందు ఆందోళనకు దిగడంతో రంగప్రవేశం చేసిన పోలీసులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు . శ్రీరెడ్డి తో పాటుగా మరికొందరు జూనియర్ ఆర్టిస్ట్ లు సైతం పవన్ కళ్యాణ్ పై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే .
దాంతో పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా దెబ్బ కొట్టడానికి కొంతమంది ఇలా కావాలని చేస్తున్నారని ఆరోపిస్తూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బంజారాహిల్స్ లోని టివి 9 ఛానల్ ముందు ఆందోళన కు దిగారు అయితే ఛానల్ వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫ్యాన్స్ ని అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు . ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ ఎన్నికలకు ఇంకా సంవత్సరం సమయం ఉంది కానీ అప్పుడే ఎన్నికల వేడి మొదలయ్యింది రెండు తెలుగు రాష్ట్రాలలో .