పూనం కౌర్ విమర్శించింది ఆ డైరెక్టర్ నేనా


Poonam Kaur shocking allegations on Tollywood top  directorమాజీ హీరోయిన్ పూనమ్ కౌర్ ఓ దర్శకుడి పై సంచలన ఆరోపణలు చేసింది , కాస్టింగ్ కౌచ్ అన్న పదం ఎక్కడా వాడలేదు కానీ పూనం కౌర్ చెప్పిన దాని ప్రకారం ఫిలిం ఇండస్ట్రీ లో మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని తెలుస్తోంది . అవకాశాల పేరిట బలహీనతలను ఆసరాగా చేసుకొని మహిళలను ఆటబొమ్మ లుగా చేస్తున్నారని ఆరోపించింది ఈ భామ . అయితే పూనం కౌర్ ఇంతటి సంచలన ఆరోపణలు చేసిన దర్శకుడు ఎవరా ? అన్న చర్చ జరుగుతోంది .

ఇంతకీ పూనం కౌర్ చేసిన ఆరోపణల పర్వం దర్శకుడు త్రివిక్రమ్ పైనే అని అనుమానంగా ఉంది . ఈ భామ పవన్ కళ్యాణ్ కు అలాగే త్రివిక్రమ్ కు సన్నిహితురాలు కానీ ఈ భామకు వాళ్ళ సినిమాలలో ఛాన్స్ మాత్రం రాలేదు . దాంతో ఈ ఆరోపణలు చేస్తోంది అని తెలుస్తోంది . త్రివిక్రమ్ పేరు ని ప్రస్తావించలేదు కానీ వేళ్ళు మాత్రం ఆ వైపు నే చూపిస్తున్నాయి . తెలుగులో పలు చిత్రాల్లో నటించింది పూనమ్ కౌర్ కానీ అంతగా స్టార్ డం కలిసి రాలేదు కానీ పవన్ కళ్యాణ్ పుణ్యమా అని ఆంధప్రదేశ్ చేనేత బ్రాండ్ అంబాసిడర్ మాత్రం అయ్యింది .