రజనీ కాలా పై కోర్టు ఆదేశాలు


police protection for rajinikanth kaala in karnataka సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ” కాలా ” చిత్రం ఈనెల 7న భారీ ఎత్తున విడుదల అవుతున్న సందర్బంగా కర్ణాటకలో కొంతమంది కాలా చిత్రాన్ని విడుదల కానివ్వమని హెచ్చరికలు జారీ చేసారు . దాంతో కోర్టు ని ఆశ్రయించారు అక్కడి బయ్యర్లు , కోర్ట్ జోక్యం చేసుకొని కాలా థియేటర్ లకు రక్షణ కల్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది . కోర్టు కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడంతో తప్పకుండా రక్షణ కల్పిస్తామని అయితే ఎక్కడెక్కడ ప్రదర్శిస్తున్నారో దాని తాలూకు వివరాలను అందజేయమని బయ్యర్లను కోరింది .

పా . రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన కాలా చిత్రం ముంబై మాఫియా నేపథ్యంలో తెరకెక్కింది . రజనీకాంత్ సరసన ఈశ్వరీ రావు , హుమా ఖురేషి నటించగా కీలక పాత్రలో నానా పటేకర్ నటించాడు . చాలాకాలంగా కర్ణాటక – తమిళనాడు మధ్య కావేరి జలాల మధ్య గొడవ జరుగుతూనే ఉంది దాంతో వీళ్లకు వాళ్లకు ఉప్పు నిప్పు లా తయారయ్యింది పరిస్థితి .