త్రివిక్రమ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన భామ


poonam kaur sensational comments on trivikramదర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది హీరోయిన్ పూనం కౌర్ . ఇంతకుముందే త్రివిక్రమ్ పై నిప్పులు చెరుగుతూ నన్ను అవమానాల పాలు చేసాడని హీరోయిన్ లను వాడుకుంటాడని అలాగే నన్ను కూడా వాడుకోవడానికి ట్రై చేసాడని సంచలన ఆరోపణలు చేసిన పూనం కౌర్ తాజాగా మరోసారి త్రివిక్రమ్ పై విరుచుకుపడింది . ఇక ఈసారైతే ఫారిన్ హీరోయిన్ లకు తన సినిమాలో ఛాన్స్ లు ఇస్తున్నాడని ….. అందుకు ప్రతిఫలంగా వాళ్ళు అతడికి ఏం చేస్తున్నారో అంటూ అక్కసు వెళ్లగక్కింది .

అయితే త్రివిక్రమ్ పేరు ఎక్కడా ప్రస్తావించలేదు పూనం కౌర్ కాకపోతే తెలివిగా ” జల్సాలు చేస్తూ అజ్ఞాతవాసంలో ఏసేస్తాడు ” అంటూ హింట్ ఇస్తోంది . ఎన్నారై హీరోయిన్ లను ఈ దర్శకుడు బాగా వాడుకుంటాడని కూడా ఆరోపిస్తోంది . దర్శకుడి పేరు చెప్పలేదు కానీ అతడు దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్ చెప్పేసింది . అదే జల్సా , అజ్ఞాతవాసి , అంటే ఆ రెండు సినిమాల దర్శకుడు ఎవరు ? అంటే ఎవరైనా ఇట్టే చెబుతారు ……. త్రివిక్రమ్ అని . ఈ భామకు త్రివిక్రమ్ కు కోపం ఎందుకయ్యా అంటే ఈ భామని మోసం చేసాడట ! అందుకు . మరి త్రివిక్రమ్ మాత్రం నోరు మెదపడం లేదు ఏంటో మరి .