ప్రేక్షకులను అలరించడానికి పెళ్లిగోల 2 రెడీ


pelligola 2 season on 19 th mayపెళ్లి గోల తెలుగు సిరీస్ విజయవంతం కావడంతో దానికి సీక్వెల్ గా పెళ్లి గోల 2 ని రూపొందించారు . ఈ పెళ్లి గోల 2 వ్యూ డాట్ కామ్ లో చూసేలా ఏర్పాట్లు చేసారు సదరు పెళ్లిగోల యూనిట్ సభ్యులు . శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ” లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ” చిత్రంలో ఒక హీరోగా నటించిన అభిజీత్ దుడ్డాల ఈ సిరీస్ లో హీరోగా నటించాడు . పెళ్లి గోల మొదటి సిరీస్ లో కూడా అభిజీత్ నటించగా అది సక్సెస్ ఫుల్ అవ్వడంతో మళ్ళీ ఈ రెండో సిరీస్ లో కూడా హీరోగా నటిస్తున్నాడు . ఇక హీరోయిన్ గా వర్షిణి సౌందర రాజన నటిస్తోంది .

వర్షిణి సౌందర రాజన బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలే ! పలు సీరియల్ లలో నటిస్తోంది వర్షిణి . ప్రేమ , పెళ్లి , పెళ్లయ్యాక వైవాహిక జీవితంలో సాగే ఒడిదుడుకులతో ఈ పెళ్లి గోల 2 ని రూపొందించామని , తప్పకుండా మొదటి సిరీస్ కంటే రెండో సిరీస్ మరింతగా ఆదరణ కు నోచుకుంటుందని సంతోషాన్ని వ్యక్తం చేశారు పెళ్లి గోల 1 , పెళ్లి గోల 2 దర్శకులు రామ్ , మాలిక్ రామ్ లు . వ్యూ డాట్ కామ్ లో ఈనెల 19 నుండి పెళ్లి గోల 2 సీజన్ ప్రారంభం అవుతుందని , వ్యూ యాప్ ద్వారా వీక్షించవచ్చని పేర్కొన్నారు .